చందమామ'తో' కధలు - 03
- Uma225
- Apr 29, 2024
- 4 min read
Updated: Jul 31, 2024
PART - 03
అలా మరి కొన్ని రోజులు గడిచాయి, వినాయకుడు "ఈ చంద్రుడు ఏం చేస్తున్నాడో ఏంటో మొన్న కథ చెప్తా విను అన్న వినకుండా మాయం ఐపోయాడు మళ్ళీ నేను రాలేదు అని నన్ను తిట్టుకుంటాడు, నన్ను ఇంకా ఎన్ని తిట్టుకుంటున్నాడో చూద్దాం" అని చంద్రుడు వద్దకు వెళ్తూ వున్నాడు, ఈలోపు మన చంద్రుడికి అత్రం ఆగక మళ్ళీ వినాయకుడుని "ఈ వినాయకుడు ఎంటి కొంపతీసి నామీద కోపం ఏమైన వచ్చిందంటావా??చెప్పకుండా మాయం ఐపోయ అని అసలు ఈ మధ్య రావడమే మానేశాడు, మళ్ళీ నువ్వేం ఫీల్ అవ్వకు నేను వస్తూనే ఉంటా అని కబుర్లు చెప్తూ వెళ్ళిపోతాడు, ఎలా ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలో ఈయన కోసం" అని frustate అవుతూ ఉంటాడు.
ఇవి వింటున్న వినాయకుడు, "ఆహా వచ్చాం లే ఇంకా ఆపు" అని కౌంటర్ వేస్తూ, "ఎంటి నన్ను తలుచుకోనిదే తమరికి రోజు గడవట్లేదు అనుకుంటగా" అని అడిగాడు. చంద్రుడు "అయ్యయో అదేం లేదు స్వామి, వినాయకుల వారికి ప్రణామాలు" అని వంగి నమస్కరిస్తారు. "బాగుంది అయ్య నీ వరస నేను ఉంటే ఒకల లేకపోతే మరోలా, వెరీ గుడ్ ఎక్కడ నేర్చుకున్నావు కాస్త చెప్తావా" అని వినాయకుడు అడిగాడు. దానికి చంద్రుడు "అంటే అది మరి..... స్వామి....(Inner voice of చంద్రుడు:- నాదేం ఉంది స్వామి అంత ఆ రైటర్ ఉమ గారిదే..)". వినాయకుడు "సార్లే ఇంకా లాగ్ చేయకు, ఇప్పటికే చాలా లాగ్ అయింది, ఇంకా మొదలు పెడదామా మన స్టోరీ". చంద్రుడు curiosity తో "హా స్వామి హా, చెప్పండి స్వామి త్వరగా". వినాయకుడు "చాలా ఎక్సైట్ అవ్తునట్టు ఉన్నావ్, సార్లే విను..."
ఆ రోజు SRKR కాలేజీ లో fresher's day as usual గానే చందు & శివ గ్యాంగ్ అంత కలరింగ్ నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ చందు మాత్రం నిన్న కనిపించిన ఆ అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నాడు ఎక్కడ ఉందో, ఎప్పుడు కనిపిస్తుందో, అసలు ఈరోజు కాలేజీ కి వచ్చిందా లేదా, వచ్చి ఉంటే ఏ కలర్ డ్రెస్ వేసుకుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు, ఇది చూసిన శివ "ఎరా మావ! ఎంటి నిన్న చూసిన అమ్మాయి గురించి థింకింగ్ ఆ.....?". చందు "అదేం లేదు మావ " అంటూ కవర్ చేశాడు, కానీ వాళ్ళ గ్యాంగ్ అంత చందు నీ ఏడిపించటానికి "అదిగో రా అమ్మాయి అక్కడ వుంది ", ఇంకొకడు"హే ఇదిగో రా చందు అమ్మాయి అక్కడ వుంది" అంటున్నారు. అప్పుడు చందు "ఇంకా చాలు అక్కడ culturals స్టార్ట్ అవుతున్నాయి పోదాం పదండి" అన్నాడు. శివ & చందు వల్ల గ్యాంగ్ అంత ఓపెన్ ఆడిటోరియం దగ్గర వైట్ చేస్తూ వుంటారు culturals స్టార్ట్ అవుతాయా లేదా అన్నట్టు... ఈలోపు స్టేజ్ పైకి మన సుద్దపూస (TEJA - The Lover Boy) entry ఇస్తాడు.... శివ "arey మావ ఇటు చూడండి రా మన సుద్దపుస స్టేజ్ ఎక్కాడు...." అని విస్సెల్ వేస్తూ వుంటారు.... ఇప్పుడు మన సుద్దపూసా సాంగ్ స్టార్ట్ చేస్తాడు "(song-1) మహా గణపతి మనసా స్మరామి.........(మ్యూజిక్)........"
