My Memories With Mine - 04
- Uma225
- Jun 24, 2023
- 2 min read
Updated: Oct 18, 2023
నా చెలి :
నాకు తెల్సు,
నిన్ను కొన్ని సార్లు irritate చేస్తున్న అని,
కొన్ని సార్లు hurt చేస్తున్న అని,
కొన్నిసార్లు ని విషయం లో over-react అవతున్న అని,
కాని ఇవ్వన్ని ఎందుకు అంటే మాత్రం ఒకటే నా సమాధానం,,
i love you And feel comfortable with you..
నాకోసం ఒకటి చేస్తావా అని అడగాలి ఉంది ..
నేను ఇప్పటివరకు చాలామంది దేవుళ్ళను కోరుకున్న, నువ్వు జన్మ జన్మలకి నాతోనే ఉండాలి అని, కాని నిన్ను మాత్రం, ఫస్ట్ టైమ్ అడుగుతున్న, మనకంటూ వేరే జన్మ ఉంటే నన్ను మాత్రం మళ్ళీ కలవకు, ఎందుకంటే ఈ జన్మకి నువు ఇచ్చిన బాధని తట్టుకోవడమే కష్టం గా ఉంది, మళ్ళీ వేరే జన్మ అంటే తట్టుకోవడం నా వల్ల కాదేమో .
నీ బంధాన్ని వదులుకోలేను..
నా బాధని చెప్పుకోలేను..
మనం కలిసిఉండే రాతలేదు..
నువ్వు దూరమయితే తట్టుకునే శక్తి అంతకన్న లేదు..
నిన్ను మర్చిపోవడానికి చాలా ట్రై చేశా, అందుకే రెండు నెలలు ని నుండి నన్ను నేను దూరం పెట్టుకోవడానికి చాలా ట్రై చేశా.. నిన్ను దూరం పెడితే మెల్ల మెల్లగా నిన్ను నేను మర్చిపోతానేమో అనుకున్న కాని నా నుండి నేనే దూరం అవ్తున్నాను అని తర్వాత తెల్సింది..
నీ నుండి దూరం అవ్వాలి అనుకున్న కాని,
నీ photos మొత్తం నా gallery లోనే ఉన్నాయని ..
నీ పుట్టినరోజు ఇంకా నాకు గుర్తుందని ..
నీ మాటలు ఇంకా నాకు గుర్తుఉందని ..
నీ నెంబర్ ఇంకా నా దగ్గరే ఉందని..
నీ name వింటే చాలు నా faceలో smile అలాగే ఉంటుందని..
అందరూ అంటుంటారు కదా, బాధ అంటే రోజు ఏడవడం కాదు, అసలు ఎడవలేకపోవడం అని. మన చుట్టూ చాలా మంది ఉన్న వారిలో ఒక్కరితో కూడా దాని గురుంచి చెప్పలేకోపోవడమే అని, కానీ నేను పడుతున్నా బాధ కంటే అదే better ఏమో అని అనిపిస్తుంది.. కానీ నిజం నీకే తెలియాలి..
అనుకోకుండా కలిసాను ..
ఎలా మొదలాయిందో,
ఎక్కడ మొదలాయిందో తెలియదు కాని,
బంధంగా మారింది..
నాకు తెలియకుండానే విడదీయలేని అనుబంధం గా అయ్యింది..
చాలా తక్కువ time లోనే నీకు దగ్గరయ్యాను..
నా personal situation వల్ల దూరం అయ్యాను..
ఇంత త్వరగా విడిపోవాల్సి వస్తుంది అని కలలో కూడా అనుకోలేకపోయాను.
కాని ఒక్క మాట మాత్రం నిజం , నా లైఫ్ లో ని పరిచయం ఎప్పటికీ special గానే ఉంటుంది, ఎప్పటికీ మారిచిపోలేనేమో అనిపిస్తుంది.. ఎంతైనా బాధ పడినవారికి తెల్సినంత pain, బాధ పెట్టిన వారికి తెలియదుగా.. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, నేను ఎక్కడ ఆనందంలో పడి బాధని మర్చిపోతానేమో అని దేవుడు నిన్ను నా life లోకి పంపించి బాధని మరిచిపోకుండా చేసాడేమో అని.. బ్రతికుండగానే నరకాన్ని పరిచయం చేసావు.. ఒక అద్బుతం లాంటిది అని అనుకున్న ప్రేమే నాకు ఇప్పటివరకు తెలియని ఒక చీకటి ప్రపంచాన్ని పరిచయం చేసింది....
ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నావ్ అని ఆనందపడలో లేక ఇష్టం లేకుండా మాట్లాడుతున్నావ్ అని బాధ పడాలో తెలియని పరిస్థితిలో నన్ను పడేశావ్. ఒక్కోసారి అందరినీ వదిలేసి ఎటుఅయిన దూరంగా వెళ్లిపోదాం అనిపిస్తుంది కాని కొన్ని కారణాలు గుర్తొచ్చి ఆగిపోయిన క్షణాలు ఎన్నెన్నో ఉన్నాయి..
ఎవరు ఏమి అనుకున్నా.. నాకు మాత్రం ఈ situation చాలా బాగుందనిపిస్తుంది....
ఎప్పుడు నీ అలోచనలోనే ఉండటం...
ఎప్పుడు నిన్ను మాత్రమే తల్చుకోవడం..
నీతో share చేసుకున్న మాటల్ని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకునీ మురిసిపోవడం...
ఈ ఊహాలన్ని ఊహించుకుంటూ అలా అలా గడిపేయడం...
నీకోసం వెతుకుతున్న నా కనులకు తెలియదు నీ చూపు నాకోసం వెతకదు అని....
నిన్నే తలచుకునే నా హృదయానికి తెలియదు, ఏమరుపాటులో కూడా నీ ఆలోచనల్లోకి నన్ను రానివ్వవని....
కానీ బాగుంది ఈ గమనం లేని గమ్యం...
సాగని ప్రయాణం కోసం ఆగని ఆలోచనలతో సతమతమవ్వడం..
నాకు కూడా చిన్న స్వార్థం ఉంటుంది గా.. నువ్వు నాకే సొంతం కావాలి అని, నాతోనే మాట్లాడాలి అని, నాతోనే టైం spend చెయ్యాలి అని... కానీ నా మనసు ఒప్పుకొని situation kuda కొన్ని ఉన్నయిలే..
నేను రాస్తున్నవి చదువతున్నవారిలో చాలా మంది నేను relationship లో ఉండి రాస్తున్న అనుకుంటున్నారు కాని వాళ్ళకి తెలియదు నేను ఎవరితో అయితే నా future ని imagine చేసకున్నానో వాళ్ళు నాతో లేరు, ఇకపై రారు అని..
thank you for reading
Uma
Can I End With Next Part
0%Yes
0%No
note : next part will be the last part..
コメント