top of page

చందమామ'తో' కధలు - 01

Updated: Jul 31, 2024

STORY - 01


ఆరోజు వినాయకచవితి.. కాబట్టి అందరూ ప్రేమగా ప్రసాదంగా పెట్టిన లడ్డూలని తినడానికి వినాయకుడు మూషికాన్ని వాహనంగా చేసుకుని ప్రయాణిస్తున్నాడు.. భక్తితో ప్రసాదం సమర్పించిన ప్రతి ఒక్కరి దగ్గరకి వెళ్ళి ప్రేమతో ఆరగించడం మొదలుపెట్టాడు... ఇంకా అంతా అయ్యిపోయాక ఈ సారి ప్రసాదాలు మంచి రుచికరంగా ఉన్నాయి ముషికా అంటూ తన మీద ఎక్కాడు.. వెంటనే “స్వామి.. ఈ సంవత్సరం మీరు చాలా ఎక్కువగా ప్రసాదాలని తిన్నట్టున్నారు.. చాలా బరువుగా ఉన్నారు” అని మూషిక అన్నాడు.. ఇంకా అలా సరదాగ మాట్లాడుకుంటూ కైలాసానికి వెళ్ళే మార్గాన్ని అనుసరించారు.. దారిలో ముషికం అదుపుతప్పి పడిపోయింది.. వినాయకుడు కూడా కింద పడిపోయాడు.. “ఏంటి మూషికా! ఏమైంది? చూసుకుని జాగ్రత్తగా వెళ్ళు” అంటూ లేచి బట్టలకి అంటిన మట్టిని తుడుచుకున్నాడు.. అంతలో గట్టిగా నవ్వులు వినిపించాయి.. ఎవరో అని చుట్టూ చూశాడు.. ఆకాశంలోనుండి ఈ మొత్తం చూసిన చందమామ అలా నవ్వుతూ ఉండటం వినాయకుడు చూశాడు.. కోపంగా “ నవ్వు ఆపు “ అని అన్నాడు.. కాని చందమామ వినకుండా నవ్వుతూనే ఉంది.. కోపం వచ్చిన వినాయకుడు తన చేతిలో ఉన్న ఆయుధాన్ని చంద్రుడి మీదకి విసిరాడు.. అది తగిలిన చందమామ తన కాంతిని కోల్పోవడం మొదలయ్యింది.. ముందు తన కాంతి కోసం వినాయకుడిని ప్రాధేయపడింది.. వినాయకుడు పట్టించుకోలేదు..

ఇంకా కోపం వచ్చిన చందమామ “ ఓ వినాయకా! నా గురుంచి నీకు తెలియదు.. నేను లేకపోతే రాత్రుళ్లు మనుషులు అంధకారంలోకి వెళ్లిపోతారు.. కలువపూలు వికసించడం మానేస్తాయి.. వసంతంలో కోయిలలు కూయడం మానేస్తాయి..” అని అరిచింది.. ఆ మాటలు విన్న వినాయకుడు “ ఓ చంద్రమా! అదా నీ ధైర్యం సరే అయితే ఒక్కసారి నువ్వు మాయం అయ్యిపో..” అని అన్నాడు.. ఆ మాటలు విన్న మూషికం “ప్రభూ! కొంచెం ఆలోచించండి.. చంద్రుడు రాత్రి సృష్టికి జీవం పోయాల్సినవాడు.. ఇప్పుడు తనని అంతర్ధానం అయ్యిపోమంటే ఇప్పుడెలా?” అని అన్నాడు.. అప్పుడు వినాయకుడు “ఓ మూషికమా! నువ్వు కొంచెం ఓర్పుతో ఉండు” అని అన్నాడు.. ఇంకా కోపంతో చంద్రుడు మాయం అయ్యిపోయాడు.. అసలే రాత్రి సమయం అవ్వడంతో మొత్తం చీకటి అయ్యిపోయింది.. మిగిలిన దేవుళ్ళు అందరూ కంగారూపడిపోయారు.. చంద్రుడికి ఏమైంది.. ఎందుకిలా వెళ్ళిపోయాడు అనుకున్నారు.. వెంటనే ఇంద్రుడితో కలిసి అందరూ పరమశివుడిని దగ్గరకి వెళ్ళాలి అనుకుని ప్రయాణం మొదలుపెట్టారు..

