చందమామ'తో' కధలు - 06
- Uma225
- May 23, 2024
- 5 min read
Updated: Jul 31, 2024
PART - 06
మెల్లగా వినాయకుడు చంద్రుడు ఎప్పటిలాగానే వచ్చి కూర్చున్నారు.. ఈరోజు అసలు గొడవ పడకూడదు.. సైలెంట్ కూర్చుని కథ మొత్తం వినాలి అని అనుకున్నారు.. ఇంకా అలా కథ కూడా మొదలయ్యింది..
శివ నుంచి నెంబర్ తీసుకున్న చందు, జాన్ కి కాల్స్ చేస్తూనే ఉన్నాడు.. చివరికి జాన్ కాల్ లిఫ్ట్ చేసి “హలో ఎవరు?” అని అడిగింది.. “హాయి జాన్.. నేను చందు ని.. సారీ చెప్పడానికి చేశా..” అని అన్నాడు.. జాన్ కోపంగా “సారీ నా.. అయిన నా నెంబర్ ఎవరు ఇచ్చారు..” అని అడిగింది.. చందు “ఇప్పుడు ఎవరిస్తే ఏంటి జాన్.. ఇప్పుడు నేను కావాలా? లేక నెంబర్ ఇచ్చినవాడు కావాలా?” అని అడిగాడు.. జాన్ “ఎదవ ఎక్సట్రాలు చేయకు.. సరిగ్గా చెప్పు లేకపోతే బ్లాక్ చేసేస్తా..” అని కోపంగా అంది.. చందు “హే జాన్.. కూల్.. నువ్వు అలాంటి పిచ్చ పిచ్చ పనులు చేయకు.. శివకి తెల్సిన అమ్మాయి దగ్గర ని నెంబర్ తీసుకుని నాకు ఇచ్చాడు..” అని అన్నాడు.. జాన్ “ఇది చెప్పడానికి ఏమి పోయేకాలం.. ఇప్పుడు చెప్పు ఎందుకు కాల్ చేశావ్?” అని అంది.. చందు “సారీ చెప్పడానికి చేశా” అని చెప్పాడు.. జాన్ “అయ్యో.. మీరేనా సార్.. కొత్తగా సారీ చెప్తున్నారు.. మార్నింగ్ పిలుస్తున్న ఆగకుండా వెళ్లిపోయావ్.. మళ్ళీ ఇప్పుడేంటి కొత్తగా..” అని కోపంగా అడిగింది.. ఇంకా చందు “జాన్ ప్లీజ్ కోపం తెచ్చుకోకు.. అంటే నువు కనీసం బర్త్ డే అని కూడా చెప్పలేదు.. పోనీ నేనే తెల్సుకుని అక్కడికి వస్తే కనీసం పట్టించుకలేదు.. పోనీ మిగిలినవాళ్ళకి నేను తెలియదు.. కాని నీకు తెల్సిన తెలియనట్టు ప్రవర్తించేసరికి కోపం వచ్చింది.. అందుకే వెళ్లిపోయా..” అని చెప్పాడు.. ఇంకా అలా అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు.. టైమ్ కూడా 12 అయ్యింది.. మళ్ళీ జాన్ కి విష్ చేశాడు.. ఇంకా జాన్ కి వేరే వేరే కాల్స్ రావడం వలన bye చెప్పేసి కాల్ కట్ చేసింది.. ఇంకా మార్నింగ్ జాన్ కి “ఏంటి ప్లాన్స్..” అని మెసేజ్ చేశాడు.. జాన్ “గుడికి వెళ్దాం అనుకుంటున్నా..” అని చెప్పింది.. చందు “ నేను రావచ్చా” అని అడిగాడు... “కాలిగా ఉంటే రావచ్చు..” అని మెసేజ్ చేసింది.. ఇంకా ఇద్దరు కలిసి టెంపుల్ కి వెళ్లారు.. అలా టైమ్ స్పెండ్ చేశారు.. ఇంకా వాళ్ళు కొంచెం కొంచెం దగ్గరవుతూ వచ్చారు..
