చందమామ'తో' కధలు - 07
- Uma225
- Jun 3, 2024
- 5 min read
Updated: Jul 31, 2024
PART - 07
కొన్నిరోజుల తరువాత వినాయకుడు నీరసంగా చంద్రుడు దగ్గరకి వచ్చాడు.. చంద్రుడు “స్వామి! మొన్న ఎక్కడికి వెళ్లిపోయారు..?” అని అడిగాడు.. “కొంచెం ముఖ్యమయిన కార్యం పూర్తి చేయటానికి వెళ్ళాను.. ఇంతకీ కథ ఏమైంది? శివ అను ప్రేమని ఒప్పుకున్నాడా? చెప్పు..” అని వినాయకుడు అడిగాడు.. దానికి చంద్రుడు “ఈ రోజు తెలుస్తది స్వామి, ఏం జరిగిందో.. మొన్న మీరు వెళ్ళినక మేము కూడా వెళ్లిపోయాము.. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టడానికి అంత సిద్దం చేస్తున్నాను..” అని చెప్పాడు.. అంతలో ఆకాశం నుండి మాటలు వినిపించాయి “ఈ రోజు కథ నేను చెప్తాను.. మీరు సైలెంట్ గా వినండి.. రోజు మీద కొంచెం ఎక్కువగా చెప్తా.. మీరు చేయాల్సిందల్లా మౌనంగా వినడమే.. కొంచెం disturbance చేసిన నేను వెళ్లిపోతా” అని వినిపించింది.. వీళ్ళు కూడా సరే అని వినడం మొదలుపెట్టారు..
అలా జాన్ కోసం చాక్లెట్ కొని తరువాత రోజు తనని కలవడానికి వెళ్ళాడు.. కాని కనిపించలేదు.. ఇంకా బాధగా బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు.. ఇంకా అప్పుడే వాళ్ళ ప్రొఫెసర్ సత్య వచ్చి పక్కన కూర్చున్నారు.. చందు అది చూసి లేచి నించున్నాడు.. సత్య “పర్లేదు చందు.. రా కూర్చో..” అని అంటూ తన ఫోన్ ని స్విచ్-ఆఫ్ చేశాడు.. ఇంకా చందు వచ్చి కూర్చున్నాడు.. చందు తన పేరు ఆయనకి ఎలా తెల్సు అని ఆలోచిస్తూ కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నాడు.. సత్య చందు చేతిని పట్టుకుని నార్మల్ చేస్తూ “ఏంటి చందు ఎలా ఉన్నావ్? ఇప్పటికైనా నీ క్లాస్ కి వెళ్తున్నావా లేక ఇంకా వేరే క్లాస్ లోకి వెళ్ళి అల్లరి చేస్తున్నావా?” అని నవ్వుతూ అడిగాడు.. దానికి చందు “సార్! ఇంకా మీకు గుర్తుందా?” అని ఆశ్చర్యంగా అడిగాడు.. సత్య “గుర్తుంది చందు.. ఆరోజు నువ్వు classroom తెలియక వచ్చి కూర్చున్నావ్ అనుకున్నా కాని క్లాస్ అయ్యాక మీ ఇద్దరినీ చూశాక తనకోసమే వచ్చావని అర్ధమయ్యింది.. నేను 15 సంవత్సరాల నుండి ఈ collegeలో ప్రొఫెసర్ గా ఉంటున్నా.. నీలాగా మొదటి సంవత్సరంలోనే అమ్మాయిల వెనుక తిరిగే అబ్బాయిలని చాల మందిని చూశాను కాని మూడు సంవత్సరాలు వదలకుండా తన చుట్టూనే తిరుగుతున్నావ్ అని మొన్ననే అర్ధమయ్యింది, అప్పటినుండి నీతో మాట్లాడదాం అని అనుకుంటే ఇప్పటికీ కుదిరింది..” అని చెప్పాడు.. చందు కూడా “అంతేగా సర్ మరి.. ప్రేమించడం అంటే ప్రతిక్షణం తనకి తోడుగా ఉంటా అని నమ్మకం ఇవ్వడమేగా.. నేను కూడా అదే చేశా.. మూడు సంవత్సరాలు తనతోనే ఉన్నాను.. కాని తనకి ఇంకా టైమ్ కావాలి అనుకుంటా నమ్మడానికి...” అని చెప్పాడు.. దానికి సత్య “ ok but ఒకటి గుర్తుపెట్టుకో చందు.. జీవితం ఎప్పుడు ఒకేరకంగా ఉండదు.. ప్రతిక్షణం మనకి ఏదొకటి నేర్పించడానికి ప్రయత్నిస్తుంది.. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయి, ఈరోజు నువ్వు వేస్తున్న అడుగు రేపటిరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు తప్పటడుగుల అనిపించకూడదు..” అని సలహా ఇచ్చాడు..