చంద్రుడు "ఎంటి స్వామి శుద్దపూస కూడా నలనే మీ భక్తుడా?....", అప్పుడు వినాయకుడు "ఇప్పుడు నువ్వు నా flow అపవ్ అంటే ఇక్కడే ఆపేసి వెళ్ళిపోతా", చంద్రుడు "వద్దు స్వామి వద్దు వద్దు, కంటిన్యూ చేయండి" సరే విను.....
"(సాంగ్ -2) ఎవ్వరే నువ్వు నాను కదిపావు నీ లోకం లోకి లగావు..........(మ్యూజిక్)" ఈలోపు మన శివ "ఎరా చందు ఈ సాంగ్ ఎంటి నీ ఫీలింగ్స్ కి సింక్ అవ్తున్నట్టు ఉంది..? కొంపతీసి నువ్వు కానీ పడించట్లేదు కదా!!....." అని అన్నాడు. దానికి చందు "వూరుకో రా, అంత సీన్ ఉంటే నేనే వెళ్లి పడతా కదా" అని అన్నాడు, అది విన్న మిగిలిన గ్యాంగ్ "అరేయ్ వద్దురా ప్లీజ్ , నువ్వు అలాంటి stunts వెయ్యకు ప్లీజ్" అంటూ నవ్వుకుంటున్నారు. చందు "రూమ్ కి వెళ్ళాక చెప్తా మీ పని" అని మనసులో అనుకుని ఇంకా అందరితో ఎంజాయ్ చేస్తూ వుంటారు.. ఈలోపు మన సుద్దపుసా సింగింగ్ పెర్ఫార్మెన్స్ ఐపోయింది... చందు కి స్టేజ్ పక్కన ఆ అందమైన అమ్మాయి కనిపిస్తుంది "ట్రెడిషనల్ wear" లో & ఫూల్ టెన్షన్ పడుతూ వుంటుంది, చందు అలా చూస్తూ వుండిపోయాడు...
ఈలోపు మన యాంకర్ "And the next performance is క్లాసికల్ పెర్ఫార్మెన్స్ బై 1/4 స్టూడెంట్, Lets welcome her" ఈలోపు పాప స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తూ, డ్యాన్స్ స్టార్ట్ చేస్తూ వుంటుంది, ఇది చూస్తున మన గ్యాంగ్ అంత "ewwww చందు, అహా చందు మావ ey ey ey" అంటూ గోల చేస్తూ చేస్తూ వుంటారు... కానీ చందు కి మాత్రం అవేం వినిపించట్లేదు, fully concentrated on her dance and expressions..... అలా మళ్ళీ చందు ఆ అమ్మాయి కి ఫిదా అయిపోతాడు... పెర్ఫార్మెన్స్ అవ్వగానే ఆ అమ్మాయి వెనకే చందు వెళ్తూ వుంటాడూ, కొంచెం దూరం వెళ్ళాక చందు "హే ఒకసారి నీతో మాట్లాడాలి", అమ్మాయి "ఏంటో చెప్పు".
