top of page

చందమామ'తో' కధలు - 05

Updated: Jul 31, 2024

PART - 05


ప్రతిసారి వినాయకుడి రాకకోసం చంద్రుడు ఎదురుచూసేవాడు.. కాని ఈసారి మాత్రం మేము (chinnistories రైటర్స్) చెప్పే కథ కోసం వినాయకుడు, చంద్రుడు ఇద్దరూ ఎదురుచూస్తున్నారు.. ఈరోజు నుంచి గొడవ పడకూడదు అని వాళ్ళిద్దరూ నిర్ణయించుకుని కూర్చున్నారు.. ఇంకా మేము కథ చెప్పడం మొదలుపెట్టాము..

తరువాత రోజు అందరూ క్లాస్ కి వెళ్తున్నారు.. చందుకి మళ్ళీ తన జాన్ ని చూడాలి అనిపించింది.. వెంటనే శివతో “అరే శివ! మన క్లాస్ ఇక్కడ కాదేమో రా!” అని అన్నాడు.. అది విన్న శివ “బాబు నికోక దండం మొన్న కూడా ఇలానే నీవల్ల ఒక క్లాస్ మింగింది.. ఈ రోజయిన పోనివ్వరా! కావలిస్తే నీకు కావాల్సిన క్లాస్ కి బ్రేక్ నుండి వెళ్దాం..” అని అన్నాడు.. చందు సరే అని క్లాస్ లో కూర్చున్నాడు.. మనిషి క్లాస్ లో ఉన్నాడు కాని మనసు మాత్రం జాన్ దగ్గరే తిరుగుతుంది.. ఇంక సర్ 2nd మిడ్ పరీక్షలు వస్తున్నాయి.. 1st మిడ్ చాలా బాగా రాశారు కాబట్టి ఇది అంతకంటే బాగా రాయాలి.. సమయం వృధా చేసుకోకండి..” అని చెప్పి ఇంకా సిలబస్ కూడా పూర్తి అయ్యిపోయింది అని చెప్పాడు.. అది విన్న శివ “ చందు నాకెందుకో ఆయన నీ గురుంచి చెప్పాడు అనిపిస్తుంది” అన్నాడు.. ఏంట్రా అది అని అడిగాడు చందు.. టైమ్ వృధా చేసుకోవద్దు అని అన్నాడు.. ఆ మాటలు విన్న చందు చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాడు.. ఇంతలో టైమ్ కన్నా ముందే సార్ వెళ్లిపోయారు.. చందు అలా ఉండటం గమనించిన శివ “ఇదంతా కామన్ రా.. btech అంటేనే టైమ్ పాస్ చేస్తూ ఎంజాయ్ చేయాలి.. అప్పుడే కాలేజీ డేస్ కి ఒక విలువ ఉంటది” అని చందు ని ఓదార్చడానికి చెప్పాడు.. ఆ మాటలు విన్న చందు “అవును మావ! నువ్వు చెప్పింది నిజమే! కాని టైమ్ ని కరెక్ట్ ఉపయోగించుకుంటేనే మనం అనుకున్నది సాదిస్తాం” అని చెప్పాడు.. శివ మంచి కాన్ఫిడెంట్ గ “ అవును చందు, ఇప్పటి నుండి మనం మన లక్ష్యం కోసం కష్టపడాలి.. చెప్పు ఏమి చేద్దాం” అన్నాడు.. “అవును మావ! పదా వెళ్ళి కష్టపడదాం” అని అన్నాడు.. శివ వెంటనే “ వెళ్లాలా.. ఎక్కడకీ..” అంటూ సాగదీశాడు.. చందు “ అదేంటి మావ! ఇప్పటివరకి అనుకున్నాంగా లక్ష్యం అని... అది S203 లోనే ఉందిగా.. పదా” అన్నాడు.. శివ “ఛీ దీనమ్మ జీవితం.. నువ్వు మాత్రం మారవు రా!” అని అంటూ వెనకాలే వెళ్ళాడు.. అలా రోజులు గడుస్తున్నాయి.. ఎంతో కష్టపడి ధైర్యం చేసి తన ఇంస్టాగ్రామ్ కి ఫోలో అయ్యి, మెసేజ్ చేశాడు.. కాని చందు దరిద్రం ఎక్కువగా ఉండటం వలన జాన్ కి వచ్చే కొన్ని వందల మెసేజ్ లలో ఇది కూడా ఒకటిగా కలిసిపోయింది..