అది విన్న చందు కూడా నవ్వుతూ “నాకు కూడా మీలాంటి ఆలోచనలే ఉన్నాయి సర్.. జీవితంలో మనకి వీలయినన్ని అనుభూతుల్ని అనుభవించాలి.. కష్టం,సుఖం, గెలుపు,ఓటమి వీటన్నింటినీ సమానంగా అనుభవించగలిగె ధైర్యం ఉంటేనే అనుభూతుల్ని వెతుక్కుంటూ వెళ్ళాలి.. అలాగే ఇప్పుడు నేను ప్రేమని అనుభూతి చెందుతున్నా.. రేపటిరోజు ఆ ప్రేమే నాకు దూరం అయిన బాధ మాత్రం ఉండదు.. ఎందుకంటే నేను ప్రేమిస్తుంది తను నాతో ఉన్నపుడు నాకు కలుగుతున్న ఆనందాన్ని, ఒకవేళ ఫ్యూచర్ లో తను నాతో ఉండకపోవచ్చు కాని తన వలన కలిగిన ఆనందం మాత్రం నాతోనే ఉంటది..” అని చెప్పాడు.. ఇంకా సత్య “మంచి క్లారిటీ ఉండి జీవితం మీద.. కానీ కబుర్లతో కడుపు నిండదు గా.. మరి దానికేం చేస్తావ్?” అని అడిగాడు.. చందు నవ్వుతూ “సర్! ఒకప్పుడు కష్టం, నమ్మకం, విశ్వాసం, నిజాయితీ అనే పునాదులు మీద సమాజంలో పలుకుబడి ఉండేది.. కాని ఇప్పుడు నాలుగురు కట్టుకున్న పునాదుల్ని లాక్కుని దానిమీద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నవాళ్ళకె ఈ సమాజం పూలవర్షం కురిపిస్తుంది.. మాటలతో మాయ చేయడం తెలియాలి..”.. సత్య “అంటే మోసం చేస్తావా?” అని అడిగాడు... దానికి చందు నవుతూ “ఏంటి సర్! అలా ఆశ్చర్యపోతూ అడుగుతున్నారు.. మోసపోవడం తప్పు కానప్పుడు మోసం చేయడం తప్పు ఎలా అవుతుంది.. అందరూ మనం ఏ స్థాయిలో ఉన్నామో చూస్తున్నారు, ఆ స్థాయికి ఎలా ఎదిగాం అని ఆలోచించడం లేదు.. ఇందాక మీరు అడిగిన దానికి ఇప్పుడు సమధానం దొరికింది అనుకుంటున్నా..” అని అన్నాడు.. ఇంకా సత్య “ok well ! as a college student, నువ్వు ఇలా మాట్లాడటం తప్పు ఏమి కాదు.. కానీ ఇప్పటివరకి నీకు పరీక్షలు పెట్టిన వాళ్ళంత నిన్ను పాస్ చేయడానికే చూశారు అందుకే ఇలా మాట్లాడుతున్నావ్.. కాని రేపు కాలేజీ అయ్యాక నీకు అడుగడుగున పరీక్షలు పెట్టబోయేది జీవితం, రాస్తున్న ప్రతిసారీ నిన్ను ఫెయిల్ చేయడానికి చూస్తుంది.. ఫెయిల్ చేసిన ప్రతిసారి నీకు ఏదోకటి నేర్పిస్తుంది, అది నువ్వు నేర్చుకున్నప్పుడు కచ్చితంగా నీ ఆలోచనలలో మార్పు వస్తుంది.. Im waiting to see a change in your thoughts..” అని లేచి వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి “చందు… నీ ఫ్రెండ్ గా ఒకటి చెప్తా విను.. ప్రేమ అనేది మన జీవితంలో strength అవ్వాలిగాని weakness అవ్వకూడదు.. కాబట్టి జీవితంలో ఎలా ఉన్నా, ప్రేమ విషయంలో తప్పటడుగు వేయకు, ఒక్కసారి weaknessగా మారితే జీవితం మొత్తం weak అయ్యిపోతావ్” అని చెప్పి వెళ్ళిపోయాడు..
