చందమామ'తో' కధలు - 10
- Uma225
- Jul 9, 2024
- 4 min read
Updated: Jul 31, 2024
PART - 10
చంద్రుడు కూర్చుని ఆలోచిస్తున్నాడు.. అంతలో వినాయకుడు వచ్చి “ఏమిటి ఆలోచిస్తున్నావ్?” అని అడిగాడు.. చంద్రుడు “ఏమి లేదు స్వామి! మొన్న మీరు అన్న మాటలని ఎలా అర్ధం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాను.. ఇంతకి కథ ఎక్కడా?” అని అడిగాడు.. “మూషికం తేవడానికి వెళ్ళాడు..” అని చెప్పాడు.. ఆత్రం ఆపుకోలేని చంద్రుడు “స్వామి ఇంతకీ శివ అను కలుస్తారా!” అని అడిగాడు.. దానికి వినాయకుడు “గెలిస్తేనే అది ప్రేమ అవుతుంది అనుకోకూడదు.. ఒడిపోయినంతా మాత్రాన ప్రేమ కాకుండాపోదు.. ఏది జరిగిన మనం చేసిన ప్రయత్నం ఎప్పుడు వృధా కాదు..” అని అన్నాడు.. అర్ధంకాని చంద్రుడు అలా చూస్తూ ఉన్నాడు.. ఇంతలో మూషికం కథని తీసుకొచ్చి అందించాడు.. ముషికం ఏదో మర్చిపోయినట్టు ఆలోచిస్తున్నాడు.. “స్వామీ......” అంటూ మళ్ళీ మౌనంగా వెళ్ళి కూర్చున్నాడు.. అది గమనించిన వినాయకుడు నవ్వుతూ కథని మొదలుపెట్టాడు..
అలా ఆలోచిస్తూ వెళ్ళిన శివ రూమ్ లో కూర్చున్నాడు.. చందు జాన్ కలిసి వచ్చారు.. ఏమైంది అని అడిగారు.. “తేజ అన్నమాటలు కూడా నిజమేగా.. నేను వేసిన వేషాలు చాలానే ఉన్నాయి.. కాని అను నన్ను ఎలా ఇష్టపడిందో తెలియడం లేదు.. నాకు తన మీద ఇష్టం ఉంది కాని బయటపడటానికి ఎందుకు భయపడుతున్నానో అర్ధం అవ్వడం లేదు.. రేపే తనతో నా ప్రయాణానికి చివరి రోజు అని తలుచుకుంటేనే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది.. అసలు ఎందుకురా ఆ దేవుడు ప్రేమించిన మనసుని ఇచ్చి, దానితో పాటు చెప్పలేక ఆగిపోవడానికి కారణం అయిన గతాన్ని కూడా ఇచ్చాడు.. ఈరోజే అర్ధమయ్యింది తను నా పక్కన ఉంటే తనకి దక్కే గౌరవం ఏమిటో అని.. ఇన్ని చూశాక కూడా ఇంకా నా ప్రేమని ఎలా తనకి చెప్పగలను” అని చెప్తూ ఏడుస్తూ వాళ్ళ ఇద్దరినీ కౌగిలించుకుని ఎడుస్తున్నాడు.. చందు జాన్ లకి శివని ఎలా ఓదార్చాలో అర్ధంకాక ఒకరి మొకం ఒకరు చూసుకున్నారు.. ఇంకా శివ ఏడవడం మానేసి “కొన్ని రోజులుగా ఇష్టపడుతున్న నాకే ఇంత బాధగా ఉంటే, మూడు సంవత్సరాల నుండి ప్రేమిస్తున్న అను ఇంకెలా ఉంటుందో” అని అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ బైక్ వేసుకుని తన దగ్గరకి బయల్దేరాడు.. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక చందు జాన్ కూడా తన వెంట వెళ్లారు..
తేజ మాటలు విని వచ్చిన అను కూడా అలానే బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంది.. “నేను శివని ప్రేమించడం తప్పా?.. అయిన అది తప్పు ఎలా అవుతుంది? మనిషి ఎలాంటోడయిన ఒకసారి ప్రేమించిన తరువాత మనకి నచ్చినట్టు అవతలవాళ్ళని మార్చుకోగలిగితే ప్రేమలో గెలిచినట్టేగా..!! అలాయితే నేను నా ప్రేమలో గెలిచినట్టెగా..!! అవునూ.. నేను నా ప్రేమలోనే గెలిచా కాని వాడి ప్రేమని పొందడంలో ఒడిపోయా..!! రేపే మా ఇద్దరికీ చివరిరోజూ.. తలుచుకోవడానికి బాధగా ఉన్న, తనని నావాడిగ మలుచుకునే అవకాశం లేదు అనేదే నిజం..!! ఎందుకు దేవుడా.. మనిషికి మనసిచ్చి, ఆ మనసుకి నచ్చిన వ్యక్తిని ఎదురుగా నిలబెట్టి, ఇప్పుడు ఇద్దరు కలవడానికి ఇన్ని అడ్డంకులు పెడుతున్నావ్?” అని అనుకుంటూ బాధపడింది.. అంతలో ఫోన్ రింగ్ అయ్యింది.. శివ కాల్ చేస్తున్నాడు.. ఎత్తలేదు.. wallpaper లో fest లో వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటో కనిపించింది.. అది చూస్తూ “ఎందుకు శివ నా లైఫ్లోకి వచ్చావ్.. ఒకప్పుడు నా మనసుకు నచ్చిన వ్యక్తివి నువ్వు, ఇప్పుడు అదే మనసుకి బాధ పెడుతున్న వ్యక్తివి కూడా నువ్వే?” అని అనుకుంది. శివ మళ్ళీ కాల్ చేశాడు.. లిఫ్ట్ చేసింది.. శివ ఒకసారి కిందకి రమ్మన్నాడు....
అను కిందకి వచ్చింది.. కళ్ళు రెండు ఎర్రగా ఉన్నాయి.. శివ అక్కడే రోడ్డు పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు.. అను కూడా అలా మౌనంగా వెళ్ళి శివ పక్కన కూర్చుంది.. ఇంకా కొంచెంసేపు అలా మౌనంగా కూర్చుని ఉన్నారు.. ఇంకా అను “ఏంటి శివ ఇలా వచ్చావ్?” అని అడిగింది.. “ఏమి లేదు అను.. ఒకసారి చూడాలనిపించింది నిన్ను.. రేపు మన signtaure day గా.. ఇంకా నా ప్రాజెక్టు రివ్యూ కూడా అయ్యిపోయింది.. (శివ తలదించుకుని) రేపు సాయంత్రం ఇంటికి వెళ్లిపోతున్న.. అది చెప్దామని వచ్చా” అని అన్నాడు.. ఇంకా అను కూడా “ఓ.. అవునా.. ప్రతి ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది, కాని నీ ముగింపుతో నాకు ఒక కొత్త ప్రయాణం మొదలవుతుంది అని గుర్తు చేయడానికి వచ్చావా?” అని అడిగింది.. దానికి ఏమి చెప్పాలో తెలియని శివ మౌనంగా లా కూర్చున్నాడు.. ఇంకా అను “సరే శివ.. నేను వెళ్తున్నా” అంటూ లేచింది.. శివ మెల్లగా “రెండు నిమిషాలు.. మాట్లాడాలి” అని అన్నాడు.. అను “నాకు మాట్లాడాలని లేదు?” అని అంది.. శివ “సరే.. ఒక్క రెండు నిమిషాలు నేను మాట్లాడతా.. నువ్వు విను..” అని తనని కూర్చోబెట్టాడు.. ‘చూడు అనూ.. చిన్నప్పటినుండి నేను చూసిన మనుషులు వేరు.. అహంకారంతో ఆప్యాయతలని మర్చిపోతూ, స్నేహంలో కూడా స్వార్ధం చూసుకుంటూ, ప్రేమలో కామాన్ని వెతుక్కుంటూ ఉండేవాళ్లు కనిపించారు.. నేను కూడా లాగే ఉన్నా.. కాని చందు స్నేహం నాలో స్వార్ధం దూరం చేసింది, నీ ప్రేమ నాకు నిజమైన ప్రేమ ఎలా ఉంటదో చూపించింది..” అని అన్నాడు.. ఆ మాటలు విన్న అను కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి.. ఇంకా శివ తనదగ్గర నుండి లేచి రెండు అడుగులు ముందుకేశాడు.. ఇంకా తనని చూస్తూ.. “మన జంటని, జీవితంలో కలవలేక ఊహాల్లోనే మిగిలిపోయిన రాధ కృష్ణులతో నేను పోల్చలేను, అనుమానంతో సీతని ఆడవులకి పంపిన రామాయణంతో పోల్చలేను.. కానీ ఒకటి మాత్రం నిజం, పార్వతి రాకకోసం ఎదురు చూసిన శివుడిలా, ఇప్పుడు నేను నీ రాకకోసం ఆశగా చూస్తున్నా..” అని అన్నాడు.. ఆ మాటలు విన్న అను ఒక్కసారిగా శివ దగ్గరకి వచ్చి కౌగిలించుకుంది..
