అమ్మాయి & అబ్బాయి - 06
- Uma225
- Dec 23, 2023
- 3 min read
Updated: Jan 1, 2024
AA - 06
Explaining Ammayi Importance in Abbaayi’s Life:
continued from previous AA - 05..
అలా కాలేజీకి వచ్చిన తర్వాత తనతో మాట్లాడటం కోసం ఆమ్మాయి కోసం వెతుకుతున్నాడు.. కనిపించింది.. కాని అబ్బాయిని అసలు పట్టించుకోలేదు.. వాళ్ళ friends తో బాగా busy అయ్యిపోయింది.. పోనీలే ఇంటిదగ్గర ఏమయినా అయ్యిందేమో అని అలా అలా ఉండిపోయాడు.. ఇంకెన్ని రోజులయిన తనలో మార్పు రావడం లేదు.. ఇంకా చేసేది ఏమి లేక వెళ్లీ తనని అడగాలి అని decide అయ్యాడు.. రేపు కలవాలి అని mesg చేశాడు కాని కలుద్దాం అని చెప్పింది but కలవడానికి రాలేదు.. చాలా చిరాకు పడ్డాడు.. కాని తరువాత మళ్ళీ ఏదయినా work లో ఉందేమో అని అడగలేదు.. కేవలం తన mesg కోసం ఎదురుచూస్తున్నాడు.. కొన్ని రోజులకి తన దగ్గరనుండి mesg వచ్చింది.. కలవాలని ఉంది అని.. సరే అని చాలా ఆనందంలో ఉన్నాడు.. అప్పటికే 4 months నుండి try చేస్తున్న job కి ఫైనల్ interview ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయి తనని కలవడాని చెప్పిన ప్లేస్ కి వెళ్ళాడు.. తను చెప్పిన time కంటే ముందే వెళ్ళాడు తన కోసం చూస్తున్నాడు.. తను చెప్పిన time కూడా అయ్యింది ఇంకా తను రాలేదు..
సెకనులు నిమిషాలయ్యాయి.. నిమిషాలు గంటలయ్యాయి... గంటలు పూటలు అయ్యాయి కానీ ఆమ్మాయి మాత్రం రాలేదు... అలా రాత్రి వరకు అక్కడే ఉన్నాడు కానీ ఆమ్మాయి రాలేదు.. అంతలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు... కోపంగా పద రూం కి వెళ్దాం అని అన్నాడు... సరే అని వెళ్ళారు... వెళ్ళిన వెంటనే చెంప మీద ఒకటి గట్టిగా కొట్టాడు.. interview కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళవు అని అడిగాడు... అంటే ఆమ్మాయి కలుస్తా అని చెప్పింది ఇంకా కలుద్దామని వెళ్ళ అని చెప్పాడు... మరి ఆ ఆమ్మాయి వచ్చిందా అని అడిగాడు... రాలేదు అని చెప్తూ తన రూం లోకి వెళ్ళడానికి తిరిగాడు... కానీ friend మాత్రం మళ్ళీ వెనక్కి లాగి "అసలు ఏమి చేస్తున్నావో అర్థం అవ్తుందా నీకు... నువ్వు 1 year hardwork.. 4 months continues effort పెట్టి interview చివరి రౌండ్ వరకు వెళ్లి... నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పిన అమ్మాయికోసం వీటన్నింటికీ వదిలేసి వెళ్లి పిచ్చోడిలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తూ ఉన్నావ" అని కొపంగా తిడుతున్నాడు... అబ్బాయికి కూడా బాగా కోపం వచ్చి.. వాడి shirt కాలర్ పట్టుకుని " రేయ్!! నీకు చాలా సార్లు చెప్పా... ఆమ్మాయి గురించి తప్పుగా మాట్లాడకు అని... అయినా నా జీవితం... నా job... ( అని కాలర్ వదిలి) ఆ ఆమ్మాయి నా జీవితంలో లేకుండా ఇంకా ఎలాంటి జాబ్ ఉన్న హ్యాపీనెస్ మాత్రం ఉండదు రా... ఇవ్వన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు…” అని వెళ్ళిపోతున్నాడు.... సరే నాకు చెప్పాల్సిన అవసరం లేదు.. పోని అమ్మకి అయిన చెప్పాలిగా... నీ చిన్నప్పుడే తన భర్తను పోగొట్టుకుని నీ మీద అశలతో బ్రతుకుతూ... ఇంతకాలం చదివించిన అమ్మకి ఏమి చెప్తావు.... ఈ మాట విన్న వెంటనే ఆ అబ్బాయి ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు... వెంటనే తన friend ని కౌగలించుకుని ఏడ్చాడు.. “అమ్మ కోరుకున్న జీవితాన్ని ఇప్పుడు miss అయిన next year అయిన job కొట్టి ఇవ్వొచ్చు కానీ ఈ అమ్మాయి miss అయితే ఎప్పటికీ మళ్ళీ తిరిగి పొందలేను” అని బాధ పడుతూ తన రూం లోకి వెళ్ళిపోయాడు.... Friend అప్పుడు ఒక్కసారి ఆలోచించు అక్కడ నువు ఎదురుచూస్తున్నావ్ అని కూడా ఆలోచించకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలకి వెళ్తున్న అమ్మాయికి importance ఇవ్వడం అవసరమా అని అడిగాడు.... కానీ అబ్బాయి తన రూం నుండి ఏడుస్తూ " ఆ అమ్మాయికి నేను అవసరం లేదేమో కానీ నాకు ఆ ఆమ్మాయి కావాలి రా" అని గట్టిగా అరిచి door close చేసుకున్నాడు....
