top of page

అమ్మాయి & అబ్బాయి - 09

AA - 09

       Consoling towards Abbayi By his Friends :

continued from previous AA - 08

ఇవన్నీ ఆలోచించుకుంటూ అబ్బాయి ఇంకా కాలేజీ కి వచ్చాడు. చదువుమీద concentration పెట్టలేకపోయాడు.. కాలేజీకి వెళ్ళడం మానేశాడు.. మందు, సిగరెట్ కి మళ్ళీ బానిస అయ్యిపోయాడు.. friends faculty అసలు ఎవరి మాటలు పట్టించుకోవడం  లేదు.. ఇంకో 4 months లో ఫైనల్ campus recruitment.. వాళ్ళ room-mate వచ్చి convince చేయడానికి చాలా ట్రై చేశాడు.. కాని అబ్బాయి మాత్రం జరిగిన విషయం ఎవరికి షేర్ చేసుకునే ఆలోచన లేదు.. ఇంకా room-mate కి కూడా భయం వేసి, mutual friend కి కాల్ చేసి జరుగుతున్నది చెప్పాడు.. ఇంకా తను కూడా చాలా భయం వేసి తనని కలవడానికి రూమ్ కి వచ్చింది..

రూమ్ మొత్తం మందు సీసాలు, సిగరెట్ ముక్కలు, అందులోనే పడిపోయిన అబ్బాయిని చూసింది.. పెరిగిన జుట్టు గడ్డం..  వాడి పరిస్థితి చూసి చాలా బాధ పడింది.. ఇంకా వాడిని లేపడానికి చాలా ట్రై చేసింది.. అసలు లేవలేదు.. చాలాసేపు కష్టపడి లేపి ఫ్రెష్ అవ్వమని పంపించింది.. వాడు వచ్చేలోపు రూమ్ మొత్తం క్లీన్ చేసింది.. breakfast ready చేసింది.. వాడు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నాడు.. తినమని ఫుడ్ ఇచ్చింది.. అబ్బాయి మాత్రం వద్దు అని అంటున్నాడు.. ఇంకా కోపం వచ్చి బలవంతంగా తనే తినిపించింది.. తినిపిస్తూ తను కూడా బాధపడుతూ “ అనవసరంగా నీకు ఆ అమ్మాయిని కాంటీన్లో పరిచయం చేశాను రా.. తన వల్ల ని లైఫ్ ఇలా అవుతుంది అని తెలిస్తే అసలు మన లైఫ్ లోకి  తనని రానిచ్చేదాన్ని కాదు.. అంతా నా వల్లే.. నా వల్లే...” అని ఏడుస్తుంది.. “ హే అలా అనుకోకు.. కలిసిరాని చాలా కధల్లో నాది ఒకటి.. కాని ఎందుకో చిన్న బాధ.. ఒక మంచి అమ్మాయిని వదులుకుంటున్న అని.. తన కోసం ప్రాణాలు ఇచ్చేస్తా అని చెప్పలేను కాని తనలేకపోతే ఈ ప్రాణానికి value లేదు అని చెప్పగలను..” అని చెప్తూ అబ్బాయి kitchen లోకి వేళ్లీ friend కోసం కాఫీ చేస్తున్నాడు.. ఇంతకీ వాళ్ళ నాన్నని కలుస్తా, అడుగుతా అన్నావ్? ఏమయింది? అని అడిగింది.. ఇంకా అబ్బాయి జరిగినది మొత్తం చెప్పి తనకి కాఫీ ఇవ్వడానికి హాల్లో కి వచ్చాడు.. అబ్బాయి రావడం గమనించిన తను కళ్ళు తుడుచుకుని, సర్లే అయ్యిందేదో అయ్యింది.. తన గురుంచి ఆలోచించి కూడా waste.. ఇంకా అన్నీ వదిలేసి next campus drive కి కొంచెం ప్రిపేర్ అవ్వు అని చెప్పింది.. ఆ మాటలు విన్న వెంటనే అబ్బాయికి కోపం వచ్చింది.. తనకోసం తీసకొచ్చిన కాఫీ కూడా ఇవ్వకుండా కోపంగా “ ఇక్కడినుండి వెళ్లిపో” అని గట్టిగా అరిచాడు..