భూమి మీద ఉన్న  ప్రజలంతా ఒక్కసారిగా భయంతో ఏంటి వింత మార్పు అని ఆంధోళన పడ్డారు.. అది చూసిన చంద్రుడు “ చూశావా వినాయకా! నీ పిచ్చి చేష్టల వలన ఇప్పుడు సమస్త సృష్టిలో ఆందోళన మొదలయ్యింది.. ఇంకా వారి జీవితాలు రాత్రులు ఇలా చీకటిలో ఉండాల్సిందే” అంటూ విర్రవీగుతూ నవ్వుతున్నాడు.. కాని వినాయకుడు నవ్వుతున్నాడు.. “ఏంటి బాలకా! నవ్వుతున్నావ్.. నీ చిన్నపిల్ల చేష్టలకి ఇప్పుడు మానవాలికి కొత్త ఉపద్రవం వచ్చింది” అని అంటు చంద్రుడు నవ్వుతున్నాడు.. వినాయకుడు మళ్ళీ నవ్వుతూ అటు చూడు అంటూ సైగ చేశాడు.. దూరంగా ఒక వెలుగు కనిపించాడు.. ఆ వెలుగు చూసి “నువ్వు మాయలు చేయకూడదు.. ఇలా రాత్రుళ్లు ప్రకాశించే శక్తి నాకు మాత్రమే ఉంది” అని అన్నాడు.. ఆ మాటలు విన్న మూషికం “అది మా స్వామి మాయ కాదు... అది భూలోకం.. జంబూద్వీపం.. భరతఖండం...” అలా చూడు అని అన్నాడు..

అది భారతదేశం.. ఆంధ్రప్రదేశ్.. పశ్చిమ గోదావరి జిల్లా.. భీమవరం.. SRKR Engineering college.. Annaul day… అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.. ఆడుతున్నారు.. పాడుతున్నారు.. అందరు గుంపుగా ఉన్నారు.. గుంపు మధ్యలో నుండి ఒక చిన్న వెలుగు వచ్చింది.. ఆ వెలుగే ఇంతటి ప్రకాశానికి కారణం.. వాళ్ళు  ఇంకొంచెం జూమ్ చేసి చూశారు.. అందమయిన అమ్మాయి.. చీకటిలోకూడ వెలిగిపోతుంది.. తన చుట్టూ ఉన్న చీకటినే అందమయిన చీరల మలుచుకుని, స్వయంగా మెరిసిపోతుంది.. తన చిరునవ్వు  నుండి వచ్చే కాంతి, చంద్రకాంతిని మించి ఉంది.. తన చూపుకి పక్కనే ఉన్న కలువలు వికసించాయి.. పాటలలా ఉన్న తన మాటలని విన్న కోకిల పాడటం మొదలుపెట్టినది..” ఇదంతా చూసిన చంద్రుడు తను నవ్వడం మానేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు..

పరమశివుడి దగ్గరకి బయలుదేరిన దేవుళ్ళు అందరూ కైలాసాన్ని చేరుకున్నారు.. వాళ్ళ రాకని చూసిన శివుడు “ ఏంటి ఇలా వచ్చారు?” అని అడిగారు.. ఇంకా ఇంద్రుడు వినాయకుడికి చంద్రుడుకి మధ్య జరుగుతున్న గొడవ, మానవాలి ముందు ఉన్న కొత్త సమస్యని చెప్పి, మీరే ఇప్పుడు ఏదోకటి చేయాలని విన్నవించారు.. అదంతా విన్న శివుడు నవ్వుతూ “గణేషుడు ఏమి చేసిన అది సృష్టికార్యమే” అని అన్నాడు.. దానికి యమధర్మ రాజు “అది నిజమే లీలమయా.. మీ కుమారుడు కూడా మీలాగే ఉన్నారు.. కాని మీరు గౌరవంతో మీ శిరస్సున స్థానం ఇచ్చిన చంద్రుడితో ఇలా ఉండటం న్యాయం కాదేమో కరుణామాయ” అని అన్నాడు.. ఆ మాటలు విన్న శివుడు “నిజమేనయ్యా! నేను అడిగిన వాళ్ళందరికీ వరాలు ఇచ్చుకుంటా పోతున్న.. కాని అది అలుసుగా తీసుకుని గర్వంతో విర్రవీగుతున్నారు.. మరి ఈ తండ్రి చేసిన తప్పులని సరిదిద్దాల్సినది నా తనయుడేగ, మరి అలాంటప్పుడు అక్కడ జరిగేది న్యాయమెగా యమధర్మ రాజా! ... ఇంకా అక్కడ జరిగే చమత్కారాన్ని చూడండి అని అన్నాడు..” అది విన్న వాళ్ళంతా నవ్వుతూ, జరిగేది చూస్తున్నారు..

