top of page

My Memories With Mine - 05

Updated: Oct 18, 2023



నిజమా!! - కాదా!!


ఈ ప్రపంచంలో మంచి - చెడు, పాపం - పుణ్యం, నిజం - అబద్ధం అంటూ ఏమీ లేవని నా అభిప్రాయం. అవన్నీ కేవలం మన ఆలోచన బట్టి మారిపోతాయి.. ఇప్పుడు నా చుట్టూ ఉన్న situations అన్ని నన్ను నిజం అనే మాయలో ఉంచుతున్న అందమయిన అబద్ధాలు మాత్రమే.. నీ గురుంచి అన్ని నేను అడగలేను, అడిగితే మళ్ళీ ఎమ్ అవ్తుందో అని భయం, అడగకపోతే ఎక్కడ నాకు దూరం అయ్యిపోతావో అని భయం.. incase నువ్వు నిజం చెప్పిన, నేను nice అని smile ఇవ్వగలను అంతేగానీ వద్దు అని restrict చెయ్యలేను..!!

ఎవరితో అయినా problem ఉంటే వాళ్ళతోనే మాట్లాడి తేల్చుకోవాలి అంతేగానీ వేరే వాళ్ళు చెప్పినదాన్ని బట్టి judge చెయ్యకూడదు అని అనుకోవడం easy నే కానీ అలా మాట్లాడిన తర్వాత వచ్చే situation నీ face చేసి నిలబడటానికి చాలా దైర్యం కావాలి.. నాకు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే నీ నుండి వచ్చే ఏ చిన్న మార్పు అయిన నాకు తీరని బాధ కలిగిస్తుంది, అందుకే ఇలా మిగిలిపోయా.

మనచుట్టూ ఉన్నవాళ్లు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు, వాటికి value ఇవ్వకూడదు అని అనుకోవడానికి బాగుంటది కానీ నేను కూడా అలాంటి మనుషులతోనే ఉంటున్నాను, అందరిలానే ఆలోచిస్తాను అనే విషయాని నీ కోసం మర్చిపోవాలెంటేనే కష్టం గా ఉంటుంది......

ఇప్పటివరకు నువ్వు నాకోసం టైం కేటాయించి మాట్లాడుతున్నావ్ అనుకున్న గానీ ఏదో టైం ఉంది అని మాట్లాడావ్ అని ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది.. నువు నాకు మళ్ళీ దగ్గరయ్యవన్న ఆనందం కన్నా ఎక్కడ మళ్ళీ దూరం అయిపోతావో అనే భయమే నాలో ఎక్కవగా ఉంది...

నువ్వు నాతో మాట్లాడిన మాట్లాడకపోయినా just నా కళ్లముందు ఉంటే నాకు ఏదో తెలియని happiness, ఎప్పటికైనా మాట్లాడతావ్ అని, కానీ ఎప్పుడయితే నాకు కనిపించనంత దూరం వెళ్ళిపోయావో అప్పుడే అనిపిస్తుంది నన్ను కూడా మర్చిపోతావేమో అని.... నాకు తెలిసి, మనకి ఏదైనా కావాలి అనిపిస్తే దానికోసం fight చెయ్యాలి, fight చెయ్యకుండా వదిలేసిన వాటి గురించి ఏడ్చే right లేదనుకోడం నిజమెనంటావా!! Ofcourse నేను నీకోసం fight చెయ్యలేను కానీ right అయితే ఉంది..


ఆనందంగా ఉన్న నువ్వే గుర్తొస్తున్నవ్..

బాధ లో ఉన్న నువ్వే గుర్తొస్తున్నావ్...

నన్ను పడుకోబెడుతున్నవి నీ మాటలే...

నన్ను మేల్కొలుపుతున్నవి నీ ఆలోచనలే...

Sudden గా కళ్లముందు కనిపిస్తావ్...

కనురెప్ప కాలంలోనే మాయమయిపోతావ్...

అందరిలో ఉన్న గుర్తొస్తావ్...

నా ఒంటరితనంలో కూడా తోడుగా అనిపిస్తావ్....

ఒక్క క్షణం లో కన్నీళ్ళు తెప్పిస్తావ్...

మరుక్షణమే ఆనంద బాష్పాలు గా మార్చేస్తావ్...

ఏమిటో ఈ మాయ..


నీ feelings నుండి move on అవుదాం అనుకున్నా ప్రతిసారీ నా మనసు నాకు చెప్తుంది ఒకటే... వదిలేసే ముందు ఆలోచించుకో, ఎందుకంటే మళ్ళీ నిన్ను పొందే అవకాశం నాకు రాదనీ.... లైఫ్ అంటే మన feelings కి reality మధ్య adjust అవుతూ ఉండటమే... కానీ నీ విషయంలో మాత్రం నా feelings ని వదులుకుని కేవలం realityని accept చెయ్యాల్సి వస్తుంది.. ఒకసారి ఆలోచించు, కేవలం నీ photo నా మొబైల్ లో ఉంటేనే sweet memory గ ఫీల్ అవుతున్నా, అలాంటిది ఇంకా నువ్వు life long నాతోనే ఉంటే ఇంకెంత బాగుంటుందో కదా..


కానీ చివరిగా నన్ను ఎవరైనా నిజం - అబద్ధం దేనికి value ఇస్తావు అని అడిగితే.. ఇప్పటికైతే ఆనందాన్ని దూరం చేసే నిజంలో బ్రతకడం కన్నా అదే ఆనందాన్ని రెట్టింపు చేసే అబద్ధంలో బ్రతకడానికి ఇష్టపడుతున్నా... నాకున్న doubt ని nuvvu మాత్రమే clarify చేయగలవు, ప్రతి సారి పీలుస్తున్న గాలి మన ప్రాణం అంటున్నాం కదా, మరి ప్రతి క్షణం గుర్తు వచ్చే నిన్ను ఎమి అనాలో నువ్వే చెప్పు ......!!

నీ జ్ఞాపకాలకి విలువెంత??

మోయాలనుకుంటే ఒక జీవితకాలమంతా...

వదిలేయలంటే ఊపిరి ఆగినంతా...

బాధ పడాలి అంటే కన్నీరు ఇంకిపోయెంతా...

బాధ్యతలా అనుకుని పరిగెడుతూ కోల్పోయిన అనందమంతా...

మనం ఎంత మంచిగా ఉన్న ఎవరోకరి లైఫ్ లో bad గ మిగిలిపోతాం అని తెల్సు, కానీ ఇది చదివిన తర్వాత నీ దగ్గర నేను నాకున్న value కోల్పోతా అని తెలిసి కూడా upload చేస్తున్నా... ఎందుకంటే నిజంగా ఎవరితో అయినా బంధం మనస్ఫూర్తిగా కావాలి అనుకుంటే మనం వద్దు అనుకున్నా, వాళ్ళని వదులుకోలెమని నా నమ్మకం...


---The End ---


Note: expecting comments 🙂🙂

1 Comment


😉😉😉..
😉😉😉..
Jul 03, 2023

Thanani emaina adagalanukunte adagandi leka emaina cheppaalanukunte cheppeyandi.. Positive response vasthe manchidhe ga.. Vunna chance ni miss chesukuni tharvaatha thanaki cheppaledhano /adagaledhano regret feel avvekante.. 👉🏻👈🏻Konchemaina effort pettinattuntaadhiga..

Like
Post: Blog2 Post
bottom of page