ఇంక సాయంత్రం అయ్యింది.. జాన్ కోసం చాల టెన్షన్ పడుతున్నాడు.. మార్నింగ్ నుండి కాల్స్ లేవు… ఇలా బాధపడుతూ ఉండగా సడన్ గా కాల్ వచ్చింది జాన్ నుండి.. జాన్ కొంచెం కంగారుగా “చందు.. నేను అర్జెంట్ గా బయటకి వేరే ఊరు వెళ్ళాలి.. కొంచెం బస్ స్టాప్ దగ్గరకి తీసుకెళ్తావా” అని అడిగింది.. “సరే వస్తున్న” అని చెప్పి కాల్ కట్ చేసి, తనని ఎక్కించుకుని బస్ స్టాప్ దగ్గరకి తీసుకెళ్ళాడు.. జాన్ చాలా tensionగా కనిపిస్తుంది.. ఎంత మాట్లాడిన నార్మల్ అవ్వడం లేదు.. ఇంకా ఏమి చేయాలో తెలియక చందు జాన్ ని “హే ఒకసారి నుంచో” అన్నాడు.. జాన్ నిలుచుంది.. ఒక్కసారిగస్ తనని హగ్ చేసుకున్నాడు.. చందు “చూడు జాన్! నువ్వెందుకు tension పడుతున్నావో తెలియదు.. కాని ఒకటి గుర్తుపెట్టుకో నీకు నేను ఉన్నాను.. ఒంటరిగా నువ్వు వేస్తున్న ప్రతి అడుగుకి తోడుగా నా అడుగు ఉంటుంది.. నువ్వు చేరాలి అనుకునే గమ్యానికి చేర్చడానికి సారాధిలా నేను తోడున్నా.. ఇంకెందుకు కంగారు పడుతున్నావ్..” అని అన్నాడు.. ఆ మాటలకి తన టెన్షన్ మొత్తం పోయింది.. అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటున్నారు.. చందు జాన్ నుదిటిమీద ముద్దు పెట్టాడు.. అంతలో బస్ స్టార్ట్ అయ్యింది.. జాన్ ఎక్కి కూర్చుని చందు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది.. “ఇప్పటివరకు నువ్వు ఏదో ఆకతాయిగా నా చుట్టూ తిరుగుతున్నావ్ అనుకున్నా కాని నా మీద ఇంత ప్రేమ ఉంద నీకు.. ఇప్పుడు నువు నాకిచ్చిన ధైర్యం, ఒకప్పుడు నా చేయి పట్టుకుని నడిపిస్తున్నపుడు మా నాన్న ఇచ్చిన దైర్యం ల అనిపిస్తుంది.. ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు, ప్రేమగా మాటలు చెప్పే మా అమ్మని గుర్తు చేస్తున్నాయి.. ఎందుకు? కొంపదీసి నాకు తెలియకుండానే నిన్ను నాలో నింపేసావా? ఏమో నాకయితే అవును అనే అనిపిస్తుంది.. చూద్దాం మన ప్రయాణాలు ఒకే గమ్యానికి చేరుస్తాయో లేదో..” అని అనుకుంటూ పడుకుని పోయింది..