అలా రోజులు గడుస్తున్నాయి.. మెల్లగా 3rd year లోకి వచ్చారు.. వీళ్ళ గ్యాంగ్ కూడా పెరుగతూ వచ్చింది.. ఒకరోజు అందరూ కలిసి truth or dare ఆడుతున్నారు.. అంతా ఫన్నీఫన్నీ గా ఉంది.. నవ్వుకుంటున్నారు.. సడన్ గా బాటిల్ అనన్య (అను ) వైపు తిరిగింది.. అనన్య ఈ మధ్యనే వీళ్ళ బ్యాచ్ తో కలిసింది.. ఇంకా చందు “truth or dare” అని అడిగాడు.. ఇంకా అను ఆలోచించి “dare” అని చెప్పింది.. ఇంకా చందు “seriousగా మా శివ కి ప్రపోస్ చెయ్” అని చెప్పాడు.. దానికి శివ “ రెయ్! ఏం మాట్లాడుతున్నావ్ రా! వద్దు తను ఇబ్బంది పడతది.. ఇంకేమైనా ఇవ్వు..” అని అన్నాడు.. కాని అను మాత్రం “పర్లేదు.. నేను చేస్తా dare..” అని చెప్పింది.. ఇంకా చందు శివతో “తనకి లేని బాధ నీకేంటి రా.. చేస్తా అంటుంది గా.. and మాకు కూడా ఇంటరెస్టింగ్ గా ఉంది.. నీకు ఒక అమ్మాయ్ ప్రోపోసల్.. ఎలాగూ రియల్ లైఫ్ లో ఉండదు గా.. ఇలా అయిన చూసిన మేము ఆనందిస్తాం.. పాప అను నువ్వు అందుకో అమ్మ..” అని అన్నాడు.. వెంటనే అను ఫీల్ తో “శివా..” అని అంది.. శివ మాత్రం అయోమయంగా “హా..” అని బదులిచ్చాడు.. అను అదే ఫీల్ తో శివ వైపు చూస్తు “ఫస్ట్ ఇయర్ నుండి నీకు తెలియకుండా ని చుట్టూనే తిరుగుతున్నా.. నీ నోటి నుండి వచ్చే ప్రతిమాట నీకు తెలియకుండానే నాకు సంతోషాన్ని ఇచ్చాయి.. నువ్వు వదిలిన ప్రతి శ్వాస గంధపు గాలీలా నా చుట్టూనే అలముకున్నాయి.. నీ చుట్టూ ఉండే గాలి అయిన నిన్ను తాకటం మార్చిపోయిందేమోగాని నా చూపు నిన్ను తాకటం మాత్రం మర్చిపోలేదు.. ఎప్పటినుండో నీకు చెప్పాలి అనుకున్న మాట.. నిన్ను నా వాడిగా జీవితాంతం నాతోనే ఉంచేసుకోవాలనుకునే మాట.. నీ ముందు మాత్రమే చెప్పాలి అనుకున్న మాట, కాని ఇప్పుడిలా ఇంతమంది ముందు చెప్తున్న మాట.. అది.. అది.. I LOVE YOU SHIVA..” అని చెప్పింది.. అదివిన్న గ్యాంగ్ మొత్తం ఒక్కసారిగా “ఓహొ శివా! ఆహా” అంటూ అరిచారు.. దానికి శివ (అను తో ) “మావ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది.. ఆ డైలాగ్ అయితే కేక.. ఆ ఫీల్ అయితే వేరే లెవెల్.. ఒక్కఆ క్షణం నాకే నిజంగా నిజమేనేమో అని అనిపించింది.. ఇదే మాట నీ మనసుకి నచ్చిన అబ్బాయికి చెప్పు.. కచ్చితంగా ఒప్పుకుంటాడు.. its promise..” అని అంటూ మిగిలిన వాళ్ళని చూస్తూ, బాటిల్ పట్టుకున్నాడు... కానీ అను మాత్రం “నేనిప్పుడు అదే చేశా శివ.. నా మనసుకి నచ్చిన అబ్బాయి నువ్వే..” అని చెప్పింది.. ఇంకా శివ నవ్వుతూ “హే యు క్యూట్ గాల్.. ఇంకా కారెక్టర్ నుండి బయటకి రాలేదా.. సీన్ అయ్యిపోయింది.. pack up..” అని అన్నాడు.. కాని అను మాత్రం “సీన్ కాదు శివ నిజం.. ఎప్పటినుండో నీకు ఈ విషయమ్ చెప్పాలి అనుకుంటున్నా... కానీ ఇప్పటికీ కుదిరింది..” అని చెప్పింది..
