చందమామ'తో' కధలు - 04
- Uma225
- May 4, 2024
- 5 min read
Updated: Jul 31, 2024
PART - 04
చంద్రుడు “ ఈ సారి మనం వినాయకుడిని ఏమి అనకూడదు.. సైలెంట్ గా వచ్చేసి వినేస్తున్నాడు.. కాబట్టి జగ్రత్తగా ఉండాలి” అనుకున్నాడు.. ఈలోపు వినాయకుడు రానేవచ్చాడు.. వస్తూ వస్తూ “ హాయ్ అండి చంద్రుడుగారు, ఈ మధ్య నన్ను తల్చుకోవడం లేదేంటి?” అని అడిగాడు.. దానికి చంద్రుడు “వినాయకులవారికి ప్రణామాలు..” అని ఎప్పటిలాగానే ఒంగి ఒంగి నమస్కారాలు పెడుతున్నాడు.. అది చూసిన వినాయకుడు చిరాకుగా “ హే ఆపవయ్య! వచ్చిన ప్రతిసారి ఈ నమస్కరాలు ఎంటయ్యా! అనడానికి నీకు లేకపోయినా వినడానికి నాకు చిరాకుగా ఉంది..” అని అన్నాడు.. చంద్రుడు “ అలాగే స్వామి!” అని అంటూ మనసులో “ఆ పాత రైటర్ ఉమా, వెళ్తూ వెళ్తూ నాకు రాసిన డైలాగు ఇదే, ఇప్పుడీ కొత్త రైటర్ అయిన మారుస్తారేమో అనుకుంటే, ఈవిడ కూడా అదే కంటిన్యూ చేస్తుంది.. ఇకనుంచి అయిన మారిస్తే బాగుండు” అని అనుకున్నాడు.. కాని వినాయకుడు “అయిన నేను అడిగిన ప్రశ్నకి నువ్వు చెప్పిన సమాధానానికి సంబంధం లేదు” అని అన్నాడు.. ఇంకా చంద్రుడు “ ఎందుకు తలుచుకోవాలి స్వామి! మీ అంతట మీరు వస్తారు, ఏదో చెప్తారు, అయోమయంలో పెట్టి వెళ్లిపోతారు.. తీర తరువాత రోజయిన క్లారిటీ ఇస్తారేమో అనుకుంటే మళ్ళీ సంబంధంలేని కొత్త కొత్త కథలని చెప్తారు.. మీరు చెప్పే కథలమీద మొదట్లో ఉన్న ఇంటరెస్ట్, ఇప్పుడు రావడంలేదు స్వామి” అని కొంచెం కోపగించుకున్నాడు.. ఆ మాటలు విన్న వినాయకుడు “ఇప్పుడిలా అరిచి ఏమి ప్రయోజనం.. ఇన్ని ఎపిసోడ్ చదివారు, ఒక్కరయిన ఒక కామెంట్ లేదా ఒక రివ్యూ ఇచ్చారా!! లేదు !! మళ్లీ నచ్చడం లేదు, ఇంటరెస్ట్ లేదు అంటే రైటర్స్ మాత్రం ఏమి చేయగలరు.. వాళ్లేమి నీ ఆస్తిని అడగటం లేదుగా, జస్ట్ ఒక రివ్యూ ఇవ్వమంటున్నారు.. మీ రివ్యూని బట్టే తరువాత కథ కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారుగా.. అవన్నీ పట్టించుకోకుండా తప్పు నీ వైపు పెట్టుకుని ఇప్పుడు నామీద ఎందుకు కోప్పడుతున్నావ్?” అని చాలా కోపంగా అన్నాడు. అది విని చంద్రుడు మౌనంగా ఉండిపోయాడు.. ఇంకా ముషికం వచ్చి “ స్వామి! ఇలా మీరు గోడవపడుతూ ఉంటే ఉపయోగం ఏం ఉంది.. మీరు కథ మొదలుపెడితే నాక్కూడ వినాలని u..” అని అడిగాడు.. తన కోరిక మేరకు వినాయకుడు కథ చెప్పడం ప్రారంబించాడు..
