top of page

చందమామ'తో' కధలు - 08

Updated: Jul 31, 2024

PART - 08

అలా చాలా రోజులయ్యింది.. చంద్రుడు వినాయకుడు ఎదురుచూస్తూనే ఉన్నారు కాని ఏటివంటి ఉపయోగం లేదు.. ఇంకా ఓపికలేక వినాయకుడు దాహం వేసి నీళ్ళు తాగడానికి గంగానది దగ్గరకి వెళ్ళాడు.. వినాయకుడి రాకని గమనించిన గంగాదేవి “ప్రియ పుత్రా! కొన్నిరోజుల క్రితం ఒక ఉత్తరాన్ని ఎలాగైనా నీకు అందించమని ఒక వ్యక్తి నాకు ఇచ్చి వెళ్ళాడు.. నువ్వేమో ఇటు రాలేదు.. నిజంగా ఇది నీకు చేరాలి ఉంటే నువ్వే వస్తావ్ అని నేను చూస్తూ ఉన్నా” అని చెప్పింది.. నాకు ఉత్తరమా!! అని ఆశ్చర్యపోతూ వినాయకుడు అది తీసుకున్నాడు.. దాని మీద “చందమామతో కథలు – part 8” అని ఉంది.. ఇంకా దానిని తీసుకుని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు.. “చూడు గణేశా! మనం ఎంత ప్రయత్నించిన విధి రాతకు తలవంచక తప్పదు.. నేను ఇది ఎప్పుడో నీకు పంపించాను కాని నువ్వు చంద్రుడు కాకుండా వేరే ఎవరయినా దీని గురుంచి ఆలోచించిన క్షణం ఇది నీ చేతికి అందుతుంది..” అని ఉంది.. ఇంకా అలా చదువుకుంటూ వెళ్ళి చంద్రుడికి జరిగినది చెప్పి, కథ మొదలుపెట్టాడు..

చందు మాటలు విన్న శివ ఆలోచిస్తూ ఉన్నాడు.. ఇంకా అను మాటలు మైండ్ లో రన్ అవుతున్నకాని అను ని మాత్రం దూరం పెట్టేవాడు.. అలా కొన్ని రోజులు గడిచాయి.. ఒకరోజు ఎప్పటిలాగానే కాంటీన్ పక్కన ఉన్న చెట్ల దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు.. అంతలో అను అక్కడికి వచ్చింది.. అది చూసిన శివ అక్కడినుండి లేచి వెళ్లిపోతున్నాడు.. అను వెనకాలే వెళ్తూ “ఆగు శివ!” అంది.. ఆగకుండా శివ వెళ్లిపోతున్నాడు.. అను శివ ముందుకి వెళ్ళి “ఆగమని పిలుస్తున్న ఆగకుండా వెళ్తున్నావెంటి శివ? ఏమయింది నీకు” అని అడిగింది.. శివ “ ఏమి కాలేదు.. నేను వెళ్ళాలి..” అని అన్నాడు.. అను “ఎక్కడికి? రూమ్ కి వెళ్తున్నావా? పదా నేను కూడా వస్తా.. కలిసి వెళ్దాం..” అని అంది.. అది విని శివ “ఏమి మాట్లాడుతున్నావ్ అను.. నువ్వు నా రూమ్ కి రావడం ఏంటి?” అని అడిగాడు.. దానికి అను “హా! మరి తమరు ఇక్కడ ఎలానో మాట్లాడటం లేదు.. కనీసం మీ రూమ్ లో అయిన మాట్లాడతావేమో అని చిన్న ఆశ” అని చెప్పింది..

కొంచెం ఆలోచించిన చందు “సరే ఏమిటో చెప్పు త్వరగా, నేను వెళ్ళాలి” కంగారుపడుతూ అన్నాడు.. ఇంకా అను “ అరే! ఎందుకు అంతా కంగారూ, సరే నేను చెప్పిన దాని గురుంచి ఏం ఆలోచించావ్ శివ?” అని అడిగింది.. శివకి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నాడు.. మళ్ళీ అను “చెప్పు శివ ఏదోకటి? పోనీ లివ్-ఇన్ ఉందామ!!” అని అడిగింది.. ఆ మాటలకి కోపం వచ్చిన శివ “నువ్వేం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా?” అని అడిగాడు.. అను “నాకు తెలుసు శివ నేనేం మాట్లాడుతున్నానో, నువ్వు ఇప్పుడు ఎలానో నాతో గడపడం లేదు.. కనీసం అలా అయిన నువు నాతో ఉంటావ్ అని ఆశ తో అడుగుతున్న శివ..” అని అంది.. చిరాకు వచ్చిన శివ “ఉష్.. నికేల చెప్తే అర్దం అవుతుంది ఇంకా.. నా సమాధానం no అని నువ్వెప్పుడు అర్దం చేసుకుంటావ్!” అని అంటూ వెళ్ళిపోయాడు.. “నేను నిన్ను అర్ధం చేసుకున్న కాబట్టే ఇలా ఇప్పుడు మాట్లాడుతున్న శివ” అని అనుకుంటూ క్లాస్ కి వెళ్ళిపోయింది..

