అమ్మాయి & అబ్బాయి - 11
- Uma225
- Jan 14, 2024
- 3 min read
AA - 11
Abbayi Struggling to Keep his Promise:
continued from previous AA - 10
అలా తనకి ఇచ్చిన మాట కోసం మళ్ళీ నార్మల్ అవ్వడం start చేశాడు.. ఇంకా స్టడీస్ మీద concentrate చేయడం start చేశాడు.. ఇంకా తన కోసం అన్వేషణ కాకుండా నాకోసం ఆలోచించడం మొదలుపెట్టాలి అనుకుని hard work చేయడం start చేశాడు.. అబ్బాయి dream job, ఏదైతే ఈ అమ్మాయి కోసం వదిలేసుకున్నాడో, మళ్ళీ అదే అమ్మాయి కోసం achieve చేసి తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాడానికి, అమ్మ కోరుకున్న జీవితం ఇవ్వడానికి ఇదే చివరికి అవకాశం.. అలా final round interview కి select అయ్యాడు.. next day interview.. చాలా nervous ఫీల్ అవతున్నాడు.. ఒక్కసారి తన galleryలో ఉన్న అమ్మాయి పిక్ ఓపెన్ చేసి “ ఓయ్ అమ్మాయ్! ఇప్పటివరకి ప్రతిదీ నాకోసమో లేదా అమ్మ కోసమో achieve చేశా.. కాని first time నీకోసం ఒకటి achieve చేస్తుంటే ఏదో తెలియని happiness రా... ఇంకోవైపు బాధ కూడా ఉంది రా.. ఎందుకంటే ఇప్పటివరకి ఎవరికోసం నన్ను నేను change చేసుకోలేదు.. ఇప్పుడు నువ్వు నాతో ఉండవని తెలిసిన నీకోసం నన్ను నేను మార్చుకున్నా.. ఇదంతా ప్రేమతోనే అని నేను అనుకుంటున్నా.. నువ్వేం అనుకుంటున్నావో తెలియదు.. నీ జీవితంలో నేను లేనప్పుడు ఇంకా నా జ్ఞాపకాలలో నువ్వెందుకు” అని అనుకుంటూ తన photos,chat, అన్నీ delete చేసేశాడు..
Interviewకి వెళ్ళడానికి ready అయ్యాడు.. అమ్మాయికి ఇష్టమయిన black shirt.. చేతికి కడియం.. మెడలో ఒక chain.. చేతిలో file పట్టుకుని.. confidence తో interview రూమ్లోకి వచ్చాడు.. అంతా బాగానే జరిగినది.. చివరిగా ఒకేఒక question.. “ what is your strength and weakness ?” అన్నిటికీ సమాధానం ఇచ్చిన అబ్బాయి దీనికి మాత్రం కొంచెం ఆలోచించి.. “ అమ్మాయి సర్..” అదివిన్న interviewer “ what? How can you say that?” అని కొంచెం serious గా అడిగాడు.. ఇంకా అబ్బాయి ప్రశాంతంగా “ అవును సర్! నిజంగా నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం అమ్మాయి.. degree join అయిన కొత్తలో ప్రతి చిన్న problem face చేయడానికి భయంవేసేది.. కాని తన పరిచయం నాలోని భయాన్ని పోగొట్టి తన కోసం ఏదయినా చేయగలను అనే confidenceని build చేసింది.. ఇప్పుడు కూడా తను నా పక్కన లేదు అనే భయాన్ని కూడా ధైర్యంగా మార్చి interviewకి attend అయ్యేలా చేసింది కేవలం తనమీద నాకున్న ప్రేమే సర్.. ఇది సరిపోదా, తానే నా strength and weakness అని చెప్పడానికి” అని చెప్పాడు.. ఆ ఒక్క answerకి convince అయ్యిన HR అబ్బాయికి offer letter ఇచ్చాడు.. happy గా రూమ్ నుండి బయటకి వచ్చాడు..
ఇంకా అలా ఆనందంగా offer లెటర్ పట్టుకుని బయటకి వచ్చి, పక్కన ఉన్న pan shop దగ్గర కూర్చుని సిగరెట్ తీసుకున్నాడు కాని అమ్మాయికి ఇచ్చిన మాట గుర్తొచ్చి సిగరెట్ పడేసి తన friendని కలవడానికి వెళ్ళాడు.. అబ్బాయి రావడం చూసిన friend “ ఏంట్రా! ఇటు వచ్చావ్.. మొన్న నీకు వచ్చిన్న కోపానికి ఇంకా నాతో మాట్లాడవేమొ అనుకున్నాగా.. ఇంతకీ కోపం తగ్గిందా లేదా! మాట్లాడు.. ఏంటి చేతిలో ఆ letter?” అని అడుగుతూ ఉంది.. అబ్బాయి తన చేతిని పట్టుకుని “ Iam sorry.. “ మొన్న ఏదో చిరాకులో అలా అన్నాను.. అంతేగాని నీమీద కోపం ఎందుకు ఉంటది నాకు.. చాలా thanks రా.. ప్రతి విషయంలో నాకు support చేస్తూ వచ్చినందుకు.. ఇదిగో offer letter” అంటూ తన చేతిలో ఉన్న letterని ఇచ్చాడు.. అది చూసి congrats రా అని చెప్పింది,.. “ నాకు తెలుసు రా నువ్వు achieve చేస్తావని కాని మధ్యలో ఏదో చిన్న చిన్న విషయాలు ని విజయాన్ని కొంచెం లేట్ చేశాయి.. అయిన నీకెందుకురా తనంటే అంతా ఇష్టం.. ఒక మనిషికి ఉన్న ఆత్మాభిమానం కూడా పక్కనపెట్టేసెంత తనలో ఏం ఉంది రా?” అని అడిగింది..
