top of page

అమ్మాయి & అబ్బాయి - 02

Updated: Nov 30, 2023

AA - 02

attraction of abbaayi towards ammaayi:


అలా ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళిన అబ్బాయి తన కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.. morning వస్తా అని చెప్పిన అమ్మాయి, మధ్యాహ్నం అయిన రాలేదు.. కాని అబ్బాయి మాత్రం ఇంకా తన కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.. lunch కూడా తినకుండా తనకోసం చూస్తూనే పార్క్ లో బెంచ్ మీద కూర్చున్నాడు.. ఆ అమ్మాయి evening 3 - 4 మధ్యలో వచ్చింది.. అప్పటివరకు కోపం గా ఉన్న అబ్బాయి తనని చూసెసరికి ఉన్న కోపం అంతా పోయి ఏదో తెలియని happiness తో అలా చూస్తూ ఉండిపోయాడు.. " Iam Sorry.. చిన్న పని మీద friend తో బయటకి వెళ్ళా, అనుకోకుండా లేట్ అయ్యింది.. అయిన ఎంతసేపు అయ్యింది నువ్వు వచ్చి? అసలే మీకు ఏదో exam ఉన్నట్టు ఉంది, ఎలా రాశావ్?" అని అడుగుతూనే ఉంది.. అబ్బాయి మాత్రం కొంచెం ఆలోచిస్తూ "హా ! బాగానే రాశా.. నేను కూడా ఇప్పుడే వచ్చా.. exam రాసి వచ్చేసరికి కొంచెం late అయ్యింది.. ఇంకా నువ్వు నాకన్నముందోచ్చావేమో అని tension పడుతూ వచ్చా.." అంటూ నిజాన్ని దాస్తు అబద్దాన్ని ఆనందం నటిస్తూ చెప్పాడు... హమ్మయ్య అని అమ్మాయి కూడా relax అయ్యింది.. అలా ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకున్నారు.. మాట్లాడుతున్నంతసేపు అబ్బాయి అమ్మాయి కళ్ళనే చూస్తున్నాడు.. అమ్మాయి మాటలు నోటి నుండి కాకుండా తన కళ్లనుండి వస్తున్నట్టు అనిపించింది అబ్బాయికి.. అంతలో అమ్మాయికి call వచ్చింది.. సరే అయితే ఇంకా నేను వెళ్ళాలి అని అంది.. అబ్బాయి మాత్రం ఇంకొంచెం సేపు ఉండొచ్చుగా, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్లిపోతున్నావ్ అని అడిగాడు.. కాని అమ్మాయి మాత్రం వెళ్ళాలి రా.. ఇంతసేపు మాట్లాడుకున్నాం గా, మళ్ళీ కలుద్దాం అని వెళ్లిపోవడానికి ready అవుతుంది.. అయిన ఇప్పుడు వెళ్లిపోతెమిటి life long నేను తోడుగా ఉంటాగా... ప్రతి విషయంలో నీతో కలిసి నడుస్తాగా..... ఇది విని happy గా feel అయిన అబ్బాయి hostelకేగా నేను drop చేస్తా అని అన్నాడు.. అప్పుడు అమ్మాయి, " కాదు రా! ఈ రోజు friend రూమ్ కి వెళ్తున్నా.. night తన birthday.. so చిన్న చిన్న arrangements ఉన్నాయి, తనకి already location షేర్ చేశా, బయట నాకోసం wait చేస్తుంది.. ఇంకా వెళ్ళాలి అంది.." అబ్బాయి కూడా సరే జాగ్రత్త అని పంపించేశాడు.. దీని కోసమా నేను morning నుండి ఎదురుచూసింది అనుకుంటూ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు

అదే రోజు రాత్రి, అబ్బాయి అమ్మాయితో కొంచెం సేపు ఫోన్ మాట్లాడి బయట ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్లాడు.. friends తో కలిసి chill అవుతూన్నాడు.. morning జరిగినది గుర్తుకొచ్చి కొంచెం ఎక్కువ drink చేశాడు.. మిగిలిన friends అందరూ వెళ్లిపోయారు.. ఇంకా అబ్బాయి కూడా రూమ్ కి బైక్ మీద స్టార్ట్ అయ్యాడు.. కాని over drink చేయడం వల్ల bike సరిగ్గ drive చేయలేకపోయాడు.. petrol కూడా అయ్యిపోయీ రోడ్డు మీద అలా చూస్తూ చూస్తూ మత్తు ఎక్కువయ్యి పడిపోయాడు.. birth day celebration కోసం materials తీసుకెళ్తున్న అమ్మాయి అతన్ని చూసింది.. చూసి పట్టించుకోకుండా కోపంతో వెళ్ళిపోయింది.. కాని రూమ్ కి వేళ్లీ ఆలోచిస్తూనే ఉంది.. బయట climate కూడా వర్షం పడేలా ఉంది.. మళ్ళీ అబ్బాయి వెళ్లాడో లేదో అని చూడటానికి scooty వేసుకుని వచ్చింది.. అబ్బాయి మాత్రం అక్కడ అలానే పడిపోయి ఉన్నాడు.. సర్లే అని వెళ్లిపోతుంటే అంతలో వర్షం మొదలయ్యింది.. ఇంకా సరే అనుకుని అబ్బాయి లేపడానికి వెళ్ళింది.. దగ్గరకి వేళ్లీ " ఓయ్! అబ్బాయి" అని అనగానే అబ్బాయికి స్పృహ వచ్చింది.. అమ్మాయికి doubt వచ్చింది.. నిజంగానే తాగి పడిపోయడా? ఒకసారి పిలిస్తేనే పలికాడెంటి?? అని.. కాని తనని లేపి scooty మీద కూర్చోపెట్టుకుంది.. "ఓయ్! అబ్బాయి జాగ్రత్తగా కూర్చో" అని scooty start చేసి మెల్లగా వెళ్తుంది..

అప్పుడబ్బాయి "ఓయ్! అమ్మాయి నికోక విషయం చెప్పాలి" అని మత్తులో అంటున్నాడు.. అమ్మాయి కూడా చెప్పు అంది.. "నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మాయి" అని అన్నాడు.. bike suddenగా ఆపింది.. " ఏంటి అమ్మాయి బండి ఆగింది? అయిన నితో చాలా విషయాలు మాట్లాడాలి అని ఉంది" అన్నాడు.. "ఏమి లేదు.. వర్షంగా రోడ్డు కనిపించలేదు.. so slow చేశా.. చెప్పు ఏమి చెప్పాలి అనుకుంటున్నావో" అని అమ్మాయి అడిగింది.. "అయిన నువ్వెందుకు ఎప్పుడు ఇలా చూడిదార్ లేదా జీన్స్ లోనే ఉంటావు.. next week నా birthday ఉంది.. చక్కగా half-saree కట్టుకుని రావొచ్చుగా, అని అడగాలి అని ఉంది.. కాని మన మధ్య అంత పరిచయం లేదు.. పొద్దున్న కూడా చూశావా నువ్వు మాట్లాడుతుంటే నేను నీ కళ్లలో చూస్తూనే ఉన్నా.. ఏదో కొన్ని వందల పాలపుంతలు ఏకమయితే వచ్చేంత వెలుగు ని కళ్ళలోకి చూసినప్పుడు నాకు కనిపిస్తుంది.. అందుకే నీ కళ్ళు అంటే నాకు ఇష్టం.. ఇందాక కూడా అసలు ఎటువంటి చలనం లేని నాకు నీ ఒకేఒక్క మాట కదలికను తిస్కొచింది.. అది సరిపోదా నీ మాట, నువ్వు వదిలే శ్వాస నాలో అలజడిరేపే ఒక కొత్త అశా అని చెప్పడానికి" అంటూ చెప్తుండగా బండి మళ్ళీ ఆగింది.. "ఓయ్! అమ్మాయి మళ్ళీ ఏంటి? వర్షం తగ్గిందిగా.. చూసకుని drive చేయి అన్నాడు.. "నువ్వు వెళ్లాల్సిన address వచ్చింది దిగు" అని అమ్మాయి అంది.. "ఏంటి అప్పుడే ఇల్లు వచ్చేసిందా! ఏంటో నితో journey చేస్తుంటే దూరమే తెలియడం లేదు.. life-long ఇలానే నా జీవితాన్ని నడిపించవచ్చుగా" అని బండి దిగుతూ Good Night చెప్పి ఇంటిలోకి వెళ్ళిపోయాడు.. అమ్మాయికూడా తాగి వాగుతున్నాడులే అని అనుకుని వెళ్ళిపోయింది..

Next Day Morning అమ్మాయి అబ్బాయికి call చేసింది.. "ఓయ్ అబ్బాయి! తాగింది దిగిందా?" అని అడిగింది.. అబ్బాయి కొంచెం tension పడుతూ హా అని అన్నాడు.. వెంటనే అమ్మాయి కోపంతో "రాత్రి ఏమి మాట్లాడవో గుర్తుందా" అని అడిగింది.. అబ్బాయికి ఏమి గుర్తులేదు.. కాని ఆలోచిస్తూ ఉన్నాడు..


thank you for reading

Uma


continuous to AA -03 : read all parts for better understanding of the story.... don't judge story by introduction... you will definitely love the story by the time of ending ....

Commentaires


Post: Blog2 Post
bottom of page