అమ్మాయి & అబ్బాయి - 03
- Uma225
- Dec 1, 2023
- 3 min read
AA - 03
Cute Proposal by Abbaayi:
ఇంకా అబ్బాయి అలా ఆలోచిస్తూ ఉన్నాడు.. సరే అబ్బాయి నువ్వు ఆలోచించుకో నేను ఇక్కడ నీకోసం wait చేస్తూ ఉంటా.. అబ్బాయి tensionతో ఎక్కడ ఉంటావో చెప్పు వస్తున్న అన్నాడు.. ఇంకా అమ్మాయి చిరాకుగా " ఒకసారి night జరిగినది బాగా గుర్తుచేసుకో.. నిన్ను ఎక్కడాయితే నేను కలిశానో ఇప్పుడు కూడా అక్కడే wait చేస్తున్నా" అని కోపంగా కాల్ cut చేసింది.. ఇంకా అలా ఆలోచిస్తూ ఏమి జరిగిందా అని బయటకి వచ్చాడు, బయటేమో బండి లేదు.. ఇంకా మెల్లగా గుర్తొచ్చింది.. night బండి ఆగిపోవడం.. అమ్మాయి వచ్చి pick చేస్కోవడం ఇవే గుర్తున్నాయి.. సరే అని వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి బండి కోసం petrol తీసుకుని ఇద్దరు వెళ్లారు.. వీళ్ళు వెళ్ళేసరికి అమ్మాయి ఆల్రెడీ అక్కడ ఎదురుచూస్తుంది.. అబ్బాయి అలా తలదించుకుని అటూ ఇటూ చూస్తూ పాకెట్ లో key కోసం వెతుకుతున్నాడు కాని కనిపించడం లేదు.. మళ్ళీ అమ్మాయి వైపు చూశాడు, మళ్ళీ వాళ్ళ friend వైపు చూస్తూ తాళం కనిపించడంలేదు అన్నాడు.. "ఎలా కనిపిస్తది! బాబు గారు రాత్రి వొళ్ళు తెలియకుండతాగి పడిపోయారుగా! ఇంకా నా దగ్గరే ఉంచా" అని తీసి ఇచ్చింది.. ఇంకా సిగ్గుపడుతూ తాళం తీసుకుని పెట్రోల్ పోసి start చేశాడు.. సరే ఇంకా పదరా అని అబ్బాయి friend అన్నాడు.. కోపంతో అమ్మాయి తలమీద పీకి " ఎక్కడికిరా వెళ్ళేది.. నన్ను ఎవడు దింపుతాడు.. హాస్టల్ దగ్గర drop చేయి" అని అడిగింది.. ఇంకా సరే అని కొట్టింది అనే నొప్పికన్న బండి ఎక్కించుకునే ఛాన్స్ వచ్చింది అని హ్యాపీ ఫీల్ అయ్యాడు.. ఇంక అలా స్టార్ట్ అవుతూ 10 minలో వెళ్లాల్సిన routeని అటుతిప్పి ఇటుతిప్పి 30min కి drop చేశాడు.. ఇంకా అమ్మాయి దిగి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయింది..
తరువాత రోజు అమ్మాయి దిగులుగా కూర్చుని ఉంది, అబ్బాయి ఏమి అయింది అని అడిగాడు.. అప్పుడు అమ్మాయి “ ఏమి అవుతుందో తెలియడం లేదు.. నాకు ఏమి చేయాలో తెలియడం లేదు.. అందరినీ గుడ్డిగా నమ్మేసి చివరికి నేనే ఇబ్బందుల్లో పడుతున్నా.. అందుకే ఈ రోజు నుండి నా limits లో నేను ఉండాలి అనుకుంటున్నా.. ఎక్కువమందితో మాట్లాడకుండా ఒక నాకు ఆనందాన్ని ఇచ్చే కొందరితోనే మాట్లాడాలి అనుకుంటున్నా..” ఆ మాటలు విన్న అబ్బాయి faceలో ఒక్కసారిగా happiness అంతపోయింది.. ఎక్కడ ఆ అమ్మాయి ఇంకా తనతో మాట్లాడదో అనే భయం ఎక్కువయ్యింది, ఆ భయంతోనే తనని “ సరే అయితే ఇంకా మనం కలవడం ఇదే చివరిసారి అని చెప్తున్నావా” అని అడిగాడు.. కాని ఆ అమ్మాయి మాత్రం “ హే! అలా అనుకుంటే నీకెందుకు చెప్తా ఇవన్నీ, your special to me.. ఎవరితో అయిన మాట్లాడటం మానేస్తానేమో, నితో మాట్లాడటం మాత్రం ఆపను” అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.. ఒకరోజు అమ్మాయి వెతుకుతూ అబ్బాయి తిరుగుతున్నాడు.. ammayi అప్పుడు వేరే అబ్బాయితో మాట్లాడుతుంది.. ఎవరు అని అడుగుదాం అనుకుని మళ్ళీ ఏమయినా అనుకుంటుందేమో అని ఆగిపోయి, ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదు అని రేపే తనకి propose చేయాలి అనుకుంటాడు..
