top of page

అమ్మాయి & అబ్బాయి - 07

AA - 07

Multiple Shocks Experienced By Abbaaayi ::

continued from previous AA - 06..

అప్పటినుండి అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది... అబ్బాయి ఆ రోజు కోపంలో తన దగ్గర నుండి వచ్చేసిన దానికి చాలా సార్లు sorry చెప్తూనే ఉన్నాడు...  అమ్మాయి కూడా  సరే అని అంది.... అలా రోజులు గడుస్తున్నాయి.. మెల్లగా ఫైనల్ year కి వచ్చేశారు..  వీళ్లిద్దరి మధ్య దూరం కూడా పెరుగుతుంది... ఒకరోజు అబ్బాయి " అమ్మాయి నా mood ఏమి బాగోలేదు.. నీతో time spend చెయ్యాలని ఉంది.. అలా lunch కి వెళ్దామా" అని అడిగాడు.. కానీ అమ్మాయి మాత్రం " sorry రా!! నాకు రేపు submit చెయ్యాల్సిన assignments ఉన్నాయి.. రాసుకుంటున్నా room lo .. తరువాత ఎప్పుడైనా వెళ్దామా!!" అని అంది... అబ్బాయి కూడా సరే అని అలాగే పడుకున్నాడు... అంతలో అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి "పదరా బయటకి వెళ్దాం" అన్నారు.. అబ్బాయి నాకు interest లేదు మీరు వెళ్ళండి అని అన్నాడు... కానీ friends మాత్రం బలవంతంగా వాడిని రెస్టారెంట్ కి తీసుకెళ్లారు... సర్లే అని వెళ్లి order చెప్పి కూర్చున్నారు.. అబ్బాయి మాత్రం silent గానే mood off లో కూర్చుని ఉన్నాడు... కానీ దూరం గా ఉన్న ఒక table దగ్గరనుండీ ఒక అమ్మాయి నవ్వులు, మాటలు  వినిపించాయి... ఆ మాటలు తెలియకుండానే అబ్బాయిలో ఏదో తెలియని ఆనందాన్ని ఇస్తున్నాయి... అబ్బాయి వెంటనే ఆ అమ్మాయి ఎవరో చూశాడు.. చూసి ఆశ్చర్యపోయాడు.. 

Assignmets రాయాలి అని చెప్పిన అమ్మాయి ఇక్కడ ఇలా కనిపించేసారికి చాలా కోపం వచ్చింది.. వెంటనే తన దగ్గరకి వెళ్ళాడు.. ఆ అమ్మాయి అబ్బాయిని చూసి హే నువ్వేంటి ఇక్కడ అని ఇంకేదో చెప్పడానికి ట్రై చేస్తుంది.. కాని అబ్బాయి మాత్రం అవ్వన్నీ వినకుండా “ ఇదేనా నువ్వు రాస్తున్న assignments.. నేను పిలిస్తే assignments అన్నావ్! ఇక్కడ ఏమి చేస్తున్నావ్ అని అడిగాడు..” అని కోపం గా అడిగాడు.. అమ్మాయి మాత్రం “ ఎందుకిలా అరుస్తున్నావ్! నా friends ముందు నా పరువు తీయకు” అని మెల్లగా చెప్తుంది.. కాని అబ్బాయి మాత్రం అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోయాడు.. తన వెనుకే అమ్మాయి కూడా వెళ్ళిపోయింది.. అబ్బాయి కోపంగా దగ్గరలో ఉన్న పార్క్ లో ఒక బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు.. అమ్మాయి దగ్గరికి వేళ్లీ “ ఏమయ్యింది నీకు ఇలా behave చేస్తున్నావ్.. ఒకే నాదే తప్పు నువ్వు పిలిచినప్పుడు రాలేదు.. కాని తర్వాత మా friend కాల్ కేసి తన bday treat ఇస్తున్న రమ్మన్నాడు.. వెళ్ళా.. ఆ మాత్రం తిరిగే freedom నాకు లేదా.. అలా అనుకుంటే అప్పుడు ని bday కి కూడా నేను రావడం కూడా తప్పే అవుతుంది..” అని మాట్లాడింది..  ఇంకా అబ్బాయి convince అయ్యి “నాదే తప్పు.. నీ life నీ ఇష్టం.. నేనే ఎక్కువగా involve అవతున్న నువ్వెళ్ళి bday పార్టీ లో enjoy చేయి అని తనని restaurant దగ్గర దింపేశాడు.. తను వెళ్ళిపోయింది.. కాని అబ్బాయి మాత్రం ఏదో ఆలోచిస్తూ రూమ్ కి వెళ్ళిపోయాడు.. ఇంకా నైట్ పడుకున్నాడు..