ఇంకా SRKR ఇంజనీరింగ్ కాలేజీలో 2021 కి సంబందించి ఫ్రెషర్స్ డే అయిపోయింది.. ఇంకా ఈవెంట్స్, ప్రాక్టీస్ అంటూ తిరగడం మానేసి క్లాసెస్ కి వెళ్లాల్సిన టైమ్ వచ్చేసింది.. అసలే ఇంజనీరింగ్ కాలేజీ, పైగా మొదటి సంవత్సరం, క్లాస్ రూమ్స్ మారుతూ ఉండేవి.. ఇంకా లేట్ గా వచ్చే బ్యాచ్ కూడా ఉన్నాయి, అందులో చందు శివ కూడా ఉన్నారు..
ఇంకా అలా ఒకరోజు శివ లేట్ గా వచ్చి క్లాస్ బయట నుంచొని సార్ ని ఆడగాల వద్దా అని ఆలోచిస్తున్నాడు.. దానికి తోడు చందు కూడా శివ తో జాయిన్ అయ్యాడు.. ఈలోపు చందుకి తన జాన్ వేరే రూమ్ లో కనిపించింది.. ఎలాగయిన తన రూమ్ కి వెళ్ళాలి అనుకున్నాడు.. ఇంకా వెంటనే శివతో “అరే మావ! చెప్పడం మర్చిపోయా.. ఈ రోజు మన క్లాస్ ఇక్కడ కాదు రా!” అని అన్నాడు.. కాని శివ మాత్రం “ రే ఇదేరా మన క్లాస్.. అక్కడ చూడు.. కొప్పు నిండా పూలు పెట్టుకున్న కావ్య, చూసిన ప్రతిసారి రొమాంటిక్ గా కనిపించే రాజీ, లాహిరి లాహిరిలో అంటూ పాడుతూ వెళ్లిపోవాలనిపించే లహరి, భూమికి జానెడు ఉండే భార్గవి, అసలు మగాళ్లు మనిషి జాతే కాదు అనుకునే మానస, హసితం మధురం అనే వాక్యానికి అర్ధం ఇచ్చేలా ఉన్న హాసిని, అసలు నవ్వడే తెలియని నవ్య,.. ఇలాంటి వింత జీవులని చూసినక కూడా ఇది మన క్లాస్ కాదు అని ఎలా అనిపిస్తుంది నీకు” అని అడిగాడు.. “ ఇంకా ఆపుతావా.. నువ్వు.. నీ కరువు.. పదా వెళ్దాం, రూమ్ నెంబర్ ఇందాకే notice board లో చూసా S203 అంటా..” అని చెప్పి తీసుకెళ్లిపోయాడు.. వెళ్ళి కూర్చున్నారు.. కొంచెంసేపు తర్వాత శివకి క్లాస్ అర్ధం అవ్వక అమ్మాయిలలో ఎవరు బాగున్నారో అని వెతుక్కుంటున్నాడు.. అంతలో జాన్ కనిపించింది.. అరే చందు తనేంటిరా ఇక్కడ అని అంటూ చందువైపు తిరిగాడు.. అప్పటికే చందు జాన్ ని చూస్తూ ఉన్నాడు.. కాని అమ్మాయి మాత్రం చూసికూడా పట్టించుకోలేదు.. శివ తో చందు “తన చూపులో ఏదో మార్పు వచ్చింది మావ!” అని అన్నాడు.. దానికి శివ కూడా “ అవును మావ! ఒకప్పుడు నువ్వు తన చుట్టూ తిరిగుతుంటే చికెన్ షాప్ ముందు కుక్కల చూసేది, ఇప్పుడేమో ఊరుమీద తిరిగే కుక్కల చూస్తుంది” అని నవ్వాడు.. “అలానే చూస్తూ ఉండు రా.. ఎప్పుడొకప్పుడు ఇంటిలో పెంచుకునే పెంపుడు కుక్కల హత్తుకుంటది” అని చందు అన్నాడు.. “అదంతా నాకు తెలియదు కాని ఒక్కటిమాత్రం నిజం.. తన దృష్టిలో నువ్వొక కుక్కవి” అని శివ నవ్వాడు.. ఆ మాటలు విన్న చందు కోపంగా “తూ.. నీ అబ్బా..” అంటూ చేతిలో బుక్ శివ మీదకి విసిరాడు.. ఇదంతా చూస్తున్న సార్ ఇద్దరినీ బయటకి పంపించేశాడు..
శివ బయటకి వస్తూ “రేయ్ చందు.. నాకు బ్రైన్ లేదు రా..” అన్నాడు.. చందు “ఇప్పుడేందుకు మావ, అంతా పెద్ద నిజం తెలుసకున్నావ్?” అని నవ్వుతూ అడిగాడు. “లేకపోతే ఏంట్రా.. ఎవరయినా డైలీ క్లాస్ గురుంచి నోటిస్ బోర్డు లో పెడతాడా! నా పిచ్చి, నా వెర్రి కాకపోతే, నువ్వు చెప్పడం, నేను నమ్మడం.. నీ వెనుక రావడం.. attendance పోగొట్టుకోవడం.. సర్లే అయ్యిందేదో అయ్యింది.. పదా అలా బయటకి వెళ్ళి govtకి tax కట్టి next పీరియడ్ వద్దాం” అనుకుని వెళ్తూ ఉండగా, ఇంతలో అమ్మాయ్ బయటకి వచ్చి “ఓయ్! ఏంటి మా క్లాస్ కి వచ్చావ్?” అని అడిగింది.. దానికి బదులుగా శివ “ అబ్బో పెద్ద మిస్ యూనివర్స్ క్లాస్ లో ఉందంటే ఒకసారి తనని చూద్దాం అని వచ్చాం.. !” అని అన్నాడు.. దానికి అమ్మాయ్ “ఛీ! పోరా వెధవా! నిన్ను అడగలేదు” అని అంది... “మరి ఓయ్ అంటే ఎవరిని పిలిచినట్టు.. వాడికోక పేరు ఉంటదిగా.. దానితో పిలవచ్చుగా” అని శివ అన్నాడు.. వెంటనే చందు “ మావ! ఇంకొక్క మాట నీ నోటి నుండి వస్తే, రేపటినుండి అసలు మాటలు రాకుండా చేస్తా” అని నవ్వుతూ వార్నింగ్ ఇచ్చాడు.. ఇంకా మెల్లగా అమ్మాయి వైపు నడుస్తూ “ అనుకోకుండా.. పొరపాటున మీ రూమ్ కి వచ్చాం.. తరువాత కాదు అని తెల్సిన వెళ్లలేకపోయం.. చివరికి వెళ్ళాలి అని లేకపోయినా తోసేశారు..” అని చెప్పాడు.. దానికి అమ్మాయ్ “అవునా.. నిజమా.. చెప్పు చెప్పు ఇంకా చెప్పు ఆపేసావే.. చెప్పు” అని అంది.. “ok నీకు అర్ధమయిందిగా..” అని అన్నాడు.. కాని అమ్మాయ్ మాత్రం “నాకేం అర్ధం కాలేదు.. అయిన ఏముంది అర్ధం అవ్వడానికి” అని కొంచెం కంగారూ పడింది.. నిజంగా అర్ధం అవ్వలేదా అవ్వలేదా అంటూ తన కళ్ళలో కళ్ళు పెట్టి అడుగుతూ మీద మీదకి వెళ్తున్నాడు.. అంతలో పీరియడ్ అయ్యిపోయి అందరూ బయటకి రావడం గమనించి అబ్బాయ్ దూరం జరిగాడు..
ఇంకా అక్కడి నుండి వెళ్లిపోతూ శివ చందుతో “ఎందుకురా ఎన్నిసార్లు చెప్పిన వినడం లేదు.. చూడు ఇప్పుడుకూడా ఎంత షో చేస్తుందో ఏమి తెలియనట్టు.. నచ్చితే yes అని చెప్పాలి లేదా no చెప్పాలి అంతేగానీ మనకేంటిరా ఇది” అని అన్నాడు.. చందు “ఊరుకో శివ.. అమ్మాయి కదరా.. అంతా త్వరగా నిర్ణయం ఎలా తీసుకుంటది అనుకుంటున్నావ్.. అసలు తనకి నా గురుంచి ఏమి తెల్సు రా.. నాకు మాత్రమే నచ్చితే సరిపోదుగా.. నాకు మాత్రం తనపై ప్రేమ ఉంటే సరిపోదుగా... నేను నిన్న చెప్పిన మాటలు నిజమో, లేక సొల్లు చెప్పానో తెల్సుకోవడానికి టైమ్ కావాలిగా.. అందుకే ఇంకా తన వెంట తిరుగుతున్నా.. తను షో చేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావ్.. ఆలోచించుకుంటుంది నేను అనుకుంటున్నా..” అని చెప్పాడు..