అలా తన కోసం తిరగడం.. తనని చూడటం.. కనిపించినప్పుడు తనని చూసి మాట్లాడటం.. కనిపించనప్పుడు తలుచుకోవడం.. ఇలా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నాడు.. అన్నీ మారుతున్నాయి కాని చందుకి అమ్మాయి మీద ఉన్న ప్రేమ మాత్రం మారలేదు.. శివకి backlog లు  పెరగడం మారలేదు.. చందుకి టాప్ మార్కులు రావడం ఆగలేదు.. ఇన్ని జరిగిన అబ్బాయికి మాత్రం జాన్ నెంబర్ అడగడానికి ఉన్న భయం మాత్రం పోలేదు.. సెకండ్ ఇయర్ అలా అలా సాగుతుంది.. చందు కూడా జాన్ కి దగ్గరవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.. అందులో భాగంగానే కాంటీన్ లో కబుర్లు.. రోడ్డు మీద షికార్లు.. ఎన్నిరోజులు అయిన జాన్ లో మాత్రం అసలు ఏ మార్పు లేదు.. ఒకరోజు అందరూ చెట్ల దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు.. దూరంగా తేజ చేతిలో ఏదో పట్టుకుని వెళ్తున్నాడు.. శివ “ఏంట్రా తేజ! ఏదో పట్టుకెళ్తున్నావ్?” అని అడిగాడు.. తేజ “అంటే రేపు చందు వాళ్ళ జాన్ పుట్టినరోజుగా, పైగా ఆదివారం.. అందుకే ఇప్పుడు కేక్ కట్ చేయిద్దామని తీసుకెళ్తున్నా.. సర్లే వెళ్తున్నా.. అసలే కూల్ కేక్.. లేట్ అయితే మళ్ళీ కరిగిపోతుంది..” అని వెళ్ళిపోయాడు.. అది విన్న చందు కొంచెం ఆలోచనలో పడ్డాడు.. సరేలే అని తేజ తో పాటు చందు శివ కూడా వెళ్లారు.. శివ మాత్రం వెళ్ళిన వెంటనే అక్కడ ఒక అమ్మాయిని చూశాడు.. తనతో పులిహోర కలుపుకుంటూ బిజీ అయ్యిపోయాడు.. కాని చందుకి మాత్రం ఏదో తేడాగా ఉంది.. ఎవరు పట్టించుకోవడం లేదు.. చివరికి అమ్మాయ్ కూడా చూసి చూడనట్టు ఉంది.. పైగా అక్కడ ఉన్నవాళ్ళంతా కొత్తవాళ్ళు, వేరే సెక్షన్ అవ్వడం వలన వాళ్ళతో పరిచయం లేదు.. అక్కడ జరుగతున్నవి చూసి చందుకి చాల కోపం వచ్చింది.. ఇంకా అక్కడి నుండి వచ్చేస్తునాడు.. అది గమనించిన అమ్మాయ్, “ఓయ్ చందు! ఏంటి వెళ్లిపోతున్నావ్? ఆగు.. ఆగు..” అని పిలుస్తున్న పట్టించుకోకుండా వచ్చేస్తున్నాడు.. ఇంకా అలా కిందకి వచ్చి అబ్బాయి చేయి పట్టుకుని ఆపి “ఎందుకు వెళ్లిపోతున్నావ్ చందు” అని అడిగింది.. చందు కోపంగా “ఎందుకు ఉండాలి.. అక్కడ ఏది నాకు నచ్చడం లేదు.. వాళ్ళంటే కొత్తవాళ్ళు వాళ్ళకి తెలియదు, చివరికి నువ్వు కూడా చూసి చూడనట్టూ ఉంటే నాకు చిరాకు వచ్చి వచ్చేశా” అని అరిచాడు.. అది విన్న అమ్మాయ్ “అసలు ఎందుకురా నిన్ను పట్టించుకోవాలి.. అందరిలానే నువ్వు కూడా.. నీకు నువ్వే అన్నీ ఊహించేసుకుని, ఇప్పుడు నేను పట్టించుకోవడం లేదు అని అనుకుంటే ఎలా? నేను అడిగాన నిన్ను నాతో ఉండమని.. నేను పిలిచాన నిన్ను పార్టీకి రమ్మని....” అని ఇంకా మాట్లాడుతూ ఉండగా చందూ వినకుండా అక్కడినుండి  వచ్చేశాడు.. ఇంకా అమ్మాయి కూడా వెళ్ళిపోయింది..

