top of page

చందమామ'తో' కధలు - 02

Updated: Jul 31, 2024

STORY - 02


అలా కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజు చంద్రుడు వినాయకుడి రాకకోసం ఆలోచిస్తూ ఉన్నాడు.. ఇంకా ఓర్పు పట్టలేక చంద్రుడు మనసులో “ఈ గణేశుడు ఒకడూ.. హాయిగా ఉన్న నా జీవితంలోకి వచ్చి, ఇప్పుడు ఆగం ఆగం చేశాడు.. ఈసారి రాని, నేనంటే ఏమిటో చూపిస్తా” అని అనుకున్నాడు.. అంతలో అనుకోకుండా వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు.. ఇంకా చంద్రుడు పట్టరాని సంతోషంతో “ స్వామి! మీరేమిటి ఇలా వచ్చారు.. ఇంకా 30 రోజులు అవ్వలేదుగా?” అని అడిగాడు.. ఆ మాటలు విన్న వినాయకుడు “నీతో మాట్లాడి వెళ్ళిన తరువాత నేను తన గురుంచి ఆలోచిస్తూ ఉన్నాను.. తన జీవితాన్ని ఒకసారి వెనక్కి వెళ్ళి చూసి వచ్చా.. చాలా బాగుంది అనిపించింది.. అలాగే నువ్వు కూడా నాగురించే ఆలోచిస్తున్నావ్.. ఒక భక్తుడి కోరిక తీర్చడం నా కర్తవ్యం..” అని అన్నాడు.. ఆ మాటలు విన్న చంద్రుడు “ నేను చాలా ధన్యుడిని స్వామి..” అని చెప్పి ఒంగి ఒంగి నమస్కరిస్తున్నాడు.. అది చూసిన వినాయకుడు “అతి చేయకు భక్తా! నా ముందు నటించావనుకో నడుము ఇరిగిపోగలదు.. ఒళ్ళు దగ్గరపెట్టుకో” అని వెటకరించాడు.. ఆ మాటలు విన్న చంద్రుడు “ అయ్యో స్వామి! నేనా! మీ ముందు నటించడమా!!” అంటూ మళ్ళీ నటిస్తున్నాడు.. “నేను ఇక్కడికి రాక ముందు.. నాగురించి ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్నవ్ గా.. ఏమిటది..” అని వినాయకుడు అడిగాడు.. “అంటే.. అది.. స్వామీ.. మరి.. ఏదో నోటిదులా స్వామీ!” అని సమాధానం ఇచ్చాడు.. దానికి వినాయకుడు ఏదో చెప్తూ ఉండగా.. మళ్ళీ చంద్రుడు “స్వామి! ఇప్పటికే చాలా lag అయ్యింది.. మన ప్రేక్షకులు కొంచెం బోర్ గా ఫీల్ అయ్యి, చదవడం ఆపేయకముందే మన కథని మొదలుపెట్టండి” అని అన్నాడు.. సరే సరే అని వినాయకుడు కథ మొదలుపెట్టడానికి  సింహాసనం మీద కూర్చున్నాడు.. చంద్రుడు “చెప్పు గణేశా! మొన్న మనం చూసిన అమ్మాయి ఎవరు? ఆ వెలుగు కారణం ఏంటి? చెప్పు.. చెప్పు.. చెప్పూ..” అని అడిగాడు.. “రేయ్.. రేయ్.. కొంచెం షుగర్ ఆపుకో భక్త.. తన గురించి చెప్పడానికే వచ్చా.. కాని తనకంటే ముందు నీకోక అబ్బాయి గురుంచి చెప్పాలి” అని వినాయకుడు అన్నాడు.. సరే అని చంద్రుడు వినడానికి సిద్దమయ్యాడు..

అది 2021, కరోనా మహా ప్రళయం వలన ఒక సంవత్సరం లేట్ గా ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యారు.. కొంచెం లేట్ అయిన, వాళ్ళకి కూడా ఫ్రెషర్స్ డే చేయడానికి సిద్దం చేస్తున్నారు.. తెల్లవారితే ప్రోగ్రామ్.. అందరూ మంచి హడావిడిగా ఉన్నారు.. కాని ఆ collegeకి, ఆ ప్రోగ్రామ్ కి  వాళ్ళకి సంబంధం లేనట్టు ఒక గ్యాంగ్ చెట్టు కింద కూర్చుని ఏవో సోది కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.. అంతలో ఒక అబ్బాయి ఒక లెటర్ పట్టుకుని వెళ్ళడం వీళ్ళు గమనించారు.. మంచి లావుగా.. క్లీన్ షేవ్.. షర్ట్ బటన్స్ మొత్తం పెట్టేశాడు.. చేతులు కూడా ఫుల్ హ్యాండ్ బటన్ పెట్టకున్నాడు.. తలకి బాగా నూనె రాసుకుని.. పక్క పాపిడి తీస్కుని.. నుదిటిమీద తిలకం బొట్టు పెట్టుకుని.. మెడలో id కార్డ్ వేసుకుని తన చేతిలో ఉన్న లెటర్ చూసుకుంటూ, ఏదో వెతుకుతూ వెళ్తున్నాడు.. అది గమీనించిన శివ ( చెట్టు కింద కూర్చున్న గ్యాంగ్ లో ఒకడు) ఆ అబ్బాయిని చూసి “ఎవడు ఈ గ్రహాంతరవాసి.. ఇలా ఉన్నాడేంటి.. పాపం దేనికోసమో వెతుకుతున్నాడు.. కొంచెం హెల్ప్ చేద్దాం అని.. రేయ్! సుద్దపూస! ఇటు రా!” అని పిలిచాడు.. వాడు వచ్చి “ మా ఇంటిపేరు నీకేల తెల్సు? నా పేరు తేజ అని కూడా తెల్సా?” అని అమాయకంగ అడిగాడు.. దానికి శివ “కొన్ని అలా తెలసిపోతాయిలే.. ఇంతకీ ఏంటి వెతికేస్తున్నావ్?” అని అడుగుతూ తన చేతిలో ఉన్న పేపర్ తీసుకుని అందులో ఉన్నది చదువుతున్నాడు.. ఇందులో భద్ర మూవీలో హీరోయిన్ చూస్తూ తన గురుంచి రవితేజ వర్ణించిన మాటలు ఉన్నాయి.. “ఏంట్రా! ఇది పట్టుకుని తిరుగుతున్నావ్ అని శివ అడిగాడు.. “అంటే.. మరేమో.. అన్నా.. నిన్న భద్ర సినిమా చూశాను.. అందులో రవితేజ చెప్పిన అమ్మాయి కోసం వెతుకుతున్నా” అని సమాధానం ఇచ్చాడు అమాయకుడు.. ఆ గ్యాంగ్ లో ఇంకోకడు  “వెతికి ఏమి చేస్తావ్ రా!” అని అడిగాడు.. “ప్రేమిస్తా అన్నా!.. ఏదో ఒకమాదిరిగా ఉన్న రవితేజ అన్నకి అంత అంధమైన అమ్మాయి దొరికినప్పుడు.. ఇంత అందంగా ఉన్న నాకు ఎందుకు దొరకదు.. అందుకే ఈ కాలేజీలో ఏమైనా ఉందేమో అని searching..” అని అమాయకంగా చెప్పాడు.. ఆ మాటలు విన్న శివ “ అబ్బో..!!! ఈ పోలికలు ఉన్న అమ్మాయిని నేను ఇందాకే చూసారా.. కాని తనని కలవడం అంతా సులభం కాదు.. కానీ నేను చెప్పింది చేస్తే సులభంగా కలుస్తావ్” అని అన్నాడు.. దానికి అమాయకుడు “నిజమా అన్నా.. నాకు తెల్సు అన్నా.. నాకోసం అలాంటి అమ్మాయి ఉంటుంది అని.. చెప్పన్న ఇప్పుడు ఏమి చేయాలో.. చేసేస్తా.. అమ్మాయి కలిసేస్తా.. తన మనసుని గెలిచేస్తా” అని అన్నాడు.. ఇంకా శివ “ అబ్బో! మంచి confident గా ఉన్నవ్ గా.. సరేలే నేను అడిగినవాటికి సమాధానం చెప్పు  అంటూ తేజ భుజం మీద చేయి వేశాడు.. కొంచెంసేపు వాడితో ఆడుకుంటూ చివరికి ఒక చిన్న సలహాగా “ అప్పుడప్పుడు అద్దంలో ముఖం చూసుకుంటే ఇలాంటి పీడకలలు ( ఇది విన్న తేజ కోపంగా శివ వైపు చూశాడు.. దానిని కవర్ చేయడానికి శివ మళ్ళీ.. ) అదేరా ఇలాంటి మంచి ఆలోచనలు రావు” అని చెప్పాడు.. ఆ మాటలు విన్న అందరూ నవ్వడం మొదలు పెట్టారు.. ఆ నవ్వుని ఆపుకుంటూ చందు ( శివ వాళ్ళ ఫ్రెండ్ ) “హే నవ్వడం ఆపండిరా!” అని అంటూ తేజ నువ్వు వెళ్ళు అని అన్నాడు..

చందు శివతో “మావా! నిజంగానే అలాంటి అమ్మాయిలు ఉంటారా!” అని అడిగాడు.. దానికి బదులుగా శివ “ ఉంటారు మావా.. హను రాఘవపుడి సినిమాలలో..” అన్నాడు.. అది విని మళ్ళీ నవ్వడం మొదలుపెట్టారు.. చందు మాత్రం నవ్వకుండా శివని చూస్తు “నా మీద జోకులు వేశావనుకో జోడిచ్చుకుని కొట్టేస్తాను” అని అన్నాడు.. “సర్లే ఏడవకు.. అలాంటి అమ్మాయిలు నిజజీవితంలో ఉండరు మావా.. ఎక్కువగా ఆలోచించకూ..” అని అన్నాడు.. ఇంకా చందు కాల్ వచ్చిందని పక్కకి వెళ్ళాడు.. అంతలో గాలికి ఒక పేపర్ ఎగిరివచ్చి శివ మీద పడింది.. చందు అప్పుడే అటుగా వస్తున్న ఒక అమ్మాయిని చూశాడు.. ఇక్కడ శివ తనమీద పడిన పేపర్ ని చదువుతున్నాడు.. “తన అందమయిన రెండు కళ్ళు, అప్పుడే వికసించిన కలువలు.. తను కంటి చుట్టూ పెట్టిన కాటుక, సూర్యకిరణాలకి అడ్డుపడుతున్న మబ్బు.. తన నుదిటిన పెట్టిన బొట్టు, చూసేవాళ్ళ మనసుని దోచేయకపోతే నా మీద ఒట్టు.. అందం అనే పదానికి తనే ఆకృతి, ఎప్పటికైన తన ముందు తక్కువే చుట్టూ ఉన్న ప్రకృతి.. ( ఇంకా చిరాకు వచ్చి ఇంత దరిద్రంగా ఉందేంటి అనుకుంటూ శివ చదవడం మానేశాడు..) చందు శివ దగ్గరికి వచ్చి “ మావా! ఇప్పుడే ఒక అమ్మాయిని చూశాను.. కత్తిలా ఉంది.. ఏంటోరా తనని చూస్తుంటే నా ఫీలింగ్స్ ని ఎవరో బయటకి చెప్తున్నట్టు వినిపించింది..” అని అన్నాడు.. ఆ మాటలు విన్న శివ చిరాకుగా మొహం పెట్టి “ఛీ! ఛీ! అవి నీ ఫీలింగ్సా!!!! అంత దరిద్రంగా ఉన్నయేంట్రా..  ఇవే ఇలా ఉన్నాయంటే అమ్మాయి ఇంకెంత దరిద్రంగా ఉంటదొ!! నా మాట విని తనని వదిలేయ్.. రేపు ఏదోక గుంటని చూసి లైన్ వేసుకుందాం” అని అన్నాడు.. చందు మాత్రం పొరా అంటూ అమ్మాయి వెనకాలే వెళ్ళాడు..