అది విన్న శివ “ మరెందుకురా రిప్లై రిప్లై అంటూ తన వెంట తిరిగుతున్నావ్..” అని అడిగాడు.. దానికి చందు “అలా అడుగుతూ తన వెంట తిరగొచ్చు.. కనీసం అలా అయిన నా ఫీలింగ్స్ తనకి ఇంకా త్వరగా అర్ధం అవుతాయని తిరుగుతున్న” అని చెప్పాడు.. మళ్ళీ శివ “ అలా అయితే ముందు ఫ్రెండ్స్ గా పరిచయం అయి, నువ్వేంటో తనకీ తెల్సినాక ప్రపోస్ చెయ్యొచ్చుగా.. ఇప్పుడు చూడు కనీసం నిన్ను చూడటం లేదు.. సరిగ్గా మాట్లాడటం లేదు..” అని అన్నాడు.. దానికి నవ్వుతూ చందు “వద్దు మావ! ఇప్పటికే ఫ్రెండ్స్ అంటూ వాళ్ళ ప్రేమకి ముసుగు వేసుకుంటూ చాలా మంది తిరుగుతున్నారు.. కాని నాకు, నా ప్రేమకి ఆ దుస్థితి పట్టలేదు అనిపించింది.. నా ఫీలింగ్స్ చెప్పా.. తను కూడా ఫీల్ అయితే అప్పుడు నాకు చెప్తది” అని అన్నాడు.. అది ఎలా తెలుస్తది సార్ అని వెటకారంగా అడిగాడు శివ.. “అది నీకు అర్ధమయిన రోజు ఇలా నాతో కాకుండా ఒక అమ్మాయితో తిరుగుతావ్ లే” అన్నాడు.. ఇంకా చిరాకు వచ్చిన శివ “ అవునురా! నువ్వొక రోమియో, తనొక జూలియట్.. నేను వెర్రి వెధవని.. సంతోషమా ఇప్పుడు..పదా ఇంత నాలెడ్జ్ పెంచుకున్నాక govt కి టాక్స్ కట్టకపోతే నాకొచ్చే fee reimbursement కి వాల్యూ ఉండదు..” అంటూ శివని బయటకి తీసుకు వెళ్తున్నాడు..
ఇలా వినాయకుడు కథ చెప్తూ ఉండగా.. ముషికం ఒక letter తీసుకొచ్చింది.. అది చదివిన వినాయకుడు ఇంకా కథ ఆపేసి వెళ్లిపోవడానికి సిద్దమవుతున్నాడు.. ఏమైందని చంద్రుడు అడిగాడు.. “ ఇకపై నేను నీకు ఈ కథని చెప్పకూడదు అని అందులో ఉంది” అని చెప్పాడు.. “స్వామి! మీకు ఇలాంటి పరిస్థితా! మిమ్మల్ని ఆదేశించేవాళ్ళు కూడా ఉన్నారా! దానిని అనుసరించడం అవసరం అంటారా..” అని అడిగాడు.. దానికి వినాయకుడు “అనుసరించాలి.. ఎందుకంటే ఆ లెటర్ వచ్చింది మన రైటర్స్ దగ్గర నుండి.. మనల్ని క్రియేట్ చేసింది వాళ్ళు.. సొ వాళ్ళు చెప్పింది వింటే మనకి గౌరవంగా ఉంటది.. మన మధ్య గొడవలు ఎక్కువగా అవ్వడం వలన, స్టోరీ బాగా లాగ్ అవుతుంది అంటా.. సొ ఆ లాగ్ ని తగ్గించడానికి రేపటినుండి మన ఇద్దరం అందరిలానే కథని వినాలి.. ఏమైనా doubts ఉంటే మాత్రమే మాట్లాడాలి అని ఆ లెటర్ లో ఉంది..” అని చెప్పాడు.. మీరు కూడా నాలా వింటే ఇంక చెప్పేది ఎవరో అని చంద్రుడు ఆలోచిస్తున్నాడు.. కాని ఆ లెటర్ వెనుక ఉన్న కారణం తెల్సిన వినాయకుడు ఆనందపడుతూ కైలాసానికి వెళ్ళాడు..

thank you for reading
Uma
join our family :
Review form: https://forms.gle/rwiEr6m1aPd8SprVA
Note: May be it will continue to next episode... thank you for your support till this minute... imagine chesukuni raayadam naa work... and imagine chesukuntu enjoy chestharani expect chesthunna..
Comment mukhyam.....
Paatha writer Uma Gaarani thelusu.. E kottha writer evaro konchem introduce cheyyandi Uma Gaaru..