top of page

అమ్మాయి & అబ్బాయి - 01

Updated: Nov 30, 2023

AA - 01

Intro to ammayi - abbayi :


ఒక అబ్బాయి చేతిలో ఒక లెటర్ పట్టుకుని పక్కనే ఉన్న ఒక pan-shop కి వేళ్లీ cigarette తీసుకుని వెలిగించుకుంటూ ఉన్నాడు..

అంతలో ఒక female voice వినిపించింది,

అమ్మాయి: "ఓయ్ !! నా కోసం ఒక్కసారి అయిన ఈ cigarette మానేయవచ్చుగా, అంటే నాకు ఇష్టమయిన వాళ్ళు ఇలాంటి వాటికి addict అవ్వడం నాకు ఇష్టం లేదు..”

అబ్బాయి: సరే వదిలేస్తా, ఎప్పటివరకు నీ అంతటా నువ్వే permission ఇస్తావో అంతవరకు ”..

ఇంకా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఎదో ఆలోచిస్తున్నాడు.....

#3 years back

అది degree first year, join అయ్యిన ఒక వారం తరువాత అందరూ documents submit చేయడానికి ఆఫీసు రూమ్ దగ్గర లైన్ లో నుంచుని ఉన్నారు.. అక్కడ అబ్బాయి వాళ్ళ friends తో కలిసి డోర్ కి అడ్డంగా నిలబడి మాట్లాడుతుండగా, ఒక అమ్మాయి వచ్చి "excuse me.. కొంచెం జరగండి" అని అంది.. ఎవరు అని కోపంగా కళ్ళు పెద్దవి చేసి తన కళ్ళవైపు చూశాడు కానీ తన

రెండు కళ్ళని చూస్తుంటే చూపులతోనే యుద్ధం చేస్తున్నట్టు అనిపించింది.. వాటికి పెట్టిన కాటుక ఆ కళ్ళు చేస్తున్న యుద్ధానికి మిగిలిన కొన ఊపిరి తీసే చిన్నపాటి సూదిలా అనిపించింది.. తనకున్న నల్లటి పొడవయిన కురులు చూస్తుంటే అమావాస్య రాత్రిని గుర్తుచేస్తున్నాయి.. అవి గాలికి అలా అలా వయ్యారాలు పోతుంటే సముద్రంలో అలలులా అనిపించేది.. .. తనకున్న ఎర్రటి పెదవులని చూస్తుంటే గులాబీలు కూడా ఆ రంగుని అప్పు అడిగేలా అనిపించింది.. మొత్తానికి తన ముఖం ఒక చద్రబింబంలా అనిపించింది, అలానే వెన్నెలలా జాలువారే తన చూపు కోసం కొన్ని యుగాలయిన ఎదురు చూడటంలో తప్పు లేదనిపించింది.. ఇంత అందానికి దిష్టి తగలకుండా ఉండటానికి అలా కింద పెదవికింద చిన్న పుట్టుమచ్చ.. yellow + orange మిక్స్ కలర్ డ్రస్ వేసుకుని అలా అబ్బాయి పక్కనుండి నడుచుకుంటూ వెళ్ళింది.. అలా ముందుకు వెళ్లి చిన్న చిరునవ్వుతో వెనక్కి తిరిగి తన ఫ్రెండ్ నీ పిలిచింది.. ఆ చిరునవ్వు చూసిన అబ్బాయి మైమరచిపోయి అలా వెనక్కి పడిపోయాడు... అందరూ నవుతుంటే ఆ అమ్మాయి కూడా వెనక్కి తిరిగి చిరుకోపంగా చూసి వెళ్లిపోయింది....

కానీ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయాడు....

