top of page

My Memories With Mine - 02

Updated: Oct 18, 2023

FRIENDS:-


.....................() నేను ఇలా నీ గురుంచి నన్ను నేను మర్చిపోయి ఆలోచిస్తుంటే, నా ఫ్రెండ్స్ మాత్రం నీ ఆలోచనలలో పడి నేను ఏమయిపోతానో అని వాళ్ళ గురుంచి కూడా ఆలోచించకుండా నన్ను నీ ఆలోచనలనుండి బయటకి తీస్కురావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. మనఇద్దరికీ set అవ్వదు వదిలేయమని, ఇలా చాలా చెప్తున్నారు. నేను కూడా సరే అని చెప్పా కాని వారికి మాత్రం ఏమి తెల్సు, నిన్ను మరచిపోవడం కష్టం అని.. నేను ఎన్ని చెప్పిన నా లైఫ్ బాగుండాలి అని ప్రతిసారి నన్ను convince చేయడానికే చాలా try చేస్తున్నారు. అందుకే ఇంకా నీ విషయం లో ఎవరిని involve చేయకూడదు అని decide అయ్యా..

వాళ్ళ దగ్గర నీ మీద ఉన్న ప్రేమని నా మాటల్లో దాచగలిగిన కాని నా కళ్ళలో చూపించకుండా ఉండలేకపోయా.. వాళ్ళు ప్రతిసారీ అడిగే మాట ఒకటే.. నేను ఎందుకు ఇంతలా నీ విషయం లో serious గా ఉంటున్నానని.. నీ మీద నాకు ఉన్న ప్రేమని వాళ్ళకి ఎలా చెప్పగలను..

నా లోకం నువ్వని..

నా చిరునవ్వుకి కారణం నువ్వని..

మౌనంగా ఉన్న మనసులో అలజడి నువ్వని

నా మౌనం వెనుక దాగిఉన్న మాట నువ్వని..

నా ప్రతి అడుగుకి తోడు నువ్వని..

నా ప్రేమకి రూపం నువ్వని..

ఈ విషయం వాళ్ళకి చెప్పిన అర్ధంచేసుకుంటారంటారా!! నీతో చెప్పే అవకాశం నాకు ఇవ్వగలవా!!!

నాకు నీతోనే ఉండాలని ఉంది... నా కష్టం, సుఖం అన్ని నీతో పంచుకోవాలని ఉంది... నా కోపం అయిన ప్రేమ అయిన నీ మీదే చూపించాలని ఉంది.. ఎలాంటి పరిస్థితిలో అయిన నా పక్కన నువ్వు ఉండాలని ఉంది.. ఎప్పటికీ నాతోనే ఉండిపోతావ అని అడగాలని ఉంది.

అయిన నాకు అర్ధంకాని విషయం ఏమిటంటే, నిన్ను ప్రేమిస్తే నేను తర్వాత కచ్చితం గా బాధ పడతానేమో అని వాళ్ళు బాధపడుతున్నారు. కాని వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే.. నువ్వు సంతోషం గా ఉంటానంటే, నేను ప్రతిరోజు ఈ కన్నీటితో యుద్ధం చేయటానికి సిద్ధం అని!!

నేను నవ్వుతున్న ప్రతిసారీ నా friends అడుగుతుంటారు.. ఏరా తనను మర్చిపోయి happy గ ఉన్నావా అని... కానీ వాళ్ళకి తెలియదేమో కనిపించే ప్రతి నవ్వు వెనుక,

చెప్పలేని నిజాలు.. ఆగిపోయిన మాటలు.. దాచుకున్న కన్నీళ్ళు... విరిగిపోయిన మనసులు... నలిగిపోతున్న ఆలోచనలు.. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయని...

ప్రేమ పుట్టడానికి కారణాలు ఉండవు కాని అదే ప్రేమ చెప్పలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు నీతో చెప్పలేకపోవడానికి నా friends ఏమయినా కారణమా?? లేక నా లైఫ్ ఇలా ఉండటానికి వాళ్ళే నాకున్న బలమా?? ఇలాంటి ప్రశ్నలతో confusion లో ఉన్న నేను realise అయ్యింది ఒకటే.. నువ్వొక అందని అంధమయిన చందమామ అని ..............()



thank you for reading

Uma




About next part

  • 0%interested

  • 0%not interested


Note: continuous to next part, if you interested login to this page..


Bình luận


Post: Blog2 Post
bottom of page