top of page

అమ్మాయి & అబ్బాయి - 04

AA - 04

Proposal Rejection by Ammaayi:

continued from previous AA - 03..

మిగిలిన వాళ్ళు కూడా silentగా అక్కడినుండి వెళ్లిపోయారు.. అబ్బాయి ఇంకా తన friend మాత్రమే ఉన్నారు.. ఇంకా అలా నైట్ రూమ్లో కూర్చుని అసలు నేనేమీ తప్పు చేశాను? ఎందుకు response లేకుండా వెళ్ళిపోయింది? అని ఆలోచిస్తూ ఉండగా దూరంగా phone రింగ్ అయ్యింది.. దగ్గరకి వెళ్ళి ఎవరో అని చూశాడు.. అమ్మాయి దగ్గరనుండి కాల్ వస్తుంది.. అసలు ఎందుకు కాల్ చేస్తుందో అని భయంతో lift చేయడానికి బయపడుతూనే lift చేసీ “hello!” అని అన్నాడు.... “ నితో మాట్లాడాలి రేపు కలవాలి అని కోపం గా అమ్మాయి కాల్ cut చేసింది.. వీడు నుంచున్న చోటే కూర్చుండిపోయాడు.. ఇంకా morning ఏమి జరుగుతుందో అని భయంతో నిద్రకుడా పోలేదు.. తరువాత రోజు ఇంకా అబ్బాయి భయం భయంగా తనని కలవడానికి వెళ్ళాడు..

అమ్మాయి కాంటీన్ లో కూర్చుని ఉంది.. అబ్బాయి రావడం చూసి అలా కోపంగా చూస్తూనే ఉంది.. అబ్బాయి మాత్రం తల దించుకుంటూ, ఎత్తుకుంటూ, భయంగానే వెళ్ళి “actually..” అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగా..... ఒక్కసారిగా అమ్మాయి లేచి అబ్బాయి చెంప మీద కొట్టింది.. ఒక్కసారిగా canteen మొత్తం వీళ్లిద్దరివైపు చూస్తున్నారు.. ఇంకా అమ్మాయి కోపంతో “ అసలు ఏమి అనుకుంటున్నావ్ ని గురుంచి.. నేను ఏదో అందరికంటే కొంచెం ఎక్కువ చనువు నీకు ఇచ్చా.. ఎందుకంటే అసలు అబ్బాయిలంటేనే చిరాకు పడే నాకు ని విషయంలో ఫ్రీగా ఉన్నాను అనిపించింది.. మిగిలిన వారిలా నువ్వు మన మధ్యకి ఇలాంటి ప్రేమ అనే చెత్త తీసుకురావు అనిపించింది.. కాని నువ్వు కూడా అందరీలాంటివాడివే అని తెల్సినాకా నితో మాట్లాడాలి అంటేనే అసహ్యం వేస్తుంది..

అబ్బాయి ఇంకా బాధతో “ నువ్వు అలా మాట్లాడకు అమ్మాయి..నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పడానికి నాకు అక్షరాలు దొరకడం లేదు, కాని నువు లేకపోతే మాత్రం పౌర్ణమి రోజు ఆకాశంలో చందమామ లేక ఒంటరయ్యిన నక్షత్రంలా అర్ధం లేని జీవితం అవుతుంది అని మాత్రం చెప్పగలను, అదే నువ్వు నా పక్కన ఉంటే మాత్రం అమావాస్య రోజు నా జీవితంలోకి వచ్చిన వెన్నెల వెలుగుల సంతోషంగా బ్రతికేస్తా అని నమ్మకం నాకు ఉంది.. ఈ విషయం నిన్న కాదు, నిన్ను చూసిన మొదటి క్షణం నుండి నా మనసు నీకు చెప్పాలని చూస్తుంది, కాని చెప్పడానికి ఎక్కడో నువ్వు no చెప్తావన్నా భయం నన్ను ఇంతకాలం ఆపేసింది, కాని మొన్న నువ్వన్న మాటలు నా hopes ఇంకా పెంచేశాయి.. అందుకే నిన్న చెప్పేసా..” అన్నాడు.

ఇంకా అమ్మాయికి కూడా ఏమి చెప్పాలో తెలియక కొంచెం సేపు బాగా ఆలోచించి.. ఇప్పటివరకు ఎవరికి తెలియని విషయం నీకు చెప్పాలి, అందరూ అనుకునట్టు నేను single కాదు, చిన్నప్పటి నుండి ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా తాను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు, graduation అయ్యాక ఇంటిలో మా విషయం చెప్పి పెళ్లి చేసకుందాం అనుకుంటున్నాం..

ఇంకా అబ్బాయి “ఇప్పటివరకు నీ ఆలోచనలతో సతమతమవుతూ, పిచ్చోడిలా నీ ఆలోచనలతో బ్రతికేస్తున్నా.. ఇంత కాలం దీని అర్ధం ప్రేమ అనుకున్న కానీ ఇప్పుడే తెల్సింది అది కేవలం నా ప్రేమ మాత్రమే అని.. అయిన bday ముందురోజు night కాల్ చేసి రేపు రావడం కుదరదు అని చెప్పిన అమ్మాయి, తరువాత రోజు నాకు ఇష్టమయిన saree కట్టుకుని surprise ఇస్తే.. అది నా మీద ఇష్టం అని అనుకోవడంలో తప్పు ఏమయినా ఉందా??

“అవును నిజమే.. మొన్న నువ్వు తాగి నేనంటే ఇష్టం అని చెప్పిన రోజే నితో ఇంకా మాట్లాడకుడదు, నిన్ను ఇష్టపడటం లేదు అని చెప్పాలి అనుకున్నా.. కాని తరువాత రోజు అసలు ఏమి తెలియనట్టు ఉంటే నాకేం మాట్లాడాలో తెలియయలేదు.. మొన్న bday కి నేను రాను అని చెప్పిన తరువాత కూడా నాకోసం చూస్తూ బాధపడుతున్నావ్ అని వేరే వాళ్ళు కాల్ చేస్తే ఇంకా నీకు happiness ఇద్దాం అని అలా ready అయ్యా.. అంతేగానీ నువ్వంటే ఇష్టమో ఇంకేదో కాదు..ఇంకా అంతా నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పా.. నా వెనుక తిరిగి ని టైమ్ వృధా చేసుకోకు.. నేను వెళ్తున్న bye..” అని చెప్పి వెళ్ళిపోయింది..

అది విన్న అబ్బాయికి కూడా ఏమి మాట్లాడాలో తెలియడం లేదు.. బాధతో ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు.. కళ్ల నుండి కన్నీళ్ళు వస్తున్నాయి.. ఇంకా అమ్మాయి రూమ్ కి వెళ్ళి బాగా ఆలోచిస్తుంది.. ఏమి చేయాలో అని.. కొంచెం సేపు తరువాత ఇంకా ఆ అబ్బాయితో మాట్లాడటం తగ్గించేయాలి అనుకుంది.. కాని ఆ నిర్ణయం వలన అబ్బాయి లైఫ్ ఎలా మారుతుందో అని ఆలోచించలేక పోయింది..


thank you for reading

Uma


continuous to AA -05 : read all parts for better understanding of the story....You will definitely love the story by the time of ending.... Need your response in comments...

Commenti


Post: Blog2 Post
bottom of page