ఇంకా అది 3rd ఇయర్ చివరి fest..ఇంకా క్లాసెస్ కూడా కాన్సెల్ అయ్యాయి.. అందరూ traditional wearలో ఉన్నారు.. శివ, చందు మొదటి సంవత్సరం festలో ఎంత ఆనందంగా ఉన్నారో, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ బాధలో ఉన్నారు.. మన బ్యాచ్ అందరూ చుట్టూ అమ్మాయిలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. గ్యాంగ్ లో ఒకడు “ మావ! ఆ ప్రాకృతిని చూడు ఎంత అందంగా ఉందో” అన్నాడు.. చందు మొబైలు చూసుకుంటూ “మావ! అది ప్రాకృతి కాదు రా.. ప్రకృతి అనాలి.. అయిన మన collegeలో ప్రకృతి ఏం ఉంది చూడటానికి..” అన్నాడు.. దానికి ఇంకోకడు “రేయ్! తన పేరు ప్రాకృతి రా.. సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీ.. తనని traditional wearలో చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు..” అన్నాడు.. “ఏ! అంత లావు ఉంటదా?” అని అన్నాడు.. అందరూ నవుతున్నారు.. ఇంకోకడు “చూడు మావ! నడుచుకుంటూ వస్తున్నా దేవతలా ఉంది” అని అన్నాడు.. ఇక్కడ ఇంత జరుగుతున్న పట్టించుకోకుండా శివ ఏదో పరధ్యానంలో ఉన్నాడు.. అది గమనించిన మిగలినవాళ్ళు చందుని “ఏమయ్యిందిరా వాడికి.. అలా ఉన్నాడు?” అని అడిగారు.. “ఇప్పటివరకి మీకు ఒక దేవత కనిపిస్తేనే ఇంత ఆనందంగా ఉన్నారు.. ఇంకా మా శివకి దేవత కనిపించి వరం కూడా ఇచ్చింది.. వాడు షాక్ లో ఉన్నాడు..” అని చెప్పాడు.. చందుని ఆపడానికి శివ వైపు చూశాడు.. అంతలో అందరూ “మావ! అదుగో ప్రాకృతి.. చూడు ఎంత బాగుందో” అని అన్నారు.. ఇంకా చందు అటు చూసి శివతో “మావ నీ దేవత వస్తుంది.. జాగ్రత్తగా మాట్లాడుకో.. నేను నా జాన్ ని వెతుక్కుని వస్తా..” అని లేచి వెళ్ళిపోయాడు.. మిగిలిన వాళ్ళు కూడా వెళ్లిపోయారు..

ఇంకా శివ కూడా వెళ్లిపోవడానికి లేచాడు కాని అప్పటికే అను శివ ముందు నిలబడింది.. గ్రీన్ చీర కట్టుకుని ఉంది.. పచ్చని తోటలో వికసించిన నల్లటి గులాబీల ఉన్న తన కళ్ళని చూశాడు.. చుట్టూ ఉన్న అందాలన్నీ అసూయపడేలా చేసే తన చిరునవ్వుని చూశాడు.. ఇవన్నీ చూస్తూ అలా కూర్చుండిపోయాడు.. ఇంకా తన పక్కనే అను కూర్చుని “ఏంటి సర్! మొహంలో మొహమాటం పోయి, ఆనందం తాండవం చేస్తుంది..” అని అడిగింది.. శివ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి “ఏమి లేదు” అని అన్నాడు.. ఇంకా అను “ అవునా, సరే నేను చెప్పిన దాని గురుంచి ఏమిన ఆలోచించావ్?” అని అడిగింది.. ఎప్పుడు ఈ మాటలకి చిరాకు పడే శివ ఈసారి మాత్రం ప్రశాంతంగా “ఏంటి అనూ.. ఎప్పుడు అదే అడుగుతావ ఇంకా..” అని అన్నాడు.. “సరే అయితే చెప్పు.. ఏంటి మరి విశేషాలు..” అని అడిగింది.. శివ ఏమి మాట్లాడలేదు కాని ఏదో చెప్పాలి అని ఆరాటపడుతున్నాడు.. అది గమనించిన అను “ఏంటి శివ ఏమైనా చెప్పాలా?” అని అడిగింది.. దానికి శివ కొంచెం సిగ్గుపడుతూ “అంటే అదీ.. అదీ.. ఈరోజు నువ్వు చాలా బాగున్నావ్ అను” అని అన్నాడు.. దానికి అను కూడ సిగ్గుపడుతూ “ఆహా! శివ ఇప్పటివరకు నువ్వు comments చేస్తావ్ అనుకున్న కాని compliments కూడా ఇస్తావ.. కామెంట్స్ చేస్తేనే నచ్చేశావ్, ఇప్పుడు compliments ఇస్తుంటే ఇంకా ముద్దువచ్చేస్తున్నావ్..” అని చిన్నగా నవ్వింది..  శివ కూడా సిగ్గు పడుతున్నాడు..

మళ్ళీ అను మెల్లగా “ శివ నేను చెప్పినదాని గురుంచి........” అంటూ ఉండగా శివ వెంటనే “సరే టైమ్ అవుతుందిగా వెళ్దామా!” అని అడిగాడు.. ఇంకా ఇద్దరి అలా నడుచుకుంటూ వెళ్తున్నారు.. అను మనసులో “శివ.. నీతో గడపిన ఈ కొన్ని క్షణాలే ఇంత ఆనందాన్ని ఇస్తుంటే, ఇంకా జీవితాంతం నువు నాతో ఉంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో” అని అనుకుంది.. శివ వెంటనే అను వైపు చూస్తూ “పిలిచావ” అని అడిగాడు.. అను “లేదు” అని ఏవేవో మాట్లాడుతుంది.. శివ అను వైపు చూస్తూ మనసులో “నువు చాలా మొండి దానివి అను.. నాకే తెలియదు నేను మారతాను అని.. కాని ఇప్పుడు మారాను అని అనిపిస్తుంది, దానికి కారణం ఇన్ని సంవత్సరాలు నువ్వు నా మీద పెంచున్న ప్రేమ? లేక ఈ కొద్ది రోజులలో నాకు తెలియకుండానే నాలో మొదలయిన నీ మీద ప్రేమ? అనేది తెలియడం లేదు.. ఇంకొక సంవత్సరం ఉందిగా.. ఒక మంచి సంధర్భం చూసి నా ప్రేమ గురుంచి నీకు చెప్తా..” అని అనుకున్నాడు.. అను వెంటనే “ఏమైనా అన్నావ ఇప్పుడు...” అని అడిగింది.. లేదు అని చెప్పాడు.. ఇంక అలా అలా ఆరోజు గడిచిపోయింది..

ఇంక శివ, అను ని వాళ్ళ హాస్టల్ లో డ్రాప్ చేసి రూమ్ కి వచ్చాడు.. చందు “ఏరా శివ.. బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు.” అని అడిగాడు.. శివ సిగ్గు పడుతూ “అలా ఏమి కాదు మావ! ఎందుకో మాట్లాడాలి అనిపించింది.. కలిసి మాట్లాడి, తనని డ్రాప్ చేసి వచ్చా” అని చెప్పాడు.. “కాని మావా! ఈరోజు అనుని అలా గ్రీన్ శారీలో చూసినప్పుడు ఏదో తెలియని అనుభూతి కలిగింది.. నేనే శివుడిని అయితే అను కి నాలో సగభాగం కాకుండా పూర్తిగా ఇచ్చేయాలనిపించింది.. నేనే విష్ణుమూర్తి అయితే హృదయస్థానంతో పాటు సర్వం తనకి అర్పించాలి అనిపించింది.. నేనే బ్రహ్మని అయ్యుంటే అనుని నాలుక మీద కాకుండా తల మీద పెట్టుకుని పూజించాలి అనిపించింది...” అని శివ చెప్పాడు.. “మావ! మరెప్పుడూనీ ప్రేమ గురుంచి తనకి చెప్తున్నావ్” అని చందు అడిగాడు..

అంతలో వినాయకుడు గ్యాప్ ఇచ్చాడు..ఏంటి స్వామి గ్యాప్ వచ్చింది అని అడిగాడు.. వినాయకుడు “మిగిలిన పేజీలు మొత్తం తడిచిపోయాయి.. ఏమి అర్ధం అవ్వడంలేదు..” అన్నాడు.. చంద్రుడు “మరి ఇప్పుడు ఎలా” అని దీనంగా అడిగాడు.. వినాయకుడు ఆలోచించి “ఇంకా చేసేది ఏమి ఉంది, ఇంతమంది చదువుతున్నారు.. చదివినవాళ్ళు కామెంట్/రివ్యూ లో జరిగింది చెప్పి, మళ్ళీ పంపించమని అడుగుతారు.. రైటర్స్ కూడా జరిగింది తెల్సుకుని మళ్ళీ పంపిస్తారు.. అప్పుడు చదివేయొచ్చు” అని అన్నాడు.. చంద్రుడు గట్టిగా నవ్వుతూ చూద్దాం అని అన్నాడు..

bye .. take care... Don't forget to follow our page in WhatsApp and Instagram...!! ( Links given below 👇 👇)


thank you for reading

    Uma






join our family :


Instagram:



Note: May be it will continue to next episode... thank you for your support till this minute... imagine chesukuni raayadam naa work... and imagine chesukuntu enjoy chestharani expect chesthunna..

Comment mukhyam....


Comments


Post: Blog2 Post
bottom of page