top of page

అమ్మాయి & అబ్బాయి - 08

AA - 08

       Reason Behind compromising in Abbayi’s Love:

continued from previous AA - 07

ఇంకా తాగిన మత్తులో పొద్దు పొద్దున్నే అబ్బాయి, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.. అమ్మాయి వాళ్ళ నాన్న అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళాడు... కొంచెం సేపు మాట్లాడుకున్న తరువాత అమ్మాయి వాళ్ళ నాన్న “ ఏంటి బాబు! ఏదయినా పని మీద వచ్చావా” అని అడిగాడు.. అప్పుడు అబ్బాయి “ అంటే అది.. చిన్న పనిమీద వచ్చాను.. అమ్మాయికి పెళ్లి fix అయ్యిందని విన్నాను.. దాని గురుంచి మాట్లాడుదమని..” అంతలోనే నాన్న “ అవును బాబు! అమ్మాయి ఈ  మధ్యనే చెప్పింది.. ఒక అబ్బాయిని ఇష్టపడుతున్న అని.. ఇంకా తన ఇష్టం కాదనలేక ఒప్పుకున్న” అన్నాడు.. “ ప్రేమించ అనగానే.. అలా ఎలా ఒప్పుకున్నారు.. చుట్టూ ఉన్న సమాజంలో మీకంటూ ఒక పరువు ఉంటుంది గా” అని అబ్బాయి అడిగాడు... “ అవును బాబు! నువ్వు చెప్పింది నిజమే.. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం నువ్వు చెప్పిన సమాజంకి భయపడి నా చెల్లెలి ప్రేమని ఒప్పుకోలేదు..”

“ చిన్నప్పటినుండి అల్లారుముద్దుగా పెంచుకున్న నా చెల్లెలు వేరే అబ్బాయిని ఇష్టపడుతున్న అని నా అనుమతి కోసం వస్తే చుట్టూ ఉన్న సమాజంలో నా గౌరవం పోతుంది అని ఒప్పుకోలేదు.. కంటికిరెప్పల కాపాడుకున్న ఈ అన్నయ్య ప్రేమ కంటే, కడదాక తోడుంటాను అని చెప్పిన అబ్బాయి ప్రేమ ఎక్కువగా అనిపించి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది.. ఆ రోజు నుండి ఇప్పటివరకు తను తిరిగి వస్తుంది అనే ఆశతో బ్రతికేస్తున్నా.. కాని తను నన్ను వదిలేశాకే అర్దం అయ్యింది, కళ్ళముందు ఉండాల్సిన రక్తసంబంధం, కనుచూపుమేరలో కూడా కనపడనంత దూరం వెళ్లిపోతే జీవితం ఎంత నరకంలా అనిపిస్తుందో అని.. ఇప్పుడు మళ్ళీ నా కూతురు విషయంలో కూడా అదే జరగితే తట్టుకునే శక్తి నాకు లేదు.. అందుకే తనకి ఇష్టమయిన అబ్బాయితోనే తన పెళ్లి చేయాలి అనుకున్నా.. మొదటిసారి నువ్వు మా ఇంటికి వచ్చి వెళ్ళినాక మా అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్న కాని ఇప్పుడు నా కూతురు ఇష్టపడిన వాడికే ఇచ్చి చేయాలనుకుంటున్నా..” ఇది విన్న అబ్బాయికి ఏమి మాట్లాడాలో తెలియక, అసలు వచ్చిన పనికూడ మర్చిపోయి, ఏదో ఆలోచిస్తున్నాడు..

బాబు! ఒక ఆడపిల్ల తండ్రిగా ఒక చిన్న request.. ఇంకెప్పుడు మా ఇంటివైపు రాకు.. నిన్ను చూసిన ప్రతిసారి నిన్ను అల్లుడిగా పొందలేకపోయాను అనే బాధ నన్ను కలచివేస్తుంది అని చేతులు జోడించి దండం పెట్టాడు.. నేనేమీ నాకుతుర్ని సమర్దించుకోవడానికి కథలు చెప్పడం లేదు.. నేను చెప్పినవి నిజమో కాదో వేళ్లీ మీ అమ్మనే అడుగు.. ఎందుకంటే నేను చిన్నప్పటినుండి కాంటిరెప్పల కాపాడుకుంటూ వస్తే, నన్ను కాదు అని నచ్చిన అబ్బాయితో నా గుమ్మం దాటిన నాచెల్లి వేరేవరో కాదు, మీ అమ్మే.. తను నన్ను మర్చిపోయి సంతోషంగా ఉంది కాని తనని తలచుకోకుండా మేము ఏ రోజు ఉండలేదు.. నేను పెళ్లి చేసుకున్న భార్య నా పక్కనే ఉన్నా, మా ఇద్దరి ప్రేమకి నిదర్శనం అయిన నా కూతురు నా కళ్లముందే తిరుగుతున్న, ఏనాడూ నేను సంతోషంగా జీవించలేదు.. ఇప్పుడు నేను నా కూతురితో “నువ్వు నా చెల్లి కొడుకివీ” అని చెప్తే కచ్చితంగా నా సంతోషం కోసం నిన్ను పెళ్లి చేసుకుంటుంది కాని తను మాత్రం బాధ పడుతూనే ఉంటుంది.. కాబట్టి దయచేసి మా జీవితంలోకి మళ్లీ రావొద్దు” అని గుమ్మంవైపు చేయి చూపించాడు.. ఇదంతా వింటున్న అమ్మాయివాళ్ళ అమ్మకూడ కన్నీళ్లతో ఏమి మాట్లాడలేక చూస్తూ ఉండిపోయింది.. ఇన్ని విషయాలు తెలుసుకున్న అబ్బాయికి తాగింది మొత్తం దిగిపోయింది... ఏమి చేయాలో అర్ధం అవ్వలేదు.. ఇంకా బయట వర్షం పడుతున్న సరే తడుస్తూ ఇంటికి వెళ్ళాడు..