చందు "అదే నిన్న ఏవేవో చెప్పావ్ కథ, అవ్వని నీకు కొంచెం ఓవర్ అనిపించట్లేదా....?" అమ్మాయి సీరియస్ లుక్ ఇస్తుంది, చందు "సార్లే జోక్ చేసా కానీ విను, నీ గురించి చెప్పాలి అంటే కవులు కూడా కష్టపడాలి అన్నావ్, కానీ ఏ కష్టం లేకుండా ప్రతిరోజూ 10 కవితలు జీవితాంతం రాసివ్వగలను., నిన్ను చేరాలి అంటే సప్తసాగరాలూ దాటాలి అన్నావ్, సప్తసాగరాలే కాదు ఏడేడు లోకాలన్నీ కూడా దాటి వస్తా.., నువ్వు రోజు మాట్లాడాలి అంటే రాసిపెట్టి వుండాలి అన్నావ్, ఆల్రెడీ నీకు నాకు ఎప్పుడూ రసిపెట్టేసాడు అని అనుకున్న కాబట్టే ఇలా కలుసుకున్నాం.., ఇంకా నువు నాతో కలిసి నడవాలి అంటే రంగు రంగుల బాట ఏర్పడాలి అన్నావ్, నువు నాతో కలిసి నడిచే ప్రతి అడుగు కోసం ఈ భూమి నే పుతోట గా మార్చేస్త..... LOVE YOU, Will u be mine forever..?" ఇదంతా వింటున్న అమ్మాయి సైలెంట్ గా వెలిపోతుంది... అప్పుడు చందు గట్టిగా "ఓయ్, నీ పేరు ఏంటో నాకు తెలియదు... కానీ ఇప్పటినుంచి నువ్వే నా జాన్ ( jaan).....
ఇదంతా పక్కన ఉండి చూస్తున శివ షాక్ తో చందు దగ్గరకి వచ్చి "అరేయ్ చందు నువ్వు ఇంత ఫీల్ తో చెప్తే ఆ అమ్మాయి ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది అంటేనే అర్థం చేసుకో రా దానికి అంతా సీన్ లేదని" అని జోక్ చేస్తూ నవ్వుతాడు.... చందు సీరియస్ లుక్ ఇస్తాడు ఇంకా ఈవెనింగ్ అయిపో అందరు రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకుంటూ వుంటారు....
కానీ చందు కి మాత్రం ఆ అమ్మాయి ఎందుకు సైలెంట్ గా వెళ్ళిపోయింది, ఏం కౌంటర్ కూడా వెయ్యకుండా అని ఆలోచిస్తూ వుంటాడు....
ఇప్పుడు వినాయకుడు "ఏవండీ చంద్రుడు గారు విన్నది చాలు కానీ, ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది అంటారు సైలెంట్ గా.....?
చంద్రుడు "నాకేలా తెలుస్తుంది స్వామి, మీరే చెప్పాలి ఆ ఉమా గాడు ఏదోకటి రాసుంటాడు గా.. అది చదవండి" అని అన్నాడు, "తమరికి అన్ని తెలుసు అంటారు కథ ఆలోచించి నేను మళ్ళీ వచ్చినప్పుడు చెప్పు" అని వినాయకుడు మాయం అయిపోయాడు.....
చంద్రుడు "అరెరే, ఈ వినాయకుడు పెద్ద ప్రశ్న వేసి వెళ్ళిపోయాడు....., (inner feeling of చంద్రుడు :- అహ్ లైట్ లే మనం అలోచించకపోయిన ఎవరొకరూ కామెంట్స్ చేస్తారు కదా ఆన్సర్, అది చెప్పెద్దాం అనుకున్నాడు... )
మీరు కొంచెం కామెంట్ చేసి మన చంద్రుడికి సాహయం చెయ్యగలరా ఫ్రెండ్స్!!!

thank you for reading
Uma
join our family :
Review form: https://forms.gle/rwiEr6m1aPd8SprVA
Note: May be it will continue to next episode... thank you for your support till this minute... imagine chesukuni raayadam naa work... and imagine chesukuntu enjoy chestharani expect chesthunna..
Comment mukhyam.....
Comments