అలా పార్టీలో అమ్మాయితో పులిహోర కలిపుతూ వెళ్ళిపోయిన శివ సాయంత్రానికి రూమ్ కి వచ్చాడు.. చందు రూమ్ లో లేదు.. బాల్కనీ లో కూర్చుని ఉన్నాడు.. అది చూసిన శివ ఫ్రీడ్జ్ నుండి రెండు బీర్లు పట్టుకుని ఒకటి తాగుతూ ఇంకొకటి చందు దగ్గరకి తీసుకెళ్తూ “ మావా! ఇన్ని రోజులు స్వర్గం అంటే ఎక్కడో ఆకాశంలో ఉంటది.. ఎలా చేరుకోవాలో అని ఆలోచించేవాడిని కాని ఈరోజే తెల్సింది నాలుగు గోడలు మధ్య కూడా స్వర్గం అంచులవరకి తీసుకెళ్ళే శక్తి ఒక్క ఆడదానికే ఉందని అర్ధమయ్యింది..” అని మాట్లాడుతూ చందు దగ్గరకి వచ్చి బాటిల్ ఇచ్చాడు.. వాడు తీసుకోకుండా బాధ పడటం చూసి “ఏమైంది మావ! నేను ఇంత హ్యాపీగా చెప్తుంటే నువ్వేమో ఇలా బాధగా ఉన్నావ్! ఓహొ.. నీకు అవకాశం రాలేదని బాధ పడుతున్నావా?” అని నవ్వాడు... అది విన్న చందు, తనకి అమ్మాయికి జరిగిన గోడవని చెప్పి “ఇప్పుడు తనతో మాట్లాడాలి అని ఉంది.. కాని ఎలా? ఇంస్టాగ్రామ్ లో పట్టించుకొదు, నెంబర్ లేదు” అని బాధ పడ్డాడు.. “హే దీనికే ఇంత బాధ పడుతున్నావా! ఇప్పుడేంటి తన నెంబర్ కావాలి అంతేగా.. నేను రప్పిస్తా ఆగు” అని తనకి పరిచయమయిన అమ్మాయికి కాల్ చేశాడు.. అమ్మాయ్ కాల్ ఎత్తి కొంచెం రొమాంటిక్ గా  “బేబీ! ఏంటి కాల్ చేశావ్! మళ్ళీ గుర్తొచ్చాన! ఇందాకేగా వెళ్ళావ్.. ఇప్పుడు నావల్ల కాదు.. కాని” అంటూ కొంచెం సాగదీస్తుంది.. శివ వెంటనే “నీయమ్మ ఎప్పుడు అదేనా! నీకు ముందే చెప్పా.. ఈరోజు జరిగింది, ఒక మధురమైన, అంధమైన అనుభూతి.. అలాంటి అనుభూతుల్ని మళ్ళీ మళ్ళీ ఒకే వ్యక్తితో అంటే ఆ మాధుర్యానికి విలువ ఉండదు.. కాబట్టి.. నెక్ట్ టైమ్ కొత్తవాళ్ళతో..” అని మాట్లాడుతుంటే పక్కనుండి చందు మాత్రం నెంబర్ ఆడగమని గోకుతున్నాడు.. ఫోన్లో అమ్మాయ్ “మరి నాకు ఎందుకు కాల్ చేశావ్..” అని అడిగింది.. శివ “ఈ రోజు ఒక అమ్మాయ్ పుట్టినరోజు జరిగిందిగా.. తన నెంబర్ కావాలి..” అని అడిగాడు.. తను కోపంగా “ఛీ వెధవ! నీకు తన నెంబర్ అసలు ఇవ్వను..” అంది. శివ చిరాకుగా “నీయమ్మ నువ్వు ఎక్కువ చేయకు.. ఆ నెంబర్ నాకు కాదు.. మా ఫ్రెండ్ చందుకి కావాలి” అని అడిగాడు.. ఆ మాటలు విన్న అమ్మాయ్, కొంచెం సిగ్గు పడుతూ “హొ.. చందు కోసమా.. ముందే చెప్పాలిగా.. సరే మెసేజ్ చేస్తా చూడు” అని కాల్ పెట్టేసింది.. వెంటనే ఆ నెంబర్ చందుకి ఇచ్చాడు.. చందు ఆ నెంబర్ కి కాల్ చేశాడు.. లిఫ్ట్ చేయడం లేదు.. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాడు.. శివ మెల్లగా “మావ! నాకు అయితే ఇవ్వను అంది.. నీకు అని అడిగితే కొంచెం సిగ్గు పడుతుంది.. నాకు తెలియకుండా ఏమయినా గోకుతున్నవా? చెప్పు మావా! తొందరగా పడిపోతుంది” అని అన్నాడు.. చందు చిరాకుగా “హే ఆపరా నీ సోది.. ఎప్పుడు అదేనా.. నాకు అలాంటి ఇంటరెస్ట్ లేదు.. అసలే నా జాన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదని కంగారూపడుతుంటే..” అని మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నాడు.. ఇంకా శివ బెడ్రూం లోకి వెళ్తూ “ఏం మనిషివిరా బాబు నువ్వు.. మగాడిగా పుట్టి, మాధుర్యం అనుభవించను అంటున్నావ్.. ఈ కాలంలో ఇలాంటి అబ్బాయి పొందాలంటే ఎవరికో భీభత్సంగా రాసిపెట్టి ఉండాలి” అని మెల్లగా అనుకుంటూ వెళ్ళిపోయాడు..