తరువాత రోజు అమ్మాయి call చేసింది... నిన్న important క్లాస్ ఉండటం వల్ల కలవలేదు.. వీలయితే ఈ రోజు కలుద్దామ అని... అబ్బాయి కూడా సరే అన్నాడు... Evening class అయ్యిపోయాక campus రోడ్డు మీద కలిశారు... అప్పుడు అడిగాడు ఎందుకు నిన్న రాలేదు అని.. అమ్మాయి మాత్రం confident గా నిన్న క్లాస్ ఉంది రాలేదు అని చెప్పింది...తను చెప్పింది అబద్దం అని తెలిసి తనతో ఇంకా ఓపికతో వింటూనే ఉన్నాడు.. ఇంకా నిన్న classలో ఇది జరిగినది అని చెప్తూనే ఉంది, ఇంకా mesgs వస్తూనే ఉన్నాయి, కాల్స్ వస్తూనే ఉన్నాయి, వాటిని cut చేస్తూ, అబ్బాయికి కనిపించకుండా mobile దాచుకుంటూ replies ఇస్తూ, అబ్బాయిని “ చూడు నా friends నన్ను ఎంత అర్దం చేసుకుంటున్నారో? నన్ను ఏ రోజు బాధ పెట్టరు.. నా గురుంచి ప్రతి విషయం తెలసుకుంటారు, నీలా మనకెందుకు అనుకోరు.. అందుకే నేను చాలా నమ్ముతాను వాళ్ళని.....” అని ఇంకా చెప్తూనే ఉంది.. అబ్బాయికి ఒక్కసారిగా కోపం వచ్చి “ హే! ఆపు సోది” అని అరిచాడు.. అమ్మాయి బయపడి ఒక్కసారిగా mobile లోపలపెట్టేసింది..
“ ఏంటి! ఎవరు చెప్పారు నీ గురుంచి నాకు ఏమి తెలియదు అని? నీ గురుంచి నాకు చాలానే తెల్సు.. ఎంతయినా ప్రేమించానుగా.. నేను నీకు అవసరం లేదేమో కాని నాకు నువ్వు కావాలి.. అందుకే ప్రతి నిమిషం ని గురించే ఆలోచిస్తూ, నాకంటే ఎక్కువ నీ గురించే తెల్సుకున్న.. కాని ఏనాడూ నిన్ను ప్రశ్నించలేదు.. నాకు నువ్వు వేస్తున్న వేషాలు తెల్సు... చేస్తున్న చేష్టలు తెలుసు... నువు నాకు ప్రతిసారీ అబద్ధాలు చెప్తున్న అని తెలిసిన సరే.. నాతో మాట్లాడుతున్నావ్ అని ఆనందపడ్డానే గానీ నిన్ను ప్రశ్నించలేదు... నాకు చెప్పిన అబద్ధాలు నిజం అని నమ్మించడానికి నువ్వు మళ్ళీ మళ్ళీ కొత్త అబద్ధాలు వెతుక్కుంటుంటే చూసి కలవరపడ్డానే గానీ క్వశ్చన్ చెయ్యలేదు... ఇప్పుడు కూడా నేను నీ పక్కన ఉన్నప్పుడు నీకు వచ్చే mesgs ను నాకు తెలియకుండా ఉండాలని నువు పడే కష్టం చూసి నాకు కన్నీరు వచ్చిందే కానీ నా వలన ఏనాడూ నీకు కన్నీళ్లు రానివ్వలేదు... కానీ ఎక్కడో చిన్న బాధ... నేను నా ప్రాణంతో సమానంగా ఇష్టపడిన వ్యక్తి... నన్ను కన్నవాళ్ల తరువాత కంటికి రెప్పల కాపాడుకుంటారనే వ్యక్తి... నా దగ్గర నటిస్తుంటే బాధేసింది... నేను ఇంత నమ్ముతున్న person దగ్గర కనీసం కొంచెం నమ్మకాన్ని పొందలేకపోయానే అనే బాధేసింది..... నేను అయితే ఏమి అడగను.... అడిగి ఒకరిముందు నిన్ను తక్కువ చెయ్యడం నాకు ఇష్టం లేదు... ఎందుకంటే feel అయ్యేది నువ్వైతే, బాధ పడేవాళ్ళలో ముందుండేది నేనే కాబట్టి...” అని కోపం గా అక్కడినుండి వెళ్లిపోయాడు.. అమ్మాయి మాత్రం చుట్టూ అందరూ తననే చూస్తున్నారు అని బాధపడుతూ వెళ్ళిపోయింది..
thank you for reading
Uma
continuous to next AA -07 : I hope you loved the story till this part.. Need your response in comments... While writing this part, I realized "how much effort we put on a relation to be more strong is doesn't matter, while they utilize our small mistake to blame us and get rid off from us...."
Comments