అమ్మాయి & అబ్బాయి - 05
- Uma225
- Dec 16, 2023
- 2 min read
Updated: Dec 18, 2023
AA - 05
Meeting between Abbayi and Unknown Person:
continued from previous AA - 04..
ఇంతలో సంక్రాంతి holidays వచ్చాయి... అందరూ ఇంటికి వెళ్లిపోయారు.. కాని అబ్బాయికి ఏమి చేయాలో తెలియడం లేదు.. తనని చూడాటానికి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నాడు.. వెళ్తూ ఉండగా దారిలో ఒక పెద్దాయన బండి ఆగిపోయి wait చేస్తూ ఉన్నాడు.. అబ్బాయి ఆయనకి lift ఇచ్చాడు.. పెద్దాయన అలా చూస్తూనే ఉన్నాడు ఆ అబ్బాయిని.. ఇంకా అలా అలా చూస్తూ ఓపిక పెట్టలేక “ బాబు!! ఎవరి అబ్బాయి నువ్వు ? నిన్ను ఎప్పుడు ఇక్కడ చూడలేదు కాని ఎందుకో బాగా దగ్గరి వాడిని చూస్తున్నట్టు ఉంది..” అని అడిగాడు.. అప్పుడు అబ్బాయి తన గురుంచి తన family గురుంచి చెప్పాడు... అది విన్న పెద్దాయన ఆనందంతో “ అమ్మ ఎలా ఉంది..” అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.. అబ్బాయికి ఏమి అర్దం అవ్వలేదు ఆశ్చర్యం గా చూస్తూ ఉన్నాడు.. తరువాత మళ్ళీ పెద్దాయిన మళ్ళీ “ ఇంతకీ ఈ ఊరు వస్తున్నట్టు అమ్మకి తెల్సా” అని అడిగాడు.. అబ్బాయి doubt గానే తెలియదు అని చెప్పాడు.. పెద్దాయన సరే అని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు.. పెద్దాయన “ఏమి పని మీద వచ్చావు” అని అడిగాడు.. మా friend ఒకరిని కలవడానికి వచ్చాను అని చెప్పాడు.. అలా మాట్లాడుకుంటూ పెద్దాయన ఇంటివరకు వచ్చేశారు..
ఇక అబ్బాయి సరే వెళ్తున్న అని చెప్పి start అవ్వబోతున్నాడు.. పెద్దాయన ఆగు బాబు ఒక్కసారి ఇంటికి వచ్చి coffee తాగి వెళ్ళు అని పిలిచాడు.. ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక లోపలికి వెళ్లి కుర్చున్నాడు.. అప్పుడే పెద్దాయన వాళ్ళ వైఫ్ అక్కడికి వచ్చారు.. అబ్బాయిని చూసి ఏదో తెలియని happiness తో “బాబు!! నువ్వూ......” అని ఏదో మాట్లాడబోతుంటే పెద్దాయన ఆవిడని పక్కకి తీసుకెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు.. అబ్బాయికి ఏమి చేయాలో తెలియక చుట్టూ చూస్తున్నాడు.. అక్కడ ఒక చిన్న పిల్ల photo కనిపించింది.. ఆ కళ్ళు ఎక్కడో చూసినట్టు అనిపించి అలానే చూస్తూ ఉన్నాడు.. అంతలో తనకి పట్టీల sound వినిపించింది.. అలా పక్కకి తిరిగి చూశాడు.. అప్పుడే పైనుండి మెట్ల మీద నుండి red and green combination లో లంగా-వోణి వేసుకుని ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది.. అలా కాళ్ళ దగ్గర నుండి అలా పైకి చూశాడు.. తాను ఏ అమ్మాయిని అయితే college లో ప్రేమించాడో, ఏ అమ్మాయి కోసం ఈ ఊరు వచ్చాడో, ఆ అమ్మాయే తన కళ్ళముందు కనిపించేసారికి ఆనందం పడ్డాడు..
తనతో మాట్లాడటానికి వెళ్తుండగా, పెద్దాయన వాళ్ళ వైఫ్ coffee తీసుకొచ్చారు.. ఆ coffee తాగుతూ అలా sofa లో కూర్చున్నాడు.. అంతాలో పెద్దాయన వచ్చాడు.. అమ్మాయిని చూపిస్తూ మా అమ్మాయి బాబు.. డిగ్రీ 2nd year చదువుతుంది అని చెప్పాడు.. సరే అని coffee తాగి start అవ్వబోయాడు.. తన చేతిలో ఉన్న ఒక రింగ్ ని అబ్బాయి చేతి వెలికి పెట్టాడు.. కాని ఆ అబ్బాయి వద్దు అని చెప్పాడు.. కాని పెద్దాయన మాత్రం ఇంతకాలం మా దగ్గర ఉన్న ఈ ఉంగరం ఎందుకో నీకీ ఇవ్వాలి అనిపిస్తుంది, నాకు చాలా నచ్చావు అని చెప్పి బలవంతంగా వెలికి పెట్టేశాడు.. ఆ భార్య భర్తల కళ్ళలో ఏదో తెలియని happiness కనిపించింది.. అసలు ఏమి జరుగుతుందో అని అర్దం కాక ఆలోచిస్తూ అలా బండి start చేస్తూ ఇంటివైపు చూశాడు.. కింద పెద్దవాళ్ళు ఇద్దరు ఆనందంతో చూస్తున్నారు.. పైనుండి మాత్రం ఆ అమ్మాయి బాధగా చూస్తూ ఉన్నది.. ఇంకా ఆ అబ్బాయి ఆ రింగ్ చూసుకుంటూ ఆలోచించుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు..
అసలు నేను వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయి నా కళ్లముందే కనిపించడం ఏంటి? అయిన మా కుటుంబం గురుంచి చెప్తే పెద్దాయన ఎందుకంత ఆనందపడ్డాడు? మా అమ్మ ఆయనకి ముందే తెల్సా? నేనంటే ఇష్టంలేదు అని చెప్పిన అమ్మాయి ఇప్పుడు నేను వచ్చేస్తుంటే బాధగా ఎందుకు చూసింది? అసలు ఇప్పటివరకి ఎప్పుడు నన్ను చూడని వాళ్ళు ఎందుకింత ప్రేమని చూపిస్తునారు?ఇలాంటివి అన్నీ ఆలోచించుకుంటూ అబ్బాయి ఇంటికి వచ్చాడు.. ఇంకా కాలేజీ కి వెళ్లాల్సిన రోజు వచ్చింది.. ఇంకా start అవుతుండగా అబ్బాయి వాళ్ళ అమ్మ ఆ రింగ్ ని చూసి “ఇది ఎక్కడిది రా!! కొత్తగా” అని ఆ రింగ్ ని చూస్తూ చూస్తూ అనుకోకుండా ఒక కన్నీటి చుక్క ఆ రింగ్ మీద పడింది ఇంకా వెంటనే కళ్ళు తుడుచుకుంది.. కాని అబ్బాయి మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు.. అమ్మ అడిగిన ప్రశ్నకి సమాధానం గురుంచి తడబడుతున్నాడు.. చివరికి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడు.. అమ్మ మాత్రం “ జాగ్రత్త రా!” అని బాధతో చెప్పింది.. సరే అని అబ్బాయి collegeకి వచ్చేశాడు..
thank you for reading
Uma
continued to AA -06 : read all parts for better understanding of the story....You will definitely love the story by the time of ending.... Need your response in comments...
Comments