ఇదంతా వింటున్నచంద్రుడు వినాయకుడితో “చూశారా స్వామి! కొత్త రైటర్ కొంచెం రొమాంటిక్ అనుకుంటా.. చాలా చిలిపిగా రాశాడు.. ఈ ఎపిసోడ్..” అని అన్నాడు.. అది విన్న వినాయకుడు “ నాకెందుకో అలా అనిపించడం లేదు.. ఉమానే బయపెట్టి బలవంతంగా ఆ సీన్స్ రాయించాడు అనిపిస్తుంది.. ఎందుకంటే కొత్త రైటర్ ఎవరో తెలియదు.. అబ్బాయి అయితే  మీరనుకున్నట్టే రాశాడు అనుకోవచ్చు.. ఒకవేళ అమ్మాయి అయ్యుంటే అలాంటి మాటలు రాయదు..” అని గట్టిగా చెప్పాడు.. అది విన్న చంద్రుడు “ అమ్మాయిలైతే రాయకూడదా! వారికి మాత్రం  ఫీలింగ్స్ ఉండవా! వాళ్ళ ప్రమేయం లేకుండానే ఈ సృష్టి జీవం పోసుకుంటుందా!” అని అడిగాడు.. వినాయకుడు “అవన్నీ నాకు తెలియదు.. ఉమానే బలవంతంగా రాయించాడు.. కొత్త రైటర్ చాలా మంచోడు..” అని అన్నాడు.. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలయింది.. కొంచెంసేపటికి ముషికం మధ్యలో చేరి గొడవ ఆపింది.. చివరిలో  చంద్రుడు “కావలిస్తే చూడు.. రాబోయే కథలు చదివితే నికే తెలుస్తాది.. కొత్త రైటర్ గురుంచి” అన్నాడు.. సర్లే ముందు కథ విందాం అని వినాయకుడు అన్నాడు.. కాని కథ ఆగిపోయింది.. ఎందుకని ఇద్దరు ఆలోచిస్తున్నారు.. “మీ గొడవ చూసి రైటర్స్ కథ చెప్పడం ఆపేసి వెళ్లిపోయారు.. మళ్ళీ తరువాత ఎపిసోడ్ లో కలుద్దాం అని చెప్పమన్నారు” అని చెప్పాడు..


thank you for reading

    Uma






join our family :



Note: May be it will continue to next episode... thank you for your support till this minute... imagine chesukuni raayadam naa work... and imagine chesukuntu enjoy chestharani expect chesthunna..

Comment mukhyam.....


Comments


Post: Blog2 Post
bottom of page