ఇంకా హ్యాపీ గా రూమ్ కి వచ్చాడు.. అప్పటికే శివ అను నుండి relax అవుదాం అని అలా అలా బీర్ తాగుతూ, బాధ పడుతూ ఆలోచిస్తున్నాడు.. ఇంతలో చందు కూడా జాయిన్ అయ్యాడు.. ఇంకా జరిగిన విషయం శివకి చెప్పాడు.. శివ “ఇంతకీ అమ్మాయ్ ఎందుకలా ఉందో తెల్సా?” అని అడిగాడు.. చందు “తెలియదు” అన్నాడు.. “పోనీ ఎక్కడికి వెళ్తుందో తెల్సా?” అని శివ అడిగాడు.. “తెలియదు” అని చందు చెప్పాడు.. శివ “మరి ఎందుకురా నీకు.. ఆ డైలాగ్ లు.. ఏంటి సార్ అవి.. తనకి తోడుగా నీ అడుగు ఉందా.. ఏ తనకి రెండో కాలు లేదా! ఇంకొకటి ఏంటి. ఆ.. సారధివా నువ్వు.. అయితే వెళ్ళి రధాలని తోలుకోరా! తన చుట్టూ ఎందుకు తిరగడం” అని హేళన చేశాడు.. చందు “అదేంటిరా అలా మాట్లాడుతున్నావ్.. తను టెన్షన్ లో ఉంది.. ధైర్యం ఇవ్వడానికి అలా చెప్పా.. అయిన నేను నిజమే చెప్పాగా.. మూడు సంవత్సరాల ప్రేమని మూడు లైన్లలో చెప్పా..” అని అన్నాడు.. దానికి శివ “మావ! ప్రేమలో పడేయడం అనేది కురుక్షేత్ర యుద్దం కన్నా కష్టం అయిన పని.. ఈ ప్రేమ యుద్దంలో గెలిచిన వాడు అర్జునుడు అయితే, ఒడిపోయినవాడు కర్ణుడు అవుతాడు..” అన్నాడు.. చందు “రెయ్ శివ! అదేం పోలిక రా! చెత్తగా ఉంది” అని అన్నాడు.. శివ అయితే నీకు పూర్తిగా చెప్పాలి అనుకుని “అమ్మాయిని పడేయడానికి అబ్బాయిలు వేసే పధకాలు వేరయిన చేసే ప్రయత్నం ఒకటే ఎలా అంటే అర్జునుడు కర్ణుడు యుద్దం గెలవడానికి చేసిన ప్రయత్నంలాగ.. కాని ఒకరు గెలిచారు.. ఒకరు ఓడిపోయారు.. ఎందుకంటావ్?” అని అడిగాడు.. దానికి చందు బాగా ఆలోచించి “కృష్ణుడు” అని చెప్పాడు... శివ “exactly.. అప్పుడు కృష్ణుడు వలన అర్జునుడు గెలిచాడు.. అలాగే ఇప్పుడు నువ్వు ప్రేమలో గెలవలంటే నాలాంటి వాడి సహాయం కావాలి..” అని అన్నాడు.. “నీ.. అంటే నువిప్పుడు కృష్ణుడివా.. అయిన తమరు చేసే పనులు అన్నీ ఆవేగా” అని అంటూ పల్లీలు (stuff) ని శివ మీదకి విసురుతు “ఒరేయ్ ముందు అను గురుంచి ఆలోచించురా.. తర్వాత నాకు ఉపన్యాసం ఇవ్వొచ్చు” అని లేచి వెల్లిపోయాడు..
చంద్రుడు వినాయకుడితో “స్వామి! అసలు వీళ్ళు ప్రేమలో గెలుస్తారా.. నాకు అయితే చాలా ఆశగా ఉంది.. చివరికి ఏమి జరుగుతుందో చూడాలి అని.. మీకు కూడా అలాగే ఉందా” అని అడిగాడు.. వెంటనే కథ ఆగిపోయింది.. వినాయకుడు “భక్తా! నాకు మాత్రం ఏమి తెలుసు? నేను నీలాగే వింటున్నాగా.. కొంచెం సేపు సైలెంట్ గా ఉంటే, ఏమైందో తెలిసేదిగా” అంటూ లేచి వెళ్ళిపోయాడు..
bye.. take care... Don't forget to follow our page in WhatsApp and Instagram...!! ( Links given below 👇 👇)

thank you for reading
Uma
join our family :
Instagram:
Review form: https://forms.gle/rwiEr6m1aPd8SprVA
Note: May be it will continue to next episode... thank you for your support till this minute... imagine chesukuni raayadam naa work... and imagine chesukuntu enjoy chestharani expect chesthunna..
Comment mukhyam.....
Comments