చందమామ'తో' కధలు - 11
- Uma225
- Aug 3, 2024
- 4 min read
CLIMAX EPISODE
ఎప్పటిలాగానే చంద్రుడు చాలా ఆసక్తిగా చూస్తున్నాడు... వినాయకుడేమో ఏదో ఆలోచిస్తూ కొంచెం బాధగా ఉన్నాడు.. గమనించిన చంద్రుడు “ఏమయ్యింది స్వామి.. ఈరోజు కొంచెం బాధగా కనిపిస్తున్నారు...? ఇంతకీ కథ ఎక్కడ?” అని అడిగాడు.. దానికి వినాయకుడు నీరసంగా “మూషికం వెళ్ళింది.. కథ తీసుకురావడానికి..” అని చెప్పారు.. “మళ్ళీ చంద్రుడు “స్వామి! ఈరోజు చివరి ఎపిసోడ్ అని బాధపడుతున్నారా?” అని సందేహంగా అడిగాడు.. దానికి వినాయకుడు “ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది.. కాకపోతే కొన్ని ముగింపులు మనకి నచ్చుతాయి.. మరికొన్ని నచ్చవు...” అని అన్నాడు.. చంద్రుడు “అయితే మరి ఈ కథ ఏం అవుతుంది..” అని అడిగాడు.. ఇంతలో మూషికం కథని తీసుకొచ్చి వినాయకుడు చేతిలో పెట్టింది.. పెడుతున్నప్పుడు తన మూషికం కనులనుండి వస్తున్న నీళ్ళు వినాయకుడి చేతుల మీద పడ్డాయి.. అది చూసిన వినాయకుడు మౌనంగా అ కథని చదవడం మొదలుపెట్టాడు.. మూషికం మనసులో ఆందోళన ఆలోచిస్తూ చదవడం మొదలుపెట్టాడు కాని చివరికి వినాయుకుడి కళ్ళు కూడా తడిచిపోయాయి.. చంద్రుడు ఇవేమీ గమనించకుండా కథ ఎప్పుడు మొదలవుతుందో, ఏం జరుగుతుందో అని ఆనందంగా, ఆతృతగా చూస్తున్నాడు.. ఇంకా ఓపిక పట్టలేక “స్వామి! ఇంకా మొదలుపెడదామ” అని అడిగాడు.. ఇంకా వినాయకుడు కూడా సరే అని కథని మొదలుపెట్టాడు..
కొన్ని రోజులకి ఇంకా annual day కూడా వచ్చేసింది.. మార్నింగ్ అందరూ వచ్చారు కాని అను, జాను మాత్రం రాలేదు.. ఇంకా శివ చందు వాళ్ళ గురుంచి ఆలోచిస్తూ, ఫంక్షన్ హడవిడిలో ఉన్నారు.. ఇంకా సాయంత్రం అయ్యింది.. అను కాల్ చేసి మేము వస్తున్నాము అని చెప్పింది.. అను ఒకటే వచ్చింది జాను రాలేదు.. తనని తీసుకురావడానికి చందు వెళ్ళాడు.. శివ అలా అనూని చూస్తూ ఉండిపోయాడు.. అను చీకటిలోకూడ మెరిసిపోతుంది.. తన చుట్టూ ఉన్న చీకటినే అందమయిన చీరల మలుచుకుని, స్వయంగా వెలిగిపోతుంది.. తన చిరునవ్వు నుండి వచ్చే కాంతి, చంద్రకాంతిని మించి ఉంది.. తన చూపుకి పక్కనే ఉన్న కలువలు వికసించాయి.. పాటలలా ఉన్న తన మాటలని విన్న కోకిలలు పాడటం మొదలుపెట్టాయి.. ఇంకా అలా చూస్తూ అను దగ్గరకి వేళ్లీ hug చేసుకున్నాడు.. అనుతో “ప్రేమించడం అంటే ముట్టుకోవడమొ లేక పట్టుకోవడమొ కాదు జీవితాంతం కాపాడుకోవడం..” అని తన వెలికి ఉన్న ఉంగరం అను పెడుతుండగా శివకి కాల్ వచ్చింది.. లిఫ్ట్ చేశాడు.. “ఏంటి!!!!” అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు..