ఆ మాటలు విన్న మిగిలిన వాళ్ళంతా వాళ్ళిద్దరినీ వదిలేసి వెళ్లిపోయారు..
ఇంకా శివ “ఏమి మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా అను నీకు.. నేను నీకు కరెక్ట్ పర్సన్ ని కాదు.. నీలాంటి మంచి అమ్మాయిని పొందే అర్హత నాకు లేదు.. నీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పటివరకి నేను ఎంత మంది అమ్మాయిలతో తిరిగానో నాకే తెలియదు.. సొ తెలిసి తెల్సి ఈ తప్పుని నేను చేయలేను, నన్ను వదిలేసి, వేరే అబ్బాయిని చూసుకో..” అని చెప్పి వెళ్లిపోవడానికి నించున్నాడు.. కాని అను మాత్రం “తెలుసు శివ..” అని అంది.. ఆ మాటలని విన్న శివ మళ్ళీ వెంటనే కూర్చుని “ఏంటి? నాటకాలు వేస్తున్నావా.. ఇప్పటివరకి ఏమి తెలియక లవ్ చేశావ్ అనుకున్నా.. అని తెలిసి ఇలాంటి నిర్ణయం తీసుకున్నవా.. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళి, ఆ ఆలోచనలని మార్చుకో..” అని మళ్ళీ వెళ్లిపోవడానికి నిలుచున్నాడు.. అను మళ్ళీ “శివ ఒక రెండు నిమిషాలు నా మాట విను.. ఎక్కడో విన్న... ఒక మనిషితో అన్నీ అయ్యిపోయాక కూడా ఇంకా ఏదో మిగిలి ఉంది అని ఫీల్ అవ్వగలిగితేనే అది నిజమయిన ప్రేమ అని.. నువ్వు తిరగడం తప్పు అని నేను అనుకోవడం లేదు.. ఎందుకంటే అది నీ పర్సనల్.. కాని అన్నీ అయిపోయాక నువ్వు వాళ్ళని అసలు పట్టించుకోలేదు.. అంటే అర్ధం నీకు వాళ్ళ మీద ప్రేమ లేదు అని.. కాని నాకు నమ్మకం ఉంది, ఒకసారి నాతో టైమ్ స్పెండ్ చేయి, ఇంకా మిగిలిన జీవితం మొత్తం నాతోనే ఉంటావని.. అందుకే అడుగుతున్నా.. నాతో ఉండిపో శివ ..” అని కొంచెం బాధ పడుతూ అడిగింది.. శివ మాత్రం “వద్దు అను.. iam not perfect అని తెల్సి, నిలాంటి పర్ఫెక్ట్ అమ్మాయిని లవ్ చేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు.. ముఖ్యం నాకు నమ్మకం లేదు నేను మారతాను అని.. కాబట్టి వదిలే నన్ను..” అని చెప్పాడు.. మళ్ళీ అను “మనుషులు ప్రతిసారి ఒకేరకంగా ఉండరు శివ.. పరిస్థితులని బట్టి మారతారు.. ఇప్పటివరకి నీకు మారాల్సిన అవసరం రాలేదు.. ఇకముందు మారతావన్న నమ్మకం నాకు ఉంది.. నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ నిన్ను తప్పకుండా మారుస్తుంది.. అందుకే అడుగుతున్నా Will You Love Me” అని అడిగింది.. ఇంకా శివ చిరాకుగా “అయ్యో నీకు ఎలా చెప్తే అర్ధం అవుతుంది అను.. నీకు నాకు సెట్ అవ్వదు..” అని అన్నాడు.. కానీ అను మత్రం “సెట్ అవ్వదు అని నువ్వు అనుకుంటే సరిపోదు శివ.. అయిన నాకు నమ్మకం ఉంది.. నేను రెఢీ అంటున్నగా.. కలిసి ట్రావెల్ చేద్దాం.. తర్వాత కూడా నీకు ఇదే ఫీలింగ్ ఉంటే ఆనందంగా విడిపోవడానికి నేను రెఢీ..” చెప్పింది.. ఆ మాటలని విన్న శివ అక్కడి నుండి వెళ్ళిపోయాడు..