అమ్మాయి బెంచ్ మీద కూర్చుని మొబైలు చూసకుంటుంది.. చందు వేళ్లీ “excuse me” అన్నాడు.. మెల్లగా తన కళ్ళని పైకి లేపి చూసింది.. ఆ కళ్ళని చూసిన అబ్బాయికి మాటలు రాలేదు.. ఒళ్ళంత చెమటలు పట్టేసాయి.. అది చూసిన అమ్మాయి “ఏంటి ఏమైనా చెప్పాలా!.. చూడగానే నచ్చేశానా! ప్రపోస్ చేయడానికి వచ్చావా!” అని అడిగింది.. అది విన్న అబ్బాయి “అయ్యబాబోయి! అంతా బాగా ఎలా చెప్పేసారండి.. మీకు నాలాగే అనిపించిందా!” అంటూ తన పక్కన కూర్చున్నాడు.. అమ్మాయి “అంతలేదులేగాని చెప్పు.. నాకు చెప్పడానికి ఏదోకటి బట్టిపట్టి ఉంటావ్ గా.. కళ్ళు ఆకాశంలో నక్షత్రాలు.. కాళ్ళు భూమిలో పాతుకుపోయిన వేర్లు.. చెవులు రాలిపోయిన బంతిపూలు.. అని ఇలాంటి సొల్లు మాటలు ఉంటాయిగా..”అని అంది.. అది విన్న అబ్బాయి షాక్ అయి “ఏంటిప్పుడు.. నిన్ను పడేయలంటే ఇలాంటి సోది కబుర్లు చెప్తే సరిపోతుందా” అని అన్నాడు.. “అసలు సరిపోదు.. నా గురుంచి చెప్పాలి అంటే కవులు కూడా కష్టాలు పడాలి.. నన్ను చేరాలంటే సప్తసాగరాలు దాటాలి.. ఇంకా నేను రోజూ మాట్లాడాలి అంటే రాసిపెట్టి ఉండాలి.. ఇంకా నేను నీతో కలిసి నడవాలి అంటే రంగురంగుల బాట ఏర్పడాలి.. ఎందుకంటే నేను అందరీలాంటి అమ్మాయిని కాదు.. కాబట్టి నన్ను పొందేవాడు కూడా అందరిలా కాకుండా, కొంచెం డిఫరెంట్ గా ఉండాలి.. నీకు అవేమీ లేవు అని నాకు అర్ధమయింది.. ఇంకా నువ్వు వెళ్ళవచ్చు” అని చెప్పింది..ఆ మాటలు విన్న అబ్బాయి వామ్మో వామ్మో అని మెల్లగా అనుకుంటూ అక్కడినుండి లేచి వెళ్ళాడు.. అప్పుడు ఇదంతా విన్న శివ అమ్మాయి దగ్గరకి వచ్చి “మేడమ్! ఇప్పటివరకి మీ మాటలు విన్న తరువాత మిమ్మల్ని ఒకటి అడగాలి అనిపిస్తుంది.. ఆడగమంటారా” అని చాలా వినయంగా అడిగాడు.. అమ్మాయి “is it? అడుగు అడుగు” అని చాలా excite అయ్యింది.. వెంటనే శివ వినయాన్ని వదిలి “ఒసేయ్! నీ బ్రైన్ ఏమైనా బాగ్ లో పెట్టుకుని తిరుగుతున్నావా? లేకపోతే ఏంటి ఆ కోరికలు.. నువ్వో పెద్ద miss universe లాగ కటింగ్ ఇస్తున్నావ్! గుర్తుపెట్టుకో మా ఫ్రెండ్ కాబట్టి నీతో మాట్లాడటానికి ట్రై చేశాడు.. అదే నేనయితేనా, నాకున్న అందానికి నువ్వు సెట్ అవ్వవు అని ముందే గ్రహించి వదిలేసేవాడిని” అని అన్నాడు.. ఆ మాటలు విని కోపంగా “ఛీ పోరా వెధవ” అని అంది..

శివ ఇంకా thnx అని అమ్మాయికి చెప్పి ఇంకా చందు దగ్గరకి వచ్చి “ ఏంటి మావా! అది అంతా పెద్ద జర్క్ ఇచ్చింది.. పిచ్చి బాగా ఎక్కువయింది తనకి.. నా మాట విను.. ఇప్పటికీ మించిపోయింది లేదు.. వదిలేయ్” అని చెప్పాడు.. అప్పుడు చందు “ మావ! అమ్మాయిల విషయంలో మా powerstar ని ఫాలో అయ్యిపోవాలి రా..” అని అన్నాడు.. ఇంకా చందు “ మావా! కొంచెం విడమర్చి చెప్పవా! అసలే పెద్దాయన పేరు వాడేశావ్.. ఏమయినా తేడా వస్తే మన ఇద్దరి g (గుండెలు) పగులతాయి..” అన్నాడు.. ఇంకా చందు  “ అమ్మాయిల గురుంచి మా పవన్ అన్న చెప్పిన పవనోపదేశాలు నీకు కూడా చెప్తా విను.. తొలిప్రేమ ద్వారా నిజమయిన ప్రేమని నిరూపించుకోవాలి అంటే  ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడానికి కూడా వెనకడకూడదని, అలాగే  గబ్బర్ సింగ్ లో ప్రతి అమ్మాయి ఎప్పుడొకప్పుడు అబ్బాయికి పడాల్సిందేనని.. పడిన ప్రతి అమ్మాయి గురుంచి బద్రిలో తనని పొందటానికి గోడవపడిన తప్పులేదని, తరువాత కొంచెం తప్పు తెలుసుకుని, గుడుంబా శంకర్ లో ప్రేమించిన అమ్మాయికోసం గొడవలు చేయాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న మోసాలు చేస్తే చాలని, చివరిగా ఖుషీలో అన్నిటిని దాటి అమ్మాయిని సొంతం చేసుకుంటే ఆడవారి మాటలకి అర్ధాలు వేరని.. ఇలా కొన్ని వందల సార్లు చెప్పాడు రా.. కాబట్టి ఈసారికి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ అమ్మాయిని పడేసేద్దాం.. పదా” అని అన్నాడు.. ఆ మాటలు విన్న శివ “ పోయింది.. వీడికి బుర్ర మొత్తం పోయింది.. నువ్వు ఏదైనా చేయి, కాని అజ్ఞాతవాసిలో ఆడియన్స్ కి అర్ధం కాని పవన్ లాగా మారకుండా ఉంటే చాలు..” అని కొంచెం గట్టిగానే అన్నాడు.. ఆ మాటలు విన్న ఒకడు కోపంతో “ఎవడ్రా ఇక్కడ అజ్ఞాతవాసి గురుంచి మాట్లాడింది?” అని బాగ్ నుండి కత్తి తీశాడు.. అది చూసిన శివ “అమ్మో నాకేం తెలియదు” అని అక్కడినుండి వెళ్ళిపోయాడు..