ఇప్పటివరకి ఆ వెలుగు చూస్తున్న చంద్రుడికి తన గర్వం అణిగిపోయింది.. “నన్ను క్షమించు వినాయకా.. నా తప్పు తెలుసుకున్నా.. నేను కేవలం కార్య నిర్వాహకున్ని మాత్రమే.. కార్య నిర్ధేశకులు మీరు.. మా మీద దయ ఉంచి, నా ప్రకాశాన్ని నాకు తిరగి ఇచ్చేయమని" ప్రాధేయపడుతున్నాడు.. ఆ మాటలు విన్న వినాయకుడు “ చూశావా మూషికా.. ఈ ప్రవర్తనలో మార్పు.. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే నానుడి నిజం చేశాడయ్యా ఈ చంద్రుడు..” అని అన్నాడు.. ఇంకా దేవుళ్ళు అందరూ కలిసి అడిగేసరికి వినాయకుడు ఒప్పుకున్నాడు.. వినాయకుడు “నువు కోల్పోయిన శక్తిని పూర్తిగా తిరిగి ఇచ్చే శక్తి నాకు లేడు కాని సగం ఇవ్వగలను.. నువ్వు ఇంతకు ముందులా ప్రతిరోజూ నిండుగా ఉండవు.. రోజు రోజుకి నువ్వు నీ కాంతిని కొంచెం కొంచెంగా కోల్పోతూ, చివరికి చీకటిలో కలిసిపోతావ్ దానినే అందరూ “అమావాస్య” అంటారు.. అలాగే ఆ తరువాత మెల్లగా మెల్లగా నీ కాంతిని తిరిగి పొందుతూ ఒకరోజు పూర్తిగా ప్రకాశిస్తావ్, దానినే అందరూ “పౌర్ణమి” అని అంటారు..” అని చెప్పాడు.. ఆ మాటలు విన్న దేవతలందరు సంతోషంతో వెళ్లిపోయారు..

కాని చంద్రుడు మాత్రం, “గణేశా! ఇన్ని రోజులు వెలుగులో ఉన్న నాకు ఇలా ఒకరోజు పూర్తిగా చీకటిలో ఉండాలంటే భయంగా ఉంటుంది.. నీ భక్తుడిగా నీకు చెప్పుకుంటున్న నా సమస్యని నువ్వే తీర్చు” అని అన్నాడు.. అలాగే ఇంకో చిన్న విన్నపం “ఇందాక మనం చూసిన అమ్మాయి ఎవరు? తనకి ఆ ప్రకాశం ఎలా వచ్చింది?” అనే ఈ సందేహాలని నువ్వే తీర్చాలి” అని అడిగాడు.. దానికి బదులుగా వినాయకుడు “సరే! నా భక్తులకి కోరికలు తీర్చడం నా కర్తవ్యం.. కాబట్టి నీకోక వరం ఇస్తా.. ప్రతి అమావాస్యకి నేను నీతో ఉంటా.. అలా వచ్చినప్పుడు నీకు నేను ఈ కాల వ్యవధిలో చూసిన కొన్ని అద్భుతమయిన మనుషుల గురుంచి కధగా చెప్తా..” అని అన్నాడు.. ఇంకా చంద్రుడి మనసులో ఏదో కలవరం ఉంది.. అది గమనించిన వినాయకుడు “నువ్వు సంశయం చెందకు భక్తా! మొదటిగా నువ్వు అడిగిన అమ్మాయి గురించే చెప్తా” అని అన్నాడు.. ఆ మాటలు విన్న చంద్రుడు సంతోషంగా “ధన్యుడిని స్వామి! మళ్ళీ మీరెప్పుడు ధర్శనమిస్తారు” అని అడిగాడు.. దానికి వినాయకుడు “భక్తా! ఈ రోజు నీకు మొదటి అమావాస్య పూర్తయ్యింది.. మళ్ళీ తిరిగి 30 రోజుల తరువాత అమావాస్య వస్తుంది.. ఆ రోజు వచ్చి మన కాలక్షేపం కోసం నీకు తన గురుంచి చెప్తా..” చెప్తా అని కైలాసానికి పయనమయ్యాడు.. చంద్రుడు తన కోల్పోయిన శక్తి గురుంచి బాధపడటం మర్చిపోయి, మళ్ళీ అమావాస్య ఎప్పుడు వస్తుందో  అని ఆనందంగా ఆశతో ఎదురుచూస్తున్నాడు..




thank you for reading

    Uma



join our family :



Note: May be it will continue to next episode... thank you for your support till this minute... imagine chesukuni raayadam naa work... and imagine chesukuntu enjoy chestharani expect chesthunna..



Comments


Post: Blog2 Post
bottom of page