Morning అబ్బాయి వాళ్ళ friend (అమ్మాయికి అబ్బాయికి common friend ) కాల్స్ చేస్తూనే ఉంది.. వీడు చిరాకుగా మళ్ళీ మళ్ళీ చేస్తుంటే lift చేశాడు. “ఏంటే నువ్వు.. ఇంత పొద్దున్నే కాల్ చేసి దొబ్బుతున్నవ్” అని అన్నడు.. “ దొబ్బడం కాదురా ఎదవా!  Important విషయం చెప్పాలి.. కలుద్దాం” అంది.. సరే అని juice shop కి వెళ్ళి కూర్చున్నాడు.. friend కూడా వచ్చింది.. “ఎంటే పొద్దుపొద్దున్నే ఫోన్ చేశావ్” అని అన్నాడు.. తను ఏదో చెప్పడానికి ఇబ్బందిపడుతూ, బాగా tension పడుతూ ఉంది.. సర్లే relax అవ్వుతూ ఉండు అని order చెప్తూ ఉండగా “ అమ్మాయికి పెళ్లి fix అయ్యిపోయింది రా” అని అంది.. ఒక్కసారిగా అబ్బాయికి నోటిమాట ఆగిపోయింది.. “ఏమి మాట్లాడుతున్నావే? ఈ timelo జోకులు వేయకు” అంటూ waiter కి ఆర్డర్ చెప్పి పంపించేశాడు.. “ జోకులు కాదురా! నిజం! రాత్రే నాకు తెల్సింది.. తను చిన్నప్పటినుండి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, ఆ అబ్బాయికి ఇప్పుడు మంచి జాబ్ & salary అంటా.. ఇవ్వన్నీ వాళ్ళ నాన్నకి చెప్పింది.. మొదట్లో ఒప్పుకోలేదు కాని చాలా కష్టపడి ఒప్పించింది.. ఈ విషయం నీకు ఎలా చెప్పాలా అని నేను చాలా ఆలోచించా.. ఇప్పుడు కూడా తను పెళ్లి ఫిక్స్ అయ్యింది అని అందరికీ పార్టీ ఇస్తుంది.. నీకు కూడా కాల్ చేస్తా అంది” అని చెప్పింది

ఇదంతా విని ఏమి అర్దం కాని అబ్బాయి mobile table మీద పెట్టి facewash కి వెళ్ళాడు. అంతలో ఫోన్ రింగ్ అయ్యింది.. “my life ❣️❣️..” అనే నెంబర్ నుండి కాల్ వస్తుంది.. అబ్బాయి వచ్చేసరికి అది ఆగిపోయింది.. చూసి తిరిగి కాల్ చేశాడు.. “ హలో! అబ్బాయి.. నాకు చాలా happy గా ఉంది... మా నాన్న నేను ప్రేమించిన అబ్బాయితో పెళ్ళికి ఒప్పుకున్నారు.. అందరికీ party ఇస్తున్న.. నువ్వు కూడా రావాలి” అని అంది.. అబ్బాయికి ఏమి చెప్పాలో తెలియక “ congrats” