top of page

అమ్మాయి & అబ్బాయి - 12

AA - 12

    THE END :

continued from previous AA - 11

రూమ్ కి వచ్చి, తరువాత రోజు ఇంకా  ఇదంతా అమ్మతో చెప్పుకుందామని వెంటనే lugguage సర్దుకుని start అయ్యాడు.. వెళ్తూ collegeలో అన్నీ చూసుకుంటూ, mutual friemd కి థాంక్స్ చెప్పి, అమ్మాయిని చూసి, ఇంకా ఇంటికి వెళ్ళాడు.. అబ్బాయి రావడం చూసిన అమ్మ ‘ ఏంట్రా sudden గా వచ్చావ్? అంతా బాగానే ఉందా?” అని అడిగింది.. అబ్బాయి మాత్రం ఏమి ఆలోచించకుండా బాగ్ hallలో పెట్టి వేరే కాల్ వస్తే బయటకి వెళ్ళాడు.. వచ్చేసరికి అమ్మ hallలో కూర్చుని ఉంది.. బాగ్ లో బట్టలు అన్నీ తన roomలో సర్దేసి ఉన్నాయి.. అమ్మ ముందు రెండు covers ఉన్నాయి.. అమ్మ కోపంగా “ఎందుకురా చెప్పలేదు ఇప్పటివరకు?” అని అడిగింది.. అబ్బాయి ఇంకా  అమ్మ పెళ్లి కార్డ్ చూసిందేమో, ఇంకా చెప్పేద్దాం అనుకుని, అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని “ అమ్మ ఈ విషయం ఎప్పటినుండో నీకు చెప్పాలి అనుకున్న కాని ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయా....” అని చెప్తుంటే మధ్యలో అమ్మ “ అదేంట్రా job నిన్నేగా వచ్చింది.. ఎప్పటినుండో చెప్పడం ఏంటి?” అడిగింది.. ఇంకా అబ్బాయికి అమ్మ pellicard చూడలేదు అని అర్ధమయ్యింది.. ఇంకా మెల్లగా లేస్తూ “అదే చెప్తాం అనుకున్న.. కాని బయటకి వెళ్ళా, ఇంకా వచ్చేలోపు నువ్వే చూసేశావ్” కుర్చీలో కూర్చున్నాడు.. “ చాలా  సంతోషంగా ఉంది నాన్న! ఇంకా మన కష్టాలు అన్నీ పోయినట్టే... మీ నాన్నే ఉండి ఉంటే ఇప్పుడు చాలా సంతోషపడేవారు..” అని కొంచెం emotional అయ్యింది.. ఇంకా అబ్బాయి అమ్మని ఓదారుస్తూ ఒడిలో పడుకోబెట్టుకుని తల మీద చేయి వేసి నిమురుతున్నాడు.... మెల్లగా అమ్మ “ ఇన్ని రోజులు చిన్న భయం ఉండేది రా... అందరిలా నువ్వు కూడా ఎక్కడ ప్రేమ ప్రేమ అని జీవితం నాశనం చేసుకుంటావని.. కాని నువ్వు చదువుకుని మంచి జాబ్ తెచ్చుకున్నావ్.. ఈ ప్రేమజోలికి మాత్రం పోలేదు” అని అంది.. ఎలాగయిన తన బాధ చెప్పాలి అనుకున్న అబ్బాయికి ఆ మాటలు విన్న వెంటనే తల మీద చేయి తీసేసి లేచి table మీద ఉన్న covers అన్నీ తీసి bedroom లోకి వెళ్ళిపోయాడు.. కొన్ని రోజులు అబ్బాయి చాలా dull గానే ఉన్నాడు.. అమ్మ కూడా అడగడానికి చాలా ట్రై చేసింది కాని అబ్బాయి చెప్పలేదు.. ఇంకా night అందరూ పడుకున్నారు..

తెల్లవారింది.. అమ్మ లేచి fresh అయ్యి, tiffin రెఢీ చేసి పెట్టింది.. టైమ్ 10 అవుతున్న అబ్బాయి బయటకి రాలేదు.. తలుపులు కొడుతున్న తీయడం లేదు.. బయటకెళ్ళి కిటికీ నుండి చూసి గట్టిగా అరిచింది.. అందరూ వచ్చి చూసి తలుపులు పగలగొట్టి చూశారు.. అబ్బాయి ఉరి వేసుకి ceiling కి వేలాడుతూ కనిపించాడు.. అబ్బాయిని కిందకి దింపారు కాని అప్పటికే తన ప్రాణాలు పోగొట్టుకుని ఉన్నాడు... అమ్మ బోరున అబ్బాయి body మీద పడి ఏడుస్తుంది..అందరూ అబ్బాయి గురుంచి “ మంచి జాబ్ వచ్చింది.. లైఫ్ set అనుకునే టైమ్ లో ఇలా అయ్యింది” అని బాధపడుతున్నారు..  ఈ విషయం తెల్సి వాళ్ళ friends అందరూ వచ్చారు.. అమ్మని ఓదారుస్తూ జరగాల్సిన కార్యక్రమాల్ని పూర్తి చేశారు.. ఇంకా అందరూ వెళ్లిపోయారు.. కొన్ని రోజుల తరువాత  roommate and mutual friend  అమ్మ దగ్గరికి వచ్చారు.. అసలు ఏమయింది అని అడిగారు.. అప్పుడు అమ్మ ఒక letter తీసి ఇచ్చింది.. ఏంటిది? అని అడుగుతూ mutual friend  లెటర్ ఓపెన్ చేసింది.. ఇది వాడి roomలో దొరికింది అని అమ్మ చెప్పింది.. అందులో ఇలా ఉంది..

అమ్మా!

చిన్నప్పటినుండి నన్ను చాలా ప్రేమగా చూసకున్నావ్.. నాన్న లేడు అనే ఆలోచన కూడా నాకు రాకుండా చూసుకున్నావ్.. నన్ను ఏ క్షణంలో కూడా ఒంటరిగా వదలలేదు కాని ఇప్పుడు నేను నిన్ను వదిలేసి వెళ్లాల్సి వస్తుంది.. ఏదో చేద్దాం, సాదిద్దాం అని డిగ్రీలో జాయిన్ అయ్యాను.. అప్పుడు పరిచయం అయ్యింది అమ్మాయి.. తనపై నేను పెంచుకున్న ప్రేమ ఎంతంటే, 20 సంవత్సరాలు నువ్వు నా మీద చూపిన ప్రేమని మర్చిపోయెంత.. తను కూడా నీలాగే, సిరిసంపదలకి కాకుండా మనసునుండి వచ్చే చిరునవ్వుకి వాల్యూ ఇస్తది.. కాని నా ప్రేమలో ఏమి లోపము ఉందో తెలియదు, తనని దక్కించుకోలేకపోయాను.. తొమ్మిదీనెలలు ఊహ తెలియకపోయినా నీగర్భంలో ఉండి ఊపిరి పీల్చుకుని బ్రతికా కాని తను నాకు wedding card ఇచ్చినప్పటినుండి నువ్విచ్చిన ఊపిరి కూడా చాలా కష్టంగా  పిలుస్తున్నా.. తన గురుంచి వచ్చే ప్రతి చిన్న ఆలోచన, నన్ను ఒక్క క్షణం కుదురుగా ఉండనివ్వడం లేదు.. నేను ఒంటరిగా మిగిలిపోతా అనుకున్న ప్రతిసారి తన జ్ఞాపకాలు నాతో తోడుగా నిలబడినట్టు అనిపించింది కానీ చివరికి అవే మిగులుతాయి అని తెలియలేదు.. మనం బ్రతకడానికి ఎన్ని దారులున్న, మనల్ని నడిపించడానిక తోడు లేనప్పుడు ఏ దారి అయిన ఏడారిలా కనిపిస్తుందని తను నా నుండి దూరమయిన ఈ కొద్ది రోజులలోనే తెలిసింది.... తను లేకుండా నా ఆనందాన్ని వెతుక్కోవడం అంటే, నిశీధిలో నీడని వెతుక్కొవడంతో సమానం అని అర్దమయ్యింది.. కొన్ని రోజులుగా మా మధ్య కమ్యూనికేషన్ కూడా సరిగ్గా ఉండటం లేదు.

నిజానికి ఈ పని తను నన్ను వద్దు అన్నపుడే చేద్దాం అనుకున్న కాని.. అందరూ నన్ను ఒక failure లా చూడడం చూసి నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు.. అదే ఇప్పుడయితే నువ్వు గర్వంగా చెప్పు “నా కొడుకు failure కాదు.. తన అనుకున్న job achieve చేశాడు కాని కలిసి రాని  కాలం వాడిని నా  నుండి దూరం చేసింది” అని. నీతో ఇవ్వన్నీ చెప్పుకుందాం అనుకున్న కాని ఇందాక నీ మాటలు విన్నాక “ నీ happiness నా వల్ల, నా కళ్ల ముందు పోకూడదు అనిపించింది” అందుకే చెప్పలేదు.. కాని ఇంత బాధని భరించడం నా వల్ల కావడంలేదు.. success అయిన, fail అయిన ప్రతి ప్రేమ కూడా ఒక జ్ఞాపకమే, కాని చిన్న తేడా ఏంటంటే success అయితే ప్రేమించినవారు మనతో ఉంటారు.. fail అయితే వారి జ్ఞాపకాలు మనతో ఉంటాయి.. కాని ఈ రెండింటిని దాటినవారు నాలా ఇలా శ్మశాననికి వెళ్తారు..  చివరిగా ఒక్క మాట.. నా మహారాణి కట్టిన శిధిలమయిన చీకటి కోటలో కొన్ని రోజులుగా కుమిలిపోతున్న మహారాజుని నేను, ఇంకా ఈ బాధని అనుభవించడం నా వల్ల కావడం లేదు అందుకే నీ నుండి, నా మహారాణి ఆలోచనాలనుండి శాశ్వతంగా విముక్తి కోసం ఇలా చేస్తున్నా.., నన్ను క్షమించు.. నా తర్వత నాకంటే బాగా చూసుకునే వ్యక్తి ఒకరు వస్తారు.. వాళ్ళని మాత్రం వదులుకోకు.. వాళ్ళు నాలా మధ్యలో నిన్ను వదిలేయరు.. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం నాన్న కోసం ని కుటుంబాన్ని వదిలేసుకున్నావ్.. నాకు రెండు సంవత్సరాల వయస్సులో నువ్వు నమ్మి వచ్చిన నాన్న నిన్ను వదిలేసిన, నాకోసం బ్రతుకుతూ వచ్చావ్.. ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాల తరువాత నేను కూడా నిన్ను వదిలేసి వెళ్తూన్నందుకు భాదగా ఉంది.. కాని నా lifeలో నేను చూసిన strong lady నువ్వే అమ్మా.. miss you so much..

నన్ను క్షమిస్తావని ఆశిస్తూ..

మీ అబ్బాయి..

ఇదంతా చదివిన ఇద్దరికీ ఏమి చేయాలో తెలియడం లేదు.. అంతలో అమ్మ wedding card కూడా చూపించింది.. అసలు ఎందుకు ఇలా చేశాడు.. అంతా బాగుంది గా.. అయిన ఇంత జరిగితే silent గా ఉన్నరేంటి? పదండి ఆ అమ్మాయిని అడుగుదాం అని అన్నారు.. కాని అమ్మ మాత్రం “వద్దమ్మ! ఇప్పటివరకి అందరూ మా అబ్బాయి గురుంచి మంచిగా మాట్లాడుకుంటున్నారు.. అదే వాడి చివరి కోరిక అని రాశాడు.. ఇదంతా బయటకి తెలిస్తే వాడి చివరి కోరిక నెరవేరదు, అది నా వల్లే అని అనుకున్నప్పుడల్లా బాధ అనిపిస్తది.. ఇప్పుడ ఏమి చేసిన వాడు తిరిగిరాదు.. atleast ఆ అమ్మాయిని అయిన హ్యాపీగా ఉండనివ్వండి.. ఇవేమీ తనకి చెప్పకండి..” అంటూ బాధపడింది.. వాళ్ళిద్దరూ ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు.. “మరి మీరు మాత్రం ఒంటరిగా ఎలా ఉంటారు? మాతో వచ్చెయ్యండి” అని అడిగారు.. కాని అమ్మ మాత్రం “ నేను రాను.. నేను ఒంటరిగా ఉన్నాను అని ఏవరు చెప్పారు.. వాడు లేకపోయినా ఈ ఇంటినిండా వాడి జ్ఞాపకాలే ఉన్నాయి.. వాటితో ఉండిపోతా.. మా ఇంటిఆయన చనిపోయినప్పుడు, అబ్బాయి ఉన్నాడనే ధైర్యం ఉంది.. కాని ఇప్పుడు వాడే పోయాక వాడు జ్ఞాపకాలయిన ఉన్నాయి అనే ఆనందంలో మిగిలిన జీవితాని గడిపేస్తా.. అమ్మాయి లేకుండా తను బ్రతకలేను అని తెల్సిన అబ్బాయికి, వాడు లేకుండా ఈ  పిచ్చి తల్లి ఎలా బ్రతుకుతుందో అని ఆలోచించాలనిపించలేదా” అని ఏడుస్తుంది.. వాళ్ళు కూడా అమ్మపక్కన కూర్చుని కన్నీళ్ళు పెట్టుకున్నారు........


------**** THE END ****------


Continues...........!!

thank you for reading

Uma



NOTE : The series " AMMAYI & ABBAYI - Season 1 " is ended. i hope you read all 12 episodes of the story and experienced every scene while reading it. your overall review of this story is required for my further career. hence requesting you all to share your review via comment or filling the below google form. from my bottom of heart, thank you so much to each and everyone for support through out story. one word about the people Especially who guided me by sharing Reviews about their favorite scenes, lines and identifying mistakes is ❤️❤️

.

Comments


Post: Blog2 Post
bottom of page