top of page

చందమామ'తో' కధలు - 09

Updated: Jul 31, 2024

PART - 09

ముషికం కొన్ని పేపర్లు పట్టుకుని వినాయకుడి దగ్గరకి వెళ్ళాడు.. స్వామి ఆ పేపర్లు తీసుకుని చంద్రుడి దగ్గరకి వెళ్ళాడు.. “ఏంటి స్వామి.. కొంచెం లేట్ అయ్యింది?” అని అడిగాడు.. “:అంటే పేపర్లు తడిచిపోయాయిగా.. మళ్ళీ రాయడానికి కొంచెం సమయం పడుతుంది అని ప్రస్తుతానికి కొంత కథని పంపించారు.. ఇప్పుడు అది చెప్తా విను” అని కథ చెప్పడం మొదలుపెట్టాడు..

అలా చందు అడిగిన మాటలకి ఆలోచిస్తూ శివ “నాది అలా ఉంచు.. ఇంతకీ నీది ఏమయ్యింది.. పొద్దున్న కలుస్తా అన్నావ్ కలిశావా?”అని అడిగాడు.. చందు ఇంకా దిగులుగా “కలుద్దాం అనే వెళ్లా.. కాని అక్కడ జరిగింది చెప్పలేను రా?” అని తల దించుకున్నాడు.. శివ “ఏరా ! ఏమయింది?” అని అడిగాడు.. చందు మాత్రం మౌనంగా తలదించుకుని ఏడుస్తున్నాడు.. మళ్ళీ శివ గట్టిగా “అరే అడిగేది నిన్నే.. మాట్లాడు.. ఏం జరిగింది?” అని అడిగాడు.. “నేనేమీ చెప్పలేను.. ఎందుకంటే అక్కడ ఏమి జరగలేదు కాబట్టి..” అని అన్నాడు.. “ఏమి జరగలేదా.. మరి ఎందుకురా ఏడుస్తున్నావ్?” అని అడిగాడు.. దానికి చందు “హే చి.. చేతిలో గ్లాస్ లేదని నేను బాధపడుతుంటే.. నువ్వేమో అమ్మాయికోసం అనుకుంటున్నావా” అని నవ్వాడు.. ఇంకా శివ “కవర్ చేసింది చాలు ఏమి జరిగిందో చెప్పూ..” అని అడిగాడు.. చందు “జాన్ కాలేజీకి రాలేదురా.. మొన్న బస్ ఎక్కించిన తరువాత నుండి ఇప్పటివరకి అసలు mesg/call చేయలేదు.. అసలు ఏమయ్యిందో తెలియదు..” అంటూ బాధపడ్డాడు..

ఇంకా అలా అలా రోజులు గడుస్తున్నాయి.. సడన్ గా జాన్ నుండి కాల్ వచ్చింది.. చందు లిఫ్ట్ చేయలేదు.. జాన్ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంది.. ఇంకా చందు మొబైలు స్విచ్ ఆఫ్ చేశాడు.. అది గమనించిన శివ “ఏమయింది చందు.. ఎప్పుడు లేనిది ఇప్పుడేంటి కొత్తగా కాల్ కట్ చేస్తున్నావ్?” అని అడిగాడు.. చందు కొంచెం ఎమోషనల్ గా “తనకి నచ్చినప్పుడు కాల్ చేస్తే నేను లిఫ్ట్  చెయ్యాలా.. అంటే తనకి అవసరం వస్తే తప్ప నేను గుర్తుకు రానా?” అని అన్నాడు.. ఆ మాటలు విన్న శివ కొంచెం సేపు ఆలోచిస్తూ “ ఇప్పటివరకి తను అంటే ఇష్టం ఉండి, తనవెంట తిరిగి తనకోసం వెతికి ఇన్ని చేశావ్ కదరా.. ఇప్పుడు తను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడానికి ఇగో ఎందుకు?ఓహొ.. ఇప్పుడు తను నిన్ను accpet చేయడానికి readyగా ఉందనా?? అయిన మనకి ఎందుకుర ఈ ఎదవ ego.. నిన్ను నన్ను ఒక అమ్మాయ్ చూడటమే ఒక వింత.. కాని చూశారు, వాళ్ళ దరిద్రమో లేక మన అదృష్టమో, మనతో మాట్లాడి, మనతో జీవితాంతం కలిసి నడవడానికి సిద్దంగా ఉన్నారు.. కాబట్టి అన్నీ మూసుకుని వెళ్ళి కలువు.. తను లైబ్రరిలో ఉంది..” అని చెప్పాడు.. చందు కూడా ‘అవును మావా.. ఇది కూడా నిజమే.. ఇదెలా మిస్ అయ్యాను నేను” అని అనుకుంటూ తనని మీట్ అవ్వడానికి  వెళ్తున్నాడు.. శివ ఒకసారి చందుని పిలిచి “అరే మన అబ్బాయిలు అందరూ ఇంతేనా?? అమ్మాయిలు ఒప్పుకునేంత వరకి వల్ల చుట్టూనే తిరుగుతాం, చివరికి వాళ్ళు ఒప్పుకోవడానికి readyగా ఉన్నప్పుడు ఇలా ఇగో, attitudeలు చూపిస్తాం? వాళ్ళు మనల్ని నమ్మి జీవితాంతం నడవడానికి సిద్దపడుతున్నారు.. ఇప్పుడిలా చేస్తే వాళ్ళు తీసుకున్న  నిర్ణయం తప్పు అనుకుని, జీవితంలో మళ్ళీ ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి భయపడతారు..” ఒకసారి ఆలోచించు అని చెప్పాడు..