సాయంత్రం అవుతుంది.. వర్షం తగ్గింది.. సన్నగా వర్షపు నీటి దారాలు ఇంటిపైనుండి కిందకి పడుతున్నాయి.. నీరసం గా వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుండిపోయాడు.. అమ్మ వచ్చి “ ఏమయింది రా! ఇలా డల్గా ఉన్నావు” అని అడిగింది.. “ ఏం లేదమ్మా ! ఇప్పుడే మీ అన్నయ్యని కలిసి వస్తున్నా” అన్నాడు.. “అసలేమయింది అమ్మ.. మనకోసం ఒక family ఎదురుచూస్తున్న, ఇక్కడ ఇలా అనాథళ్ళ బ్రతకాల్సిన అవసరం ఏముంది?” అని అడిగాడు.. బదులుగా “ మీ నాన్న ప్రేమే కావాలి అని, అప్పుడు ఆ ఇంటిలో మనుషుల్ని, వాళ్ళ ప్రేమలని వదిలేసి వచ్చాను, ఇప్పుడు ఆయన లేడు అని మళ్ళీ ఆ ఇంటికి వెళ్లడానికి మొహం చెల్లలేదు.. అందుకే మీ నాన్న చనిపోయాక నా కష్టం మీద నిన్ను పెంచుతూనేవచ్చా అంతేగాని ఆ ఇంటి సహాయం మాత్రం కొరలేదు.. ఇవన్నీ మొన్న నీ వెలికి మా అన్నయ్య ఉంగరం చూసినప్పుడే చెప్పాలనుకున్న కాని సమయం ఇప్పుడు వచ్చింది” అని ఎడుస్తూనే ఇంటిలోపలికి వెళ్ళింది..

అబ్బాయి, అమ్మాయి వాళ్ళ నాన్నకి కాల్ చేసి “ మావయ్య! ఇప్పటివరకు ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన అన్నయ్యని మోసం చేసిన చెల్లి గురుంచి మీరు చెప్పారుగా.. పెళ్లి అయిన మూడు సంవత్సరాలకే భర్తని పోగొట్టుకుని, సరిగ్గా రెండు సంవత్సరాలు కూడా నిండని ఒక బాబుని పట్టుకుని ఏమి చేయాలో తెలియక, ఎవరిని సహాయం అడగాలో తెలియక, తోబుట్టువుని అడగలేక, అడిగినవాళ్ళు దగ్గరనుండి సహాయం లేక, చాలా ఇబ్బంది పడుతూ, నన్ను ఇంతకాలం పెంచుకుంటూ వచ్చిన తల్లీ గురుంచి చెప్పడానికి చేశా.. తన రక్తంలో ఉన్న ఆత్మాభినం మీకు phone చేయనివ్వలేదు కాని మీరు ఇచ్చిన విశ్వాసం తన కాళ్ళ మీద తనని నిలబడేలా చేసింది.. తనకి కూడా మిలానే ఒక తోబుట్టివిని కోల్పోయాను అనే బాధ ఉంది.. మీకు కనీసం ఇంట్లో వాళ్ళతో చెప్పుకునే అవకాశం ఉంది.. కాని నా పిచ్చి తల్లికి ఆ అవకాశం కూడా లేదు.. తనకోక కుటుంబం ఉంది అని ఇప్పటి వరకు నాక్కూడా చెప్పలేదు.. తనలో తానే అన్నీ భరిస్తూ నన్ను ఈ స్తాయికి తీసకోచ్చింది..  నేనేమీ మికు మా అమ్మ గొప్పతనం గురుంచి చెప్పడం లేదు.. ఒక్కసారి తన జీవితం గురుంచి మీకు తెలిస్తే, మీ ఆలోచనలో చిన్న మార్పు వస్తుంది అనుకుంటున్నా.. మీ అమ్మాయిని చూసిన first dayనే తనని ఇష్టపడ్డా కాని మీ మాటలు విన్నాక.. ఒకప్పుడు నా తల్లీ తన స్వార్ధం కోసం చేసిన పనికి, అటు మీరూ, ఇటు నా తల్లీ కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు.. ఇప్పుడు నా స్వార్థం వలన అలాంటి పరిస్థితి నేను ఇష్టపడిన అమ్మాయికి రాకూడదు అని నా ప్రేమని వదిలేస్తున్నా.. ఎలాగూ మీ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు.. atleast తన జీవితాన్ని అయిన happyగా ఉంచండి.. తనకి నేను, నా ఫ్యామిలీ గురుంచి చెప్పకండి..  ఇంకెప్పుడు మీ జీవితాల్లోకి రాను... తనని మాత్రం happyగా చూసుకోండి.. తనకి నచ్చిన అబ్బాయికే ఇచ్చి పెళ్లి చెయ్యండి..” అని చెప్పి కాల్ cut చేశాడు..

thank you for reading

Uma


continuous to next AA -09 : I hope you loved the story till this part.. Need your response in comments... Any Guess About Next Part... comment it

Comments


Post: Blog2 Post
bottom of page