My Memories With Mine - 06
- Uma225
- Aug 6, 2023
- 2 min read
Updated: Oct 18, 2023
Friendship day ✨
ఒక్క person నాలో ఇంత change తిస్కోవస్తారని తెలియదు, నువ్వు నాతో పరిచయం అయ్యేవరకు..
Okka person ని ఇంత ప్రేమించవచ్చు అని తెలియదు, నిన్ను ప్రేమించేవారు..
ఒక్క person తో lifelong ఉండొచ్చు అని తెలియదు, నీతో నా లైఫ్ ఊహించుకునేంత వరకు...
ఇప్పటివరకు నువ్వే నా destiny అనుకున్నా కానీ నీ disturbance నేను అని నాకు అర్ధం అయ్యింది... నేను నిన్ను నా సంతోషానికి కారణం గా feel అవుతున్నా కానీ నాకు తెలియకుండానే నీ బాధకి కారణం అవ్తున్ననేమో అని అనిపిస్తుంది... ఇప్పటికీ ఎప్పటికీ నాకు అర్థం కానిది ఒకటే నీ ప్రేమలో ఓడిపోయానో లేక గెలిచానో తెలియడం లేదు కానీ నాకు మాత్రం నేను కోరుకున్న వాటిని కోల్పోవడం, కోల్పోయిన వాటినే మళ్ళీ కోరుకోవడం అలవాటు అయిపొయింది.... అసలు నేను ఏ ఆనందం కోసం అయితే నీతో మాట్లాడాలి అనుకున్నానో, నీతో మాట్లాడక ముందే ఆ ఆనందం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది.. దాని కారణం ఏంటో కూడా తెలియడం లేదు.. నీతో కలిసి అడుగులు వేయాలి అనుకున్నా కానీ మొదటి అడుగుకే ఆటంకం పడుతుంది అని అనుకోలేదు 😔...
నీ పరిచయం ముందు వరకు lifelong నాతో నా ఫ్రెండ్స్ ఉంటే చాలు అనుకున్నా కాని ఇప్పుడు మాత్రం నువ్వు లేకుండా ఇంకెంత మంది ఉన్నా నా జీవితానికి value లేదు అనిపిస్తుంది.. ఈ విషయం నీకు చెప్పడానికి మన మధ్య అంత communication లేదు. ఈ రోజు మాత్రం నీకు sorry చెప్పాలి ఎందుకంటే నీ అనుమతి లేకుండా నిన్ను నాలో దాచేసుకున్నందుకు...!
ఇన్ని రోజులు నేను నీకు connect అయ్యా అనుకున్నా కాని self-realize అయిన తర్వతనే తెలిసింది నీకు addict అయ్యా అని,.. ఒకటి మాత్రం నిజం అందరూ ఎదో alcohol, cigarate కి addict అవుతారు కానీ అలాంటి వాళ్ళు కూడా ఒక్కసారి నీ నవ్వును చూస్తే అవ్వన్నీ వదిలేసి ఒకసారి నీ నవ్వును చూస్తే చాలు అని నీ వెనుక తిరుగుతారెమో🥰🥰....!
రోజుకి కొన్ని వందల కళ్ళు చూస్తుంటాను కానీ వాళ్ళందరిలో లేనిది నీ కళ్ళలో ఉన్నది ఏమిటో తెలియలేదు.. కొన్ని వేల అడుగులు వేస్తాను కానీ నీతో కలిసి అడుగు వెయ్యాలని ఎందుకు మనసు ఆరాటపడుతుందో తెలియదు.. కొన్ని లక్షల ఆలోచనలు వస్తున్నాయి కానీ నీ ఆలోచనలు మాత్రమే ఎందుకు ఇంతలా కలవరపరుస్తున్నయో తెలియడం లేదు.. రోజులో చాలా పదాలు పలుకుతూ ఉంటాను కానీ నీ పేరుని పలికినప్పుడు చిరునవ్వు ఎందుకు వస్తుందో తెలియడం లేదు.. కానీ ఒక చిన్న కోరిక మాత్రం ఉంది😁😁
అందరికోసం వెతికే నీ కళ్ళు ఒక్కసారి అయిన నా కోసం వెతికితే చూడాలని ఉంది...
అందరి పేర్లు పలికే ఆ పెదవులు ఒక్కసారి నా పేరు పలికితే వినాలని ఉంది...
అందరితో నడిచే ఆ పాదాలు నాతో ఒక్క అడుగు వేసిన నడవాలని ఉంది...
అందరికోసం ఆలోచించే ఆ మనసు ఒక్కసారి అయిన నన్ను తలుచుకుంటే బాగుండనిపిస్తుంది...
నిజంగా అందరూ అనుకున్నట్టు మన మధ్య ఉన్నది నిజమే అయితే నిన్ను కలిసి ఇవన్నీ మాట్లాడేవాడిని కానీ ఎమ్ చేస్తాం, అనుకున్నవన్నీ నిజాలు అవ్వవు గా😔😔..!! నేను అందరికీ చెప్పినట్టు విడిపోవాలని అనిపించే వ్యక్తివి కాదు నువ్వు, ఎప్పటికైనా విడిచిపెట్టకుండా ఉండాలి అనిపించే వ్యక్తివి... దూరం అవ్వాలి అనిపించే వ్యక్తివి కాదు, ఎంత దూరం అయిన కలిసి నడవాలి అనిపించే వ్యక్తివి....
HAPPY FRIENDSHIP DAY 💐💐
thank you for Reading
Uma
Comments