అబ్బాయి “తనని కలసిన తరువాత self respect అనేది ఒకటి ఉంటుందని మర్చిపోయా.. తన దగ్గరే ఎందుకు ఆగిపోయావ అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు.. నేనేమీ తనని నా పక్కలో పడుకునే మనిషిలా అనుకోలేదు, జీవితాంతం నా పక్కన నడిచే మనిషిలా అనుకున్నా, అలాగే ప్రవర్తించా కూడా.. తను నాతో మాట్లాడుతుంటే నవ్వడం నేర్చుకున్న అనుకున్నా కాని మాట్లాడటం మానేసిన తరువాత అర్ధమయ్యింది, నవ్వు నటించడం నేర్చుకున్న అని.... may be తన బంధం శాశ్వతం కాదేమో కాని తన పైన నేను చూపించిన ప్రేమ, నేను తనతో పంచుకున్న జ్ఞాపకాలు మాత్రం శాశ్వతమే..” అని మాట్లాడుకుంటూ ఉన్నారు.. ఇంతలో అబ్బాయికి అమ్మాయి కాల్ చేసి.. “ అబ్బాయి! ఒకసారి నిన్ను కలవాలి..” అంది. సరే అని తనని కలవడానికి వెళ్ళాడు.. పార్క్ లో బెంచ్ మీద కూర్చుని choclate తింటూ అమ్మాయి కోసం చూస్తున్నాడు.. అమ్మాయి వచ్చింది.. “ ఏంట్రా! చేతిలో file, formal డ్రస్, ఎక్కడికెళ్ళి వస్తున్నావ్..” అని అడిగింది.. అబ్బాయి “ interview కి వేళ్లీ వస్తున్నా..” అని చెప్పాడు.. “అవునా! ఏమయింది మరి.. select అయ్యవా?” అని అడిగింది.. అబ్బాయి మాట్లాడకుండా fileలో నుండి ఆఫర్ లెటర్ తీసి ఇస్తూ, తలపైకి ఎత్తాడు.. కాని అప్పటికే అమ్మాయి అబ్బాయికి ఇవ్వడానికి ఒక cover ముందు పెట్టింది.. ఇద్దరు doubt doubt గా covers మార్చుకుని open చేశారు..
అవి చూసిన ఇద్దరి కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయి.. అబ్బాయికేమో అమ్మాయి ఇచ్చిన wedding card చూసినందుకు వస్తే, అమ్మాయికి మాత్రం తనని ప్రేమిచ్చిన అబ్బాయి జీవితంలో ఆగిపోకుండా మంచి job తెచ్చుకున్నందుకు happiness తో వచ్చాయి.. అబ్బాయి మాత్రం వెనక్కి తిరిగి “ఎందుకు అమ్మాయి? కలిసిన ప్రతిసారి ఇంతలా బాధ పెడతావ్! అసలు నేను చేసిన తప్పేంటి? నాకన్న నిన్నే ఎక్కువగా ఇష్టపడటం తప్ప? కడవరకి నితోనే ఉంది, కన్ను మూయాలనుకోవడం తప్పా?” అని బాధపడుతూ అడుగుతున్నాడు.. “ఓయ్! ఎందుకు నువ్వు మళ్ళీ ఇలా చేస్తున్నావ్.......” అంటూ కొంచెం డల్ అయ్యింది.. ఇంకా అబ్బాయి వెంటనే కళ్ళు తుడుచుకుని “ సర్లే నాకు ఇదంతా అలవాటే.. నువ్వు సంతోషంగా ఉన్నావ్ గా అది చాలు నాకు..” అని మెల్లగా అమ్మాయి వైపు తిరుగుతూ.. “అయ్యిందేదో అయ్యింది.. happy married life” అని చెప్పాడు.. తను కూడా slow voice లో “ thank you.. and నీకు కూడా congratulations.. మంచి job తెచ్చుకున్నావ్..” అంటూ offer letter మళ్ళీ అబ్బాయికి ఇచ్చేసింది.. ఒక చేతిలో offer letter అండ్ ఇంకో చేతిలో wedding card పట్టుకుని అక్కడి నుండి వచ్చేశాడు..
thank you for reading
Uma
thank you so much for your love and support towards series " AMMAYI & ABBAYI "... I hope the same support will carried out to next series to...
Comments