అబ్బాయి, వాళ్ళ friend తో కలిసి కాంటీన్ లో మాట్లాడుకుంటుంటే సడన్ గా ఈ అమ్మాయి అక్కడికి వచ్చింది.. అబ్బాయి మళ్ళీ అలా చూస్తు ఉండిపోయాడు.. ఇది గమనించిన అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి నచ్చిందా అని అడిగింది.. అబ్బాయి కూడా నచ్చింది అని చెప్పాడు, అయితే ఇంకా లేట్ ఎందుకు పిలుస్తా అని తనని పిలిచింది.. అబ్బాయి చాలా tension పడుతున్నాడు.. అమ్మాయి అక్కడికి వచ్చి, ఏంటి పిలిచ్చావ్ అని అడిగింది.. ఏం లేదు, వీడు నా friend అని అబ్బాయిని పరిచయం చేసింది.. నువ్వేగా నిన్న documents submit చేసే చోట over చేశావ్ అని అడిగింది... అబ్బాయి మాత్రం ఎం చెప్పాలో తెలియక సిగ్గు పడుతున్నాడు... సర్లే hi అని అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది.. అబ్బాయి మాత్రం చేయి ఇచ్చి అలానే ఊపుతున్నాడు... ఇంకా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ involve అయ్యి " బాబు ! మనం చెయ్యి వదిలితే తను వెళ్తుంది" అని హ్యాండ్స్ ని break చేసింది... అమ్మాయి bye చెప్పి మళ్ళీ కలుద్దాం అని వెళ్ళిపోయింది... అబ్బాయి మాత్రం ఎప్పుడు మళ్ళీ?? అంటూ లేచి వెళ్లిపోబోతుంటే, friend ఆపింది.... అమ్మాయి వాళ్ళ friends తో వేరే చోట కూర్చుంది.... అమ్మాయి వెళ్లిపోయాక చెప్పింది, ఆ అమ్మాయి నాకు తెల్సు... ఎంతైనా నా ఫ్రెండ్విరా నువ్వు.... నీకు కావల్సింది నేను కాకపోతే ఇంకెవరు ఇస్తారు నీకు అని నవ్వుతూ తలపై జుట్టు నిమురుతూ పదా! వెళ్దాం.. అని లేచి వెళ్లిపోయింది... అబ్బాయి మాత్రం జరుగుతుంది నిజమా కాదా అనే భ్రమతో అమ్మాయిని చూస్తూ తన ఫ్రెండ్ వెనుక వెళ్ళిపోయాడు...

అలా కొన్ని రోజుల తరువాత మళ్ళీ అబ్బాయి అమ్మాయిని కలిశాడు.. అప్పుడు number తీస్కున్నడు.... అలా ప్రతిరోజు chatting phone calls ఇలా కొన్ని రోజులు గడిచాయి.. ఒక రోజు అమ్మాయిని కలవడాని వెళ్ళాడు, అమ్మాయి అబ్బాయి చేయి smell చూసి “ hey cigarette తాగి వచ్చావా ?”. అబ్బాయి అవును అని చెప్పాడు. అమ్మాయి అప్పుడు “ హే ఎందుకు ఇవ్వన్నీ, సిగరెట్ మానేయవచ్చుగా, ఇప్పటివరకు నిన్ను ఎంత మంది ఇలా అడిగారో తెలియదు కాని నేను మాత్రం ఫస్ట్ టైమ్ అడుగుతున్న “ నా కోసం సిగరెట్ మానవచ్చుగా అని”.. ” అప్పుడు అబ్బాయి “ సరే వదిలేస్తా, మళ్ళీ మొదలుపెట్టాల్సి వస్తే అది నీవలనే అవుతుంది..” అమ్మాయి సరే అని చెప్పింది..

కొన్ని రోజుల తరువాత అమ్మాయి దగ్గర నుండి ఫోన్ వచ్చింది.. హే బయటకి వెళ్దామ అని.. అబ్బాయి సరే అన్నాడు.. అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం రే ఏం చేస్తున్నావో అర్ధం అవుతుందా ఈ రోజు మనకి external exams చాలా important, తన విషయంలో ఎక్కువగా ఆలోచించి ని లైఫ్ ని డిస్టర్బ్ చేసుకోకు.. మూసుకొని exam రాయి రా అని చెప్పారు.. కాని అబ్బాయి మాత్రం “ రే నేను అందరిలా ఆ అమ్మాయే నా లైఫ్ అని చెప్పి, ఆ అమ్మాయి మన పక్కన ఉన్నప్పుడు తనని వదిలేసి వేరే లైఫ్ కోసం పరిగెత్తే రకం కాదు రా.. తన ఆనందంలో నా ఆనందాన్ని చూసకునే రకం.. (నవ్వుతూ .. ) ఇవ్వన్నీ చెప్పిన నీకు అర్దం అవ్వదులే..” అని చెప్పి bike keys తీస్కుని తనని కలవడానికి వెళ్ళిపోయాడు..


thank you for reading

Uma


continuous to AA -02 : read all parts for better understanding of the story.... don't judge story by introduction... you will definitely love the story by the time of ending ....

1 Comment


Kanna
Nov 20, 2023

Looks interesting Uma..

Mundu series kanna idhi inka bagunnattu anipisthundhi...

Eagerly Waiting for next part...💞💞

Like
Post: Blog2 Post
bottom of page