ఇలా ఒక ఫ్లోలో ఉన్న వినాయకుడిని ఆపిన చంద్రుడు “స్వామి! అసలు మన కథేంటి? మీరు చెప్తున్న కథేంటి? అమ్మాయి గురుంచి అడిగితే ఎవడో అబ్బాయి అని.. ఇప్పుడు ఇంకేదో చెప్తున్నారు.. మీరే చెప్తారుగా సమయం చాలా విలువయినది అని... కాబట్టి మన కథని చదివేవాళ్ళ సమయం కూడా చాలా విలువైనదిగా భావించండి.. వాళ్ళ లైఫ్ నుండి ఒక 10 నిమిషాలు కేటాయించి మన కథలని చదువతున్నారు.. మీరు ఇలా ఫుల్ lag చేస్తూ ఉంటే వాళ్ళకి చిరాకు వస్తది.. కాబట్టి ఇక్కడితో ఆపేయడం బెట్టర్.. ఇంకా కంటిన్యూ చేస్తే మనల్ని తిట్టుకుంటారు..” అని చిరాకు పడ్డాడు.. ఇంకా వినాయకుడు “ నా చేతిలో ఏం ఉంది.. (కొంచెం చిరాకు పడుతూ) నాతో ఈ మాటలు చెప్పిస్తున్న ఆ ఉమా గాడు ఇంత స్లోగా రాస్తున్నాడు.. సర్లే అయ్యిందేదో అయ్యిపోయింది.. నేను తరువాత చెప్పబోయేది చాలా బాగా రాశాడు.. చెప్తా విను.. దా కూర్చో.. ” అని అన్నాడు.. ఇంకా చంద్రుడు “ బాబోయ్! ఇంకా ఈ రోజు నావల్ల అవ్వదు.. వచ్చే వారం వింటాను” అని చెప్పి మాయమయ్యిపోయాడు.. అది చూసిన వినాయకుడు “అదేంటి ప్రతిసారీ నేను మాయం అవ్వాలిగా.. కొత్తగా చంద్రుడు మాయమయ్యిపోయాడే!!” అని అనుకున్నాడు.. ఇంకా తను కూడా కైలాసానికి వెళ్తూ “ ఏమయ్యా ఉమా! నీవల్ల నన్ను తిట్టుకుంటున్నారయ్యా.. నీ తొక్కలో elevations కోసం ఇంత laag తీసుకుంటే ఎలా? ఇంత జరిగిన నిన్ను ఎందుకు క్షమించి ఈ కధ చెప్తున్నానో తెల్సా?? కేవలం దీని తరువాత జరగబోయేది నాకు నచ్చింది కాబట్టి.... సర్లే నా మాటలకి బాధ పడకు.. నేనే నిన్ను క్షమించగలిగాను ఇంకా మన కథని చదివేవాళ్ళు కూడా క్షమించలేరంటావా!!..” అంటూ వెళ్ళిపోయాడు..




thank you for reading

    Uma



join our family :



Note: May be it will continue to next episode... thank you for your support till this minute... imagine chesukuni raayadam naa work... and imagine chesukuntu enjoy chestharani expect chesthunna..



Comments


Post: Blog2 Post
bottom of page