top of page

My Memories With Mine - 07

Updated: Oct 18, 2023

🔚THE END 🔚



నా జీవితం లో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని అనుకోలేదు. చాలా మంది చెప్తూ ఉన్నారు, నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు చెప్పమని కాని చెప్తే ఎక్కడ ఉన్న friendship కూడా పోతుందో అని భయం వేసి చెప్పలేదు, చెప్పాల్సిన time వస్తుందని ఇంతకాలం ఎదురుచూస్తూ ఉన్నా కాని దానికంటే ముందు నీకు కావాల్సిన రోజు వచ్చినట్టు ఉంది.. నేను మన స్నేహాన్ని పసుపుతాడు వరకు తీసుకు వెళ్ళాలి అనుకున్న కాని నవ్వు మాత్రం రాఖీ తో ముగించేశావ్.. మన ఇద్దరి కోరిక ఒకటే జీవితాంతం ఉండాలి అని, కాని ఎలా ఉండాలి అనేది మాత్రం ఇద్దరం different దారులని చూసకున్నాం.

ఒక సంవత్సరం నుండి నీ మీద ఇష్టం పెంచుకుని, జీవితం మొత్తం నీతో ఊహించుకుని పిచ్చోడిలా బ్రతికేస్తున్న నా ప్రేమకి వాల్యూ ఇవ్వని వాళ్ళు, కేవలం నువ్వు ఒక్క క్షణం ఆగి కట్టిన రాఖీ కి మాత్రం చాలా value ఇవ్వడం correct అంటావా ?? ఇప్పటినుండి నువ్వు ఇంతకీ ముందులా ఇబ్బంది పడకుండా, free గా ఉంటావేమో కాని నాకు మాత్రం ఏది ఇంతకు ముందులా ఉండదు.. ఏ పాటలు వింటూ నిన్ను imagine చేసకున్నానో ఇప్పుడు అదే పాటలు వింటుంటే నా మీద నాకే చిరాకు వస్తుంది. ఒకప్పుడు ఏ చందమామని చూసి ప్రశాంతతకి, చల్లదననానికి ప్రతిరూపం అనుకున్నానో ఇప్పుడు అదే చందమామని చూస్తుంటే నా హృదయం మొత్తం అగ్నిపర్వతం నుండి బయటకి వచ్చిన లావా ల మండిపోతుంది.. ఒకప్పుడు నీతో కలిసి నడిస్తే చాలు అనుకున్న కాని రేపటి నుండి నీతో వేసే ప్రతి అడుగు ఏదో ముళ్ళ పాన్పు పైన నడుస్తున్నట్టు ఉంటుందేమో.. ఒక్కసారి అయిన నీ పెదవులపై నా పేరుని వినాలి అనుకున్న కాని రేపటినుండి ఏమని పిలుస్తావొ అని భయం.. నీన్ను చూసిన ప్రతిసారిని నీ కళ్ళలో ఒక కొత్త ప్రపంచాన్ని చూసకునేవాడిని కాని రేపటినుండి నిన్ను చూసే ధైర్యం అయిన చేయగలనా!!

ఏంటో నా జీవితంలో మనశ్శాంతి, Happines అనేవి ఒక పండగలా అయ్యిపోయాయి, వచ్చాయి అని మురిసిపోయేలోపే మాయమయ్యిపోతున్నాయి.. రేపటినుండి నీ ముందు ఉండే నాకు, ఇంతవరకు నువ్వు చూసిన నాకు కచ్చితంగా ఏదో కోల్పోయి ఉంటాను..

నువ్వు నన్ను ఇంతకాలం ఎలా చూశావో తెలియదుకాని నాకు మాత్రం నువ్వు special person రా.. ఒక్కసారి నీ చేతిలో చేయి వేసినప్పుడు నా ప్రపంచాన్ని అక్కడతో ఆపేశా, ఎందుకో తెలియదు చిన్నప్పుడు మా అమ్మ నా చేయి నడిపించినప్పుడు వచ్చిన ఆనందం, నేను ఉన్న అనే ధైర్యం మళ్ళీ చాలా కాలం తరువాత నువ్వు పట్టుకున్నప్పుడే అనిపించింది. నేను ఒప్పుకుంటా నువ్వు పరిచయం కాకముందు చాలామంది తో మాట్లాడినా, కాని నేను నిన్ను చూసిన క్షణం నుంచి ఇంకెవరితో మాట్లాడలనుకోలేదు.. కాని నితో పరిచయం కుదరలేదు, కాని అనుకోకుండా సంక్రాంతి నా లైఫ్ లో ఒక కొత్త వెలుగుని నీ రూపం లో నా జీవితంలోకి పంపించింది, కాని అప్పుడు అర్ధం అవ్వలేదు, ప్రతి వెలుగుకి చీకటి కూడా ఉంటుంది అని, ఆ చీకటి ఇప్పుడు ఇలా అలముకుంది నా చుట్టూ..