ఇంకా తెల్లవారితే అబ్బాయి birthday... ఇంకా morning అమ్మాయితో గుడికి వెళ్దాం అనుకున్నాడు కానీ... అంతలో ఒక కాల్ వచ్చింది.. ఆ కాల్ మాట్లాడుతూ పడుకునిపోయాడు.. ఇంకా morning లేచి temple కి ఒక్కడే వెళ్ళాడు.. అయిపోయాక అందరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్లారు.. అప్పటికే చాలా చిరాకులో ఉన్నాడు.. వస్తున్న కాల్స్ ఏమి lift చేయడం లేదు.. మిగిలిన వాళ్ళందరూ ఏమయిందిరా అని అడిగితే, " హే ఇవ్వన్నీ waste రా! అందరికీ మిగిలిన రోజులు నేను గుర్తుకురాను కాని ఈ రోజు మాత్రం ఏదో అందరూ నాకోసమే ఉన్నట్టు mesgs, calls చేస్తారు” అని చిరాకుగా అన్నాడు.. ఇది విని మిగిలినవాళ్ళు “ఏంట్రా! ఇంత attitude చూపిస్తున్నాడు” అని అనుకున్నారు.. అలా చూస్తూ ఉండగా అబ్బాయి వాళ్ళ friend వచ్చింది.. అమ్మాయి రాలేదా అని అడిగాడు.. లేదు అని చెప్పింది.. ఇంకా అందరూ వచ్చేశారు cake cut చేయడానికి ready అవతున్నారు.. అబ్బాయి మాత్రం mood off అయ్యిపోయి ఒక మూలకి వెళ్ళిపోయాడు. అది చూసి వాళ్ళ friend అబ్బాయి దగ్గరకి వచ్చి “ ఏంట్రా ఇలా dull గా కూర్చున్నావ్! ఒకసారి ఆలోచించు.. ఎవరో రాలేదు అని, ఇప్పుడు వచ్చిన ఇంతమందిని disappoint చేయడం correct కాదు రా.. పదా వెళ్దాం అంది.. నువ్వు వెళ్ళు ఒక 30 min లో వస్తా అని చెప్పాడు..
ఇంకా cut చేసే time కి అలా entrance వైపు చూశాడు.. ఎవరో వస్తున్నట్టు అనిపించింది.. red colour saree.. కంటికి కాటుక.. loose hair.. అలా తన ముఖం మీద పడుతున్న జుట్టు అలా పక్కకి జరుపుకుంటూ.. చిన్నగా సిగ్గు పడుతూ అమ్మాయి వచ్చింది.. అబ్బాయి కళ్ళలో ఒకసరిగా ఏదో తెలియని happiness వచ్చింది.. “ yes “ అంటూ గట్టిగా అరుస్తూ.. cake కూడా cut చేయకుండా తన దగ్గరకి పరిగెడుతూ, గంతులేస్తూ వెళ్ళాడు.. “thankyou for coming.. ఇంకా late అయ్యేసరికి రావేమో అనుకున్నా “ అంటూ దగ్గరుండి తీసకొచ్చాడు.. happyగా celebrations complete అయ్యింది.. lunch complete చేసి అందరూ one by one వెళ్తున్నారు.. ఇంకా మిగిలినవాళ్ళంతా కూడా వెళ్లిపోతూ మెట్లు దిగుతున్నారు.. suddenగ అమ్మాయి కాల్ బెణికింది.. అసలు నడవలేకపోయింది.. వెంటనే అబ్బాయి మోకాలు మీద కూర్చుని తన అరికాలు పట్టుకుని నొప్పిఉన్న చోట massage చేస్తున్నాడు.. ఇందాక ఏవరయితే ఇంత attitude ఏంటి అన్నవాళ్లు, ఆశ్చర్యంగా “ ఏమయిపోయింది రా.. వీడి attitude” అని అనుకున్నారు.. అమ్మాయి కొంచెం betterగా ఫీల్ అవ్వడం చూసిన అబ్బాయి “ ఓయ్ అమ్మాయి! నికోక విషయం చెప్పాలి.. birthday నాదయిన కాని నీకోసం నేనొక gift తీసుకొచ్చా.. ఇప్పటివరకు నీకు తెలియకుండానే నీ మాటలు, నీ ఆలోచనలు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి.. ఇకపై నువ్వు వేసే ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉండాలని, నీ కాళీ గజ్జల అలికిడి కూడా నా happiness అవ్వాలి అని ఈ రోజు ఈ పట్టీలు నీకోసం తీసకొచ్చా” తన చేతిలో ఉన్న కాలికి ఒక పట్టి పెడుతున్నాడు.. చుట్టూ ఉన్నవాళ్ళు ఇంకా చప్పట్లు కొడుతూ అరుస్తున్నారు.. కాని అమ్మాయికి మాత్రం ఏమి చెప్పాలో తెలియక అబ్బాయి చేతిలో ఉన్న కాలిని వదిలించుకుని వెళ్ళిపోయింది.. అబ్బాయికి మాత్రం, అమ్మాయి ఏ విషయము చెప్పలేదు అని కళ్ళలో నీళ్ళు వచ్చాయి.. అలా ఇంకో చేతిలో రెండో పట్టి అలానే పట్టుకుని.. తన friend వైపు చూస్తూ ఉండిపోయాడు..
thank you for reading
Uma
continuous to AA -04 : read all parts for better understanding of the story....You will definitely love the story by the time of ending....
Comments