సాయంత్రం వాళ్ళ roommate వచ్చాడు.. రూమ్ అంతా clean చేసి ఉంది.. అబ్బాయి కోసం వెతుకుతున్నాడు.. balconyలో నుంచిని సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు.. roommate దగ్గరికి వచ్చి “అసలు ఏమయిందిరా? ఎందుకు ఇలా అయిపోయావ్? నేను చాలా ట్రై చేశా రా.. నిన్ను నార్మల్ చేయడానికి కాని నా మాట వినే stageలో లేవు అందుకే తనకి కాల్ చేసి రమ్మన్నాను..” అన్నాడు.. “ ఏముంది మావా! నా lifeలో ఒక అమ్మాయి వలన ఇలా అయ్యిపోతా అనుకోలేదు.. నచ్చనప్పుడు block చేస్తూ.. నచ్చినప్పుడు unblock చేస్తూ.. కేవలం నన్ను బాధపెట్టడానికే అనెట్టుగా, నేను happy ఉన్నప్పుడే వస్తుంది.. ఏడిపిస్తుంది.. వెళ్ళిపోతుంది.. తను నా life లో ఉండదు అని తెల్సిన తర్వాత కూడా ఎందుకింతలా ఆలోచిస్తున్నానో తెలియడంలేదు..” అని చెప్పి సిగరెట్ ని పడేశాడు.. roommate “ అందరూ అమ్మాయిలు ఒకేరకంగా ఉండరు రా.. నువ్వు బాధపెట్టడానికే నీ లైఫ్ లోకి వస్తుంది అనుకుంటున్నావ్.. కనీసం కొంతసేపు అయిన నువ్వు నవ్వు నటించుకుండా మనస్పూర్తిగా నవ్వాలి అని వస్తుందేమో అని నేను అనుకుంటున్నా..” అని అన్నాడు.. అబ్బాయి “అదేంట్రా! ప్రతిసారి తన గురుంచి negativeగా మాట్లాడే నువ్వు ఇప్పుడు ఇలా positiveగా ఉన్నవ్?” అని అన్నాడు.. “అలా ఏమి లేదు రా.. ఇన్ని రోజులు నువ్వు ఏమయిపోతావో అని భయంతో అలా మాట్లాడాను.. కాని ఇప్పుడు నువ్వు మారతావ్ అనే నమ్మకం వచ్చింది.. అందుకే నాకు అనిపించిన నిజం చెప్పా..  సరే ఇంకా అయ్యిందేదో అయ్యింది.. exams and placements మీద concentrate చేయి” అన్నాడు.. అది విన్న అబ్బాయి silentగా అక్కడినుండి వెళ్ళిపోయాడు..

Mutual friend అబ్బాయి ఎందుకు serious అయ్యాడో అని ఆలోచిస్తూ hostelకి వచ్చింది.. అమ్మాయిని కలిసి “అక్కడ అబ్బాయి పిచ్చోడు అయిపోయాడు.. నువ్వు పెళ్లి అని చెప్పిన దగ్గరనుండి తల్లడిల్లిపోతున్నాడు.. చదువు career అన్నీ వదిలేసి మందుకి బానిస అయ్యిపోయాడు.. నువ్వు వాడిని ఎంత బాధ పెట్టిన అన్నీ మరిచిపోయి మళ్ళీ మళ్ళీ ని దగ్గరకే వస్తున్నాడు, దాని అర్ధం వాడికి వేరే వాళ్ళు దొరకక కాదు, వాడు నికిచ్చిన స్థానం వేరే ఎవ్వరికీ ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి..  ఇప్పుడు కూడా వాడి దగ్గరనుండే వస్తున్నా.. నీకోసం నీవెంట పడటమే ప్రేమ అనుకుంటున్నావ్ నువ్వు, కాని వాడు మాత్రం నీ సంతోషం కోసం ఆగిపోవడమే ప్రేమ అనుకుంటున్నాడు.. ఇదంతా వాడిని పెళ్లి చేసుకో అని ఒప్పించడానికి చెప్పడం లేదు.. జస్ట్ వాడు మళ్ళీ పాత మనిషిలా మారుస్తావని చెప్తున్నా..  ఒకసారి వాడితో మాట్లాడి convince చేయి.. ఇప్పటివరకు నువ్వు వాడిని ఎందుకోసం కలిశావో తెలియదు కాని ఇంకొకసారి వాడిని కలిస్తే మాత్రం అది వాడిని మార్చడానికి మాత్రమే ఉండేలా చూడు.. ” అని చెప్పింది.. ఇంకా అమ్మాయి బాగా ఆలోచించి కాల్ చేసింది, response లేదు.. mesgs చేసింది.. response లేదు.. అలా రెండు రోజుల తరువాత అబ్బాయి call lift చేసి “ ఏంటి చెప్పు?” అన్నాడు.. అమ్మాయి “ ఒకసారి meet అవ్వాలి “ అని చెప్పింది..  సరే అని కాల్ cut చేశాడు..

thank you for reading

Uma


continuous to next AA -10 : I hope you loved the story till this part.. Need your response in comments... any guess about next part... comment it..

 
 
 

Comentarios


Post: Blog2 Post
bottom of page