కొంతమంది అన్నారు, ఎప్పటికైనా ఆ అమ్మాయి నీ సొంతం కాదు, ఎప్పటికైనా ఇదేగా జరగాల్సింది అని, వాళ్ళందరికీ నా సమాధానం ఒకటే.. ఎప్పుడో చనిపోతాం అని తెల్సి భయపడి ఈ రోజే ఉరి వేసుకుని చనిపోవడం ఎంత మూర్ఖత్వం అవుతుందో , ఎప్పుడో విడిపోతాము అని తెల్సి ఇప్పుడే ఇలా ఉండటం అంతకంటే మూర్ఖత్వం.. కాని నేను మాత్రం నీ విషయంలో నా feelings మాత్రం change అవ్వవు, కావలిస్తే నీతో మాట్లాడటం మానేసకుంటాను కాని ఇలా relation మార్చుకుంటూ నటించడం నా వల్ల అవ్వడం లేదు, గత మూడు రోజులుగా నేను బాధపడని క్షణం లేదు..

ఒక్కసారి అయిన నీ నోటినుండి నేనంటే ఇష్టం అని చెప్తే వినాలి అని అనుకున్న కాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆ మాటకి value లేదు.. may bee it will take some time to accept what is happening in my life.. నా అదృష్టం ఏంటి అంటే ఇప్పటివరకు ఆ అమ్మాయి ఎవరు అనేది ఎవరికి తెలియలేదు( including you )... కాని ఒక్కోసారి ఆలోచించాల్సిందిరా కట్టేముందు.... ఒకప్పుడు నువ్వు ఉంటావాని ధైర్యంతో ఎవరు ఉన్న లేకపోయినా పర్లేదు అని నాకు నచ్చినట్టు బ్రతికేశా, ఇప్పుడు నువ్వు కూడా ఉండవని తెల్సిన తరువాత నాకెవ్వరు వద్దు అనే stage కి వచ్చేశా..

కాని ఒకటి మాత్రం నిజం, అబ్బాయి ఒక పరిచయాన్ని బంధం గా మార్చుకోవాలి అనేది ఒక ఆడపిల్ల పిండాన్ని బిడ్డగా మార్చడానికి పడెంత కష్టం తో సమానం, ఆ బంధం వదులుకునేటప్పుడు వచ్చే బాధ కూడా ఆడదానికే బాగా తెల్సు..;..

నా ప్రేమలో ఎన్ని అమావాస్యలు వచ్చిన ఇంతకాలం పౌర్ణిమ వెన్నల కోసం ఎదురుచూసా కానీ ఇప్పుడే తెలిసింది నేను కళ్ళు మూసుకుని ఎదురు ఎదురుచూస్తున్న అని... ఇప్పటివరకు నన్ను నడిపించింది రెండే రెండు, ఒకటి ఆశ, రెండు భయం.. నువు ఎలాగయినా నా జీవితంలోకి వస్తావు అనే ఆశ..

ఏ క్షణంలో నన్ను వదిలి వెళ్ళిపోతావొ అనే భయం..

ఈ రెండింటి మధ్యలోనే నా జీవితం గడిచిపోయింది, చివరికి భయమే నిజమైంది...

ఒక మధుర జ్ఞాపకం... తన చేతి స్పర్శ....

ఒక మధుర జ్ఞాపకం... తన నోటి మాట....

ఒక మధుర జ్ఞాపకం... తన పరిచయం....

ఒక మధుర జ్ఞాపకం... తన చూపు........

ఒక మధుర జ్ఞాపకం... తను నన్ను పిలిచిన పిలుపు....

ఒక మధుర జ్ఞాపకం... తను నాకు ఇచ్చిన చివరి బహుమానం....


iam ending up this with by saying I LOVE YOU dear and bee happy......


Thank You For Reading

Uma

note: thankyou for everyone who supported me in this matter... iam ending up this with this... Na chethiki kattina athi koddi rakhilalo needhi kuda okati...!!

Comments


Post: Blog2 Post
bottom of page