వెంటనే చంద్రుడు “స్వామి! ఆరోజు మనం చూసిన అమ్మాయి అను నా?” అని అడిగాడు.. వినాయకుడు నవ్వుతూ “హ అవును.. మనం చూసింది అనుని..” అని చెప్పాడు.. ఇంకా చంద్రుడు ఆనందంతో “ఇప్పుడు చెప్పండి స్వామి.. ఆ వెలుగుకి కారణం ఏంటి?” అని అడిగాడు.. వినాయకుడు ఇంకా తన చేతిలో కథని పక్కన పెట్టేశాడు.. “ఇంకా నీకు అర్ధం అవ్వలేదా సోమేశ్వరా! ఈ సృష్టిలో నీకన్నా.. నాకన్నా.. ఆ పరమేశ్వరుడి వరం కన్న.. విలువైనది.. గొప్పది.. ముఖ్యమైనది ఒకటే.. అదే ప్రేమ ..!! అను తన ప్రేమని గెలిపించుకోవడానికి చాలా కష్టపడింది.. ప్రేమించిన అబ్బాయి మంచివాడు కాదు అని తెలిసి కూడా తనని మంచిగా మార్చుకోగలని నమ్మకంతో ఆ ప్రేమని గెలిపించుకోవడానికి కష్టపడుతూనే వచ్చింది.. దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని తన ప్రేమని గెలిపించుకుంది.. తన ప్రియుడికోసం ఓర్పుగా చూడటంలో భూదేవిని మించిపోయింది. తనకి ఆనందం పంచడంలో లక్ష్మీదేవిని మించిపోయింది.. తనకి ప్రేమ పంచడంలో పార్వతీదేవిని మించిపోయింది.. ఇంతమంది దేవతలని తనలో పెట్టుకున్న అను నుండి ఆ మాత్రం వెలుగు రావడం సహాజమెగా.. ఈ సృష్టికి మూలం ప్రేమ.. ఆదిదంపతులు కలవడానికి కారణం ప్రేమ.. కాని ఇప్పుడు కోపం-ద్వేషం, గర్వం-పొగరు ఇలాంటి వాటిలో పడి అసలు జన్మకి కారణం అయిన ప్రేమని మర్చిపోయి ఎవరికివారు మాకు మేమే గొప్ప అనుకుంటున్నారు.. నువ్వు కూడా నీ వెలుగు కేవలం నీ అధికారం అని పొగరుతో ఉన్నావు కాని అది పరమశివుడు నీకు ప్రేమగా ఇచ్చిన బహుమానం అని గుర్తుపెట్టుకోలేకపోయావ్.. ప్రజలు దేవుళ్లుగా పూజిస్తున్న మనమే ఇలా ప్రేమని మరిచిపోయి గర్వంతో వీర్రవీగుతుంటే భూలోకంలో ప్రజలు మాత్రం మనకే ఆ ప్రేమని చూపిస్తుంటే నాకు చాలా గొప్పగా అనిపించింది.. ఇపుడు నీకు గుర్తుచేయడానికి ఈ కథని చెప్పా.. ఇప్పటికైన నువ్వు మారతావని అనుకుంటున్నా..” అని చెప్పాడు..
ఆ మాటలని విన్న చంద్రుడు బాధతో ఏడుస్తూ “నన్ను క్షమించు గణేశా! ఇప్పటివరకు నేను గర్వంతో ఉన్నానని అర్ధమయ్యింది.. నేను చేసిన తప్పు నాకు అర్ధమయ్యింది.. ఇకముందు నేనెప్పుడూ ఇలాంటి తప్పు చెయ్యను..” అని ఏడుస్తున్నాడు.. ఇంకా చంద్రుడితో “నువ్వు చేసిన తప్పు తెల్సుకున్నావ్.. ఇంకా కర్తవ్యం పూర్తయ్యింది.. ఇంకా నీ వెలుగుని నీకు ఇచ్చేస్తున్నా.. ఇంకా ప్రతిక్షణం నువ్వు నిండుగానే ప్రకాశిస్తూ ఉంటావ్...” అంటూ వినాయకుడు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకున్నాడు.. కాని చంద్రుడు మాత్రం “ వద్దు స్వామి! నేను చేసిన తప్పుని మారిచిపోకుండా ఉండాలంటే ఇలాంటి శిక్ష ఉండాలి.. అయిన నేను ఇది శిక్షల అనుకోవడంలేదు గణేశా.. నేను చేసిన తప్పుకు పరిహారం అనుకుంటున్నా.. కాబట్టి నేను సంతోషంగా అమావాస్య, పౌర్ణమిలని నా కాలక్రమంలో తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాను.. ” అని చెప్పాడు.. ఇదంతా చూస్తున్న దేవతలందరు తాము మరిచిపోయిన విషయాలని గుర్తుచేసిన వినాయకుడికి హర్షధ్వానాలతో జేజేలు పలికారు..