ఇదంతా చూస్తున్నా చందు గట్టిగా విజిల్ వేశాడు.. ఇంకా నలుగురు కలిసి happyగా వెళ్తున్నారు.. అంతలో వాళ్ళకి తేజ కనిపించాడు.. వీళ్ళని చూసి తేజ మౌనంగా తల దించుకుని ఉన్నాడు.. “ఏమైంది రా?” అని అడిగారు.. తేజ “sorry శివ.. పొద్దున్న ఏదో తెలియక మాట్లాడేశా.. కాని రూమ్ కి వెళ్ళినక అర్ధమయ్యింది తప్పు చేశా అని.. extremly sorry.. నేను ఏమి కావాలని చేయలేదు” అని అన్నాడు.. చందు “తేజా.. ఇప్పుడు అవేమీ అవసరం లేదులే.. ఇప్పుడు జరిగినదనికి నువ్వే ఒక కారణం అని..” అన్నాడు.. వెంటనే శివ “time.. నైట్ 12 దాటింది.. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్?” అని అడిగాడు.. దానికి తేజ “నేను వచ్చిన మొదటిరోజే చెప్పాగా.. dreamgirl అని.. తనకోసమే వెతుకుతున్నా.. btech కూడా అయ్యిపోతుంది.. ఇంకా కనిపించలేదు..” అని అన్నాడు.. ఇంకా చందు “dream girl .. నీకూ.. బాగుందిరా.. నీకు తను dreamgirl.. కాని తనకి మాత్రం నువ్వొక bad dream అయిపోతవేమో” అని అన్నాడు.. ఇంకా అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు..
ఇక్కడ ఇంత కథ జరుగుతుంటే ముషికం మాత్రామ ఇంకా అదే అయోమయంలో ఉన్నాడు.. ఇంతలో చంద్రుడు “స్వామి! మన కథలోని రెండు జంటలు కలిసిపోయాయి.. మరి మనం మొదటిరోజు చూసిన అమ్మాయికి ఈ కథకి సంబంధం ఏమిటి? అక్కడేమో annualday.. కాని ఇక్కడ signature day..!! మన కథలో ఉంది ఇద్దరు అమ్మాయిలు, కాని ఆరోజు మనకి కనిపించినది ఒకటే అమ్మాయి? ఈ కథకి దానికి సంబంధం ఏమిటి? ఈ సందేహాలన్నీ మీరే తీర్చాలి “ అని వినాయకుడిని అడిగాడు.. వినాయకుడు నవుతూ “ముషికా! ఏమయినా గుర్తొచ్చిందా?” అని అడిగాడు.. అప్పుడు ముషికం “హా వచ్చింది స్వామి! కథ ఇంకా అవ్వలేదు.. ఇంకా ఉందంట, కథతోపాటు ఈ సందేశం కూడా మీకు అందించమన్నారు మీకు చెప్పమన్నారు” అని చెప్పాడు.. వినాయకుడు “విన్నావా భక్తా! కథ ఇంకా ఉంది.. నువ్వు అడిగిన ప్రశ్నలకి, అలాగే మన followers అడిగబోయే ప్రశ్నలకి కలిపి సమాధానం ఇస్తారు.. ఇంకా ఇప్పటికీసెలవు తీసుకుందాం..” అని మాయం అయ్యిపోయారు.. చంద్రుడు “విన్నారుగా.. నాలాగే మీకు కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగేయండి.. నాకయితే తరువాయి భాగంలో, ఎపిసోడ్ 9 ల్ చివరిలో స్వామివారి అనుమానం నిజం అవుతుందేమో ఆనిపిస్తుంది.. మీకేం అనిపిస్తుందో కామెంట్ చేయండి..”
bye .. take care... Don't forget to follow our page in WhatsApp and Instagram...!! ( Links given below 👇 👇)

thank you for reading
Uma
join our family :
Instagram:
Review form: https://forms.gle/rwiEr6m1aPd8SprVA
Note: May be it will continue to next episode... thank you for your support till this minute... imagine chesukuni raayadam naa work... and imagine chesukuntu enjoy chestharani expect chesthunna..
Comment mukhyam....
Comments