top of page

My Memories With Mine - 01

Updated: Feb 16, 2024

గత రెండు నెలలు గా, నితో మాట్లాడకుండా ఉండేసరికి నిన్ను మర్చిపోయాని అని అనిపించింది కాని నిన్ను చూసిన క్షణమే నా మనసుకి తెల్సింది, నిన్ను మరచిపోవడం కష్టం అని. నా గుండె చేసే ప్రతి ధ్వనిలో ని శ్వాస దాగి ఉందని. నువ్వు నీ కళ్ళలోకి చూసి మాట్లాడు అన్న ప్రతిసారి నా కళ్ళకి ఎందుకు చెమటలు చిందిచాయో తెలియదు. గుండెలో దాగి ఉన్న ప్రేమాంత ఒక్కసారిగా నోటి నుండి బయటకి రాలేక, కళ్ళతో చెప్పలేక , మనసుకి మాటకి జరిగిన మౌన యుద్దం ప్రతిఫలం కన్నీటి రూపంలో వచ్చాయి. ఆ క్షణం నా మనసు అడగాలి అనుకున్న మాటల్ని నా మౌనం ఎందుకు దాచేసిందో తెలియదు.

అనుకోకుండా కలిసిన స్నేహమా..

కలలా వచ్చావు..

వరమై నిలిచావు..

కనుమరుగై పోవుకదా..

కలలో కూడా నన్ను విడిచిపోకు...

అని అడగాలి అని అనిపించింది. కాని అప్పటికే నన్ను మర్చిపోయి హాయిగా ఉన్న నిన్ను చూసి ఇంకా అడగాలి అనిపించలేదు. కాని ఈ రోజు నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది కానీ, అవి చెప్తే వినేంత సమయం ని దగ్గర లేదేమో అని భయం వేసి చెప్పలేదు. ఎప్పటిలాగానే నేను నా ఫీలింగ్స్ చెప్తున్నప్పుడు ఎక్కడ నువ్వు టాపిక్ divert చేస్తావేమో అని భయం వేసి నీకు సమాధానం ఇవ్వలేకపోయా..

నీకు నాలా నువ్వంటే ఇష్టం అని చెప్పే అబ్బాయిలు రోజుకోకరు కనిపిస్తారేమో కాని నాకు మాత్రం,నువ్వంటే ఇష్టం అని చెప్పాలి అనిపించే అమ్మాయి మాత్రం నీ తర్వాత ఇంకెవరూ కనిపించలేదు. ఎందుకంటే అందరిలా నేను నిన్ను చూసి ఇష్టపడలేదు,కేవలం ఇష్టపడ్డాక మాత్రమే నిన్ను చూశాను. కాని ఆ తర్వాత అర్ధం అయ్యింది నేను ఎంత పెద్ద తప్పు చేశానో, నాకు సొంతం కాని అమ్మాయి కోసం నేను కలలు కంటున్న అని,

కొందరు ఎప్పటికీ మనసొంతం కాదు అని తెల్సి కూడా, వాళ్ళతోనే మన లైఫ్ మొత్తం imagine చేస్కుంటాము, చివారికి వాళ్ళతో గడిపిన చిన్న చిన్న క్షణాలతోనే బంధిగా ఉండిపోతాము, ఇదేనేమో జీవితం అని కొన్నిసార్లు నాలో నాకే అనిపిస్తుంది.

ఒకప్పుడు ఫస్ట్ మెసేజ్ వచ్చే person నోటి నుండి ఇప్పుడు నీకు first మెసేజ్ చేయాలి అంటే ego అడ్డు వస్తుంది అనే మాట ప్రతి ఒక్కరినీ చాలా బాధపెడుతుంది అని నాకు ఈ మధ్యనే అర్ధం అవుతుంది.

నువ్వు అన్నీ సార్లు " నీ problem ఏంటి ? " అడిగినప్పుడు అయిన చెప్పాల్సింది, నా problem నువ్వే అని కాని ఏమి చేస్తాను చెప్పు, నా problem అండ్ దానికి solution నువ్వే అయినప్పుడు నేను మత్రం ఎవరికి చెప్పగలను..

కొన్ని పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయి,

కొన్ని పరిచయాలు అనుభవాన్నిస్థాయి,

కొన్ని పరిచయాలు బాధని ఇస్తాయి..

కొన్ని పరిచయాలు జీవితంలో ఎలా బ్రతకలో నేర్పిస్తాయి,,

కొన్ని పరిచయాలు జీవితంలో ఏది శాశ్వతం కాదు అనే గుణపాఠం నేర్పిస్తాయి..

ఇందులో ని పరిచయం ఏమి నేర్పించిందో తెల్సుకోవాడానికి నాకు ఇప్పుడు ఉన్న పరిచయాలన్నింటిని వదులుకున్న తప్పులేదు అనిపిస్తుంది.................()


about next part

  • interested

  • not intereted




note: it continous to next part, if you interested, then you can subscribe to this blog for further updates. I hope you will subscribe to this blog ( chinnistories.com ) comment important mowa.....

Comments


Post: Blog2 Post
bottom of page