సాయంత్రం శివ బాల్కనీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు.. చందు వచ్చి చూసి “ఏంటి శివ.. ఏదో ఆలోచిస్తున్నావ్.. అను గురించేనా!” అని అడిగాడు.. దానికి శివ “అవును చందు.. చాలా మంచి పిల్లరా.. అనవసరంగా నన్ను చూస్ చేసుకుని జీవితం నాశనం చేసుకుంటుంది.. ఎంత చెప్పిన వినడం లేదు.. కావలిస్తే కొన్ని రోజులు ట్రావెల్ చేద్దాం అంటుంది..” ఇంకా చందు “అరే శివ, ఇప్పటివరకు నీ దృష్టిలో ప్రేమ అంటే నాలుగు గోడల మధ్య 10 నిమిషాలు చేసే పనీలా చూశావ్.. కాని అది కాదురా.. ఒక పర్సన్ ని ప్రేమించడం అంటే ఎంత కాలం అయిన వాళ్ళ కోసం ఎదురు చూడటం.. అను నీకోసం ఎదురు చూడగలదు అని నాకు నమ్మకం ఉంది.. తనకి నచిన్నట్టు నిన్ను మార్చుకుంటుంది అని నేను నమ్ముతున్న... సరే ఇదంతా కాదు, నిన్ను ఒక్క విషయం అడుగుతా చెప్తావా! ఇప్పటివరకు నిన్ను ఎంతమంది ఇలా కలిసి ట్రావెల్ చేద్దాం అని అడిగారు”. దానికి శివ ఆలోచిస్తూ “అందరూ ఇలానే అడిగారు రా..” అని సమాధానం ఇచ్చాడు.. అది విని చందు “మరి అప్పుడు ఆలోచించని నువ్వు ఇప్పుడేందుకు ఆలోచిస్తున్నావ్..” అని అడిగాడు.. శివ మళ్ళీ ఆలోచిస్తున్నాడు.. ఇంకా ఆలోచనలలో ఉన్న శివని వదిలేసి చందు బయటకి వెళ్తూ మనసులో “ఇప్పటవరకి ఎక్కడో ఒక చిన్న అనుమానం ఉండేది నువ్వు మారతావో లేదో అని, కాని ఇప్పుడు నమ్మకం వచ్చింది, అను కోరుకున్న మార్పు నీలో మొదలయ్యింది అని..” అనుకుంటూ షాప్ కి వెళ్ళి జాన్ కోసం చాక్లెట్ కొన్నాడు..
ఇదంతా విన్న చంద్రుడు వినాయకుడితో “అను ప్రేమ చాలా గొప్పది స్వామి.. ఎదవ అని తెలిసి కూడా తనని మార్చగలను అనే నమ్మకాన్ని పెంచుకుంది.. నమ్మకంతో మొదలయిన ప్రేమ ఎప్పటికీ ఒడిపోదుగా స్వామి.. నేను చెప్తున్న మాటలు నిజమేనా స్వామి??..” అని అడిగాడు.. దానికి వినాయకుడు నవుతూ “అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ భూలోకంలో మనకి ఇన్ని దేవాలయాలు ఉండేవి కాదేమోనయ్యా..” అని చెప్పి మాయమయ్యిపోయాడు... ఇంకా చంద్రుడు కూడా వెళ్ళిపోయాడు.. కాబట్టి మిగిలిన కథ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం..
bye.. take care... Don't forget to follow our page in WhatsApp and Instagram...!! ( Links given below 👇 👇)

thank you for reading
Uma
join our family :
Instagram:
Review form: https://forms.gle/rwiEr6m1aPd8SprVA
Note: May be it will continue to next episode... thank you for your support till this minute... imagine chesukuni raayadam naa work... and imagine chesukuntu enjoy chestharani expect chesthunna..
Comment mukhyam.....
Commentaires