ఇంకా ఎలా తనని కూల్ చేయాలి అని ఆలోచిస్తూ తనని వెతుక్కుంటూ లైబ్రరికి వెళ్తున్నాడు.. గ్రౌండ్ ఫ్లోర్.. ఫస్ట్ ఫ్లోర్ వెతికేశాడు కనిపించలేదు... సెకండ్ ఫ్లోర్ లో చిన్న చిన్న rennovation పనులు జరుగుతున్నాయి.. c.c. కెమెరా కూడా వర్కింగ్ లో లేవు.. కానీ స్టూడెంట్స్ మాత్రం వెళ్ళి  చదువుకుంటూ ఉంటారు.. ఇంకా చందు కూడా వెళ్ళాడు.. ముందు ఎవరు కనిపించలేదు.. ఇంకా వెనక్కి వచ్చేస్తుంటే books shelves పక్కన నుండి ఒక చున్నీ ఎగురుతూ కనిపించింది.. ఎవరో అని చూడటానికి వెళ్ళాడు.. జాన్ కూర్చుని ఉంది.. చందు వెళ్ళి తన పక్కన నిలుచున్నాడు.. జాన్ ఒక్కసారిగా లేచి కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అడిగింది.. దానికి ఏమి చెప్పాలో తెలియక దిక్కులు చూస్తున్నాడు.. జాన్ ఒక్కసారిగా చందుని కౌగిలించుకుంది.. ఏమైంది అని అడిగాడు.. జాన్ మనసులో “ చెప్పడానికి చాలా ఉంది కాని పెదవి దాటని మౌనం నాది..” అని అనుకుంది.. చందు “ఆ మౌనాన్ని కూడా అర్ధం చేసుకునే ప్రేమ నాది..” అని అనుకున్నాడు.. ఇంకా మళ్ళీ చందు “ఓయ్ అమ్మాయ్.. చెప్పు ఏమయింది..” అని అడిగాడు.. ఇంకా జాన్ “చందు.. ఇన్ని రోజుల మన పరిచయంలో ప్రతిక్షణం నేను ఏదో మ్యాజిక్ ఫీల్ అవుతూనే ఉన్న.. ఎంతలా అంటే నీ మెసేజ్ చదువుతుంటే, నువ్వే నా పక్కన  కూర్చుని మాట్లాడుతున్నావ్ అని అనిపించేలా.... కొన్ని రోజులనుండి నాకు ఏమయిందో నాకే తెలియడం లేదు.. అసలు నేను ఫీల్ అవతున్న ఫీలింగ్ ఎంతో కూడా అర్ధం అవ్వడం లేదు.. ఇప్పటివరకి నాకు బాధ, సంతోషం మాత్రమే తెల్సు. కాని మొన్న నువ్వు బస్ ఎక్కించిన తరువాతే అర్ధమయ్యింది.. బాధ సంతోషాలని మించిన ఫీలింగ్ ఒకటి ఉంటుంది అని.. అదీ నీ నుండి దూరంగా ఉన్నప్పుడే కలుగుతుంది.. అదే ప్రేమ అని నేను అనుకుంటున్నాను” అని చెప్పింది..

“కొంచెం అర్ధమయ్యేలా చెప్పవా” అని అడిగాడు చందు.. “నా జీవితంలో అన్నీ ఆలస్యంగా వచ్చి అనుభవించేలోపే పోయేవి.. కాని ఆలస్యంగా వచ్చిన నీ పరిచయం, పరిణయం వరకి ఆలోచించేలా చేసింది.. కాని జీవితాంతం నీతో ఉంటానో లేదో తెలియదు కాని ఉన్నంత కాలం నిన్ను సంతోషంగా చూసుకుంటా అని మాత్రం చెప్పగలను..” అని అంది.. “అసలు ఏమి చెప్తున్నావే నువ్వు.. అసలు అర్ధం అవ్వడం లేదు.” అని అన్నాడు.. “ఏమో నాకూడ తెలియడం లేదు.. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడానికి వచ్చి అది తప్ప అన్నీ చెప్తున్నా.. .. ఒకటిమాత్రం నిజం రేపు పెళ్లి అయ్యాక అమ్మాయిలా కాకుండా ఒక అమ్మలా చూసుకుంటా” అంది.. ఇంకా చందు కూడా కౌగిలించుకుంటూ “ఇది చెప్పడానికి ఇంతకాలం పట్టింద నీకు.. love you too..” అని అలానే కౌగిలించుకున్నాడు.. rennovation work update చూడటానికి వచ్చిన సత్య సర్ వీళ్ళని చూసి silentగా వెళ్ళిపోయాడు..  అంతలో శివ నుండి మెసేజ్ వచ్చింది మన ప్లేస్ కి రమ్మని.. ఇంక ఇద్దరు శివ దగ్గరకి వెళ్ళారు.. “ఏమైందిరా రమ్మని mesg చేశావ్” అని అడిగాడు..  శివ “ఇప్పుడే hod నుండి నోటిస్ వచ్చింది.. 4-2 ప్రాజెక్టు ఫైనల్ రివ్యూ ఇంకా 2 వీక్స్ లో ఉంటుందని.. ఇంకో రెండు వారాల తరువాత మళ్ళీ మనం ఇలా ఉండలేమేమో.. కాలేజీ రోజులు చివరికి వచ్చేశాయ్.. ఎందుకో కొంచెం ఎమోషనల్ అనిపించి పిలిచా” అని చెప్పాడు..అను కూడా వచ్చింది.. శివ కళ్ళలో ఏదో అలజడి మొదలయ్యింది.. అది ప్రేమకి తక్కువ, భయం కి ఎక్కువగా ఉంది..

పక్కనే తేజ ఒక అమ్మాయితో గోడవపడుతున్నాడు.. ఏమయ్యిందా అని వెళ్ళి అడిగారు.. చందు “రే తేజ! ఏంట్రా ఈ గొడవ??’ అని అడిగాడు.. “తన పేరు ప్రాకృతి.. బాగుంది అని పిలిచా.. వచ్చింది.. సరే అని ఒక పాట పాడు అని చెప్పా.. తను “అయ్యో నాకు సిగ్గు ఎక్కువ అండి.. Im bathroom singer” అని చెప్పింది.. నేను “సరే అయితే వెళ్దాం పద ని బాత్రూంకి” అని అడిగా.. ఇంకా దానికి గొడవ చేస్తుంది.. ఇందులో నేను చేసిన తప్పేంటి? తన పాట వినాలి అని అనుకున్నా..” అని జరిగింది చెప్పాడు.. ఇంకా తేజ అమాయకత్వాన్ని, తింగరితనాన్ని ప్రాకృతికి నచ్చచెప్పి పంపించేశారు.. శివ కోపంగా “తేజా! అలా ఎవరయినా అడుగుతారా! మాట్లాడాలి అనిపిస్తే డైరెక్ట్ గా మాట్లాడాలి కాని ఇలా అసభ్యంగా మాట్లాడితే మనల్ని ఎదవలుగా చూస్తారు..” అని చెప్పాడు.. కానీ తేజ అమాయకంగా “అదేంటి అలా అంటావ్? నువ్వు కూడా ఇలాంటివి చేసావ్! ఎదవ అయ్యావ? లేదుగా.. ఇంత మంచి అమ్మాయి ఇప్పుడు నీ పక్కన ఉంది... ఇప్పుడు నేను నీలానే చేస్తే తప్పు అంటున్నావ్?” అని అడిగాడు.. ఆ మాటలు విని అను ఒకవైపు, శివ ఒకవైపు వెళ్లిపోయారు.. అమాయకంగా తేజా అడిగిన మాటలు శివని బాగా కలవరపరిచాయి.. వాటిని ఆలోచించుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు..

ఇంకా కథని ఆపేశాడు వినాయకుడు.. చంద్రుడు “స్వామి! నాకోకటి అర్ధమయ్యింది.. ఇప్పుడు తేజ చెప్పిన అమాయకమైన నిజాలు శివలో మార్పు తీసుకువస్తుంది అని నాకు అనిపిస్తుంది..” అని చెప్పాడు.. వినాయకుడు మాత్రం “నాకెందుకో నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువ ఏదో జరగబోతుంది అనిపిస్తుంది” అని విచారంగా ఆలోచిస్తూ చెప్పాడు..


bye .. take care... Don't forget to follow our page in WhatsApp and Instagram...!! ( Links given below 👇 👇)


thank you for reading

    Uma






join our family :


Instagram:



Note: May be it will continue to next episode... thank you for your support till this minute... imagine chesukuni raayadam naa work... and imagine chesukuntu enjoy chestharani expect chesthunna..

Comment mukhyam....


Comments


Post: Blog2 Post
bottom of page