ఇంకా వినాయకుడు మూషికం మీద ఎక్కి కైలాసానికి బయలుదేరాడు.. మూషికం మౌనంగా ఉండటం గమనించిన వినాయకుడు “ఏంటి మూషిక! ఏదో ఆలోచిస్తున్నావ్.. మౌనం వీడి ఏమయినా అడుగు” అని అన్నాడు.. మూషికం “ఎందుకు స్వామి! కథని సగం వరకే చెప్పి ఆపేశారు?” అని అడిగాడు.. వినాయకుడు నవ్వుతూ “నేను ఆపలేదు ముషికా.. వాళ్ళే అడగలేదు..” అని అన్నాడు.. మూషిక “అర్ధంకాలేదు స్వామి.. కొంచెం విడమరిచి చెప్పండి” అని అడిగాడు.. వినాయకుడు నవ్వుతూ “ఇందులో విడమరచడానికి ఏమి లేదు.. ప్రతికథ నుండి ప్రతిఒక్కరూ వాళ్ళకి కావాల్సిన వరకు మాత్రమే విని, వాళ్ళకినచ్చినట్టు అర్ధం చేసుకుంటున్నారు.. అక్కడ చంద్రుడికి కూడా ఆ వెలుగికి కారణం మాత్రమే అడిగాడు కానీ కథలో చందు జాన్ ఏమయ్యారని అడగలేదు.. అలాగే మనుషులుకూడా ఎదుటివాళ్ళ జీవితకథలో వాళ్ళు చేసిన తప్పుని మాత్రమే చూస్తున్నారు కాని ఆ తప్పు ఎందుకు చేశాడు అని ఆలోచించకుండ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఇప్పుడు నేను చెప్పిన కథ దేవుళ్ళకి మరచిపోయిన ప్రేమని గుర్తుచేసింది.. అలాగే మనుషులకి కూడా వాళ్ళ చేస్తున్న తప్పుని గుర్తు చేస్తుందని అనుకుంటున్నా.. ” అన్నాడు.. మూషికం “పోనీ స్వామి.. ఇప్పుడు చెప్పండి ఆ చందు జాన్ ల కథ గురుంచి” అని అడిగాడు..
వినాయకుడు “ ఒక మనిషి తన స్వచ్చమయిన చిరునవ్వుని కోల్పోవడానికి పెద్ద తప్పులు ఏమి చేయాల్సిన అవసరం లేదు.. కేవలం ఒక వ్యక్తిని మనస్పూర్తిగా ప్రేమిస్తే చాలు... అదే తప్పు మన చందు కూడా చేశాడు.. ఇంతకాలం తన సంతోషానికి కారణంగా అనుకున్న జాన్ ఇప్పుడు ఆ సంతోషం దూరం అవ్వడానికే కారణం అవుతుంది అని తెలుసుకునే రోజుకూడా వచ్చింది.. జాన్ ప్రేమ దొరకడం చందు వరంలా అనుకున్నాడు కాని దొరికిన ప్రేమ మళ్ళీ దూరం అయితే అనుభవించాల్సిన శాపం గురుంచి ఆలోచించలేదు.. జాన్ మాట్లాడితే చాలు అదే ఆనందం అనుకున్నాడు కాని ఆ మాటలు మౌనంగా మారితే వచ్చే బాధని మరచిపోయాడు.. జాన్ నవ్వే తన జీవితం అనుకున్నాడు కాని జాన్ వలన తన నవ్వు దూరం అవుతుంది అని ఊహించలేకపోయాడు.. జాన్ తన జీవితంలోకి రావడం అద్భుతం అనుకున్నాడు కాని రేపటిరోజు ఈ గతం ఒక పెనుభూతంలా వెంటాడబోతుంది అని తెల్సుకోలేకపోయాడు.. ఇన్ని రోజులు తన గుండెలో స్థానం కోసం చూశాడు కాని గుండెపగిలి ఏడ్చే రోజులు రాబోతున్నాయి అని గుర్తించలేకపోయాడు.. అందుకే ఇక్కడ లేడు.. అయిన ఇంకా ఈ కథని ఇంకా రాసే ఓపిక ఉమాకి ఉందేమోకాని చెప్పే ఓపిక నాకు లేదు.. కొన్ని కథలు ఇలా సంతోషంగా పూర్తవ్వడమే మంచిది..” అని అనుకుంటూ వెళ్లిపోయారు..
(వినాయకుడు చెప్పకుండ వెళ్ళిపోయిన రహస్యం, జాన్ ని ఎక్కించుకుని వస్తున్న చందు బైక్ కి ఆక్సిడెంట్ అయ్యింది.. జాన్ స్పాట్ లో చనిపోయింది.. చందు తీవ్రగాయాలతో హాస్పిటల్ లో ఉన్నాడు.. కొంచెం సేపటికి స్పృహ వచ్చింది, జాన్ కోసం చుట్టూ చూశాడు కాని కనిపించలేదు.. ఇంకా శివ జరిగింది చెప్పాడు.. చందు కంగారుగా జాన్ దగ్గరకి వెళ్ళాడు.. అలా తన జాన్ మృతదేహం చూసిన చందుకి మాటలు రాలేదు.. జాన్ ఇంకా లేదు అనే మాటలు విన్న చెవులు, ఇంకేమాటలని వినడానికి సిద్ద పడలేదు.. ఇన్ని రోజుల జాన్ జ్ఞాపకాలు తన కళ్ళముందు కదలాడుతున్నాయి.. అప్పటివరకు జాన్ ఆనందాన్ని చూసిన కళ్ళు ఇప్పుడు ఈ విషాదాన్ని చూడలేక మసకబారుతున్నాయి.. అప్పటివరకు జాన్ వదిలిన శ్వాసతో కొట్టుకున్న గుండె ఇప్పుడు ఆ శ్వాస కరువై కొట్టుకోవడం మానేసింది.. కొన్ని వందల జ్ఞాపకాలు మోస్తున్న గుండె ఈరోజు ఆ భారాన్ని మోయలేక అలసిపోయి ఆగిపోయింది.. ఒకరితోఒకరు కలసి ఎడడుగులు వేద్దాం అని అనుకున్నారు కాని కలిసిరాని కాలం ఇద్దరిని ఆరడుగుల సమాధిలో కలిపేసింది.. ప్రేమించిన ప్రతి మనిషికి మనం చివరి క్షణంలో నేను వేసే చివరి అడుగు నీతోనే అని చెప్తాం కాని చందు జాన్ మాత్రం ఆ మాటని నిజం చేశారు.. ఒకరికి ఒకరు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు.. )
ప్రతికథకి ఒక ముగింపు ఉంటుంది.. ప్రతి ప్రయాణానికి ఏదోక ending point ఉంటుంది.. కొన్ని happy ending అయితే ఇంకొన్ని sad ending..
HOW MANY YOU BELIEVE IT WAS REAL ???
YES... I believe It's Real
NOO... I don't Believe
Note: Mi prathi review Repatinundi mana instagram page lo upload chesthamm...!!!! chusi enjoy cheyandi...
Instagram kosam click 👇👇👇
Review ivvadam kosam click 👇👇
bye .. take care... Don't forget to follow our page in WhatsApp and Instagram...!! ( Links given below 👇 👇)

thank you for reading
Uma
join our family :
Instagram:
Review form: https://forms.gle/rwiEr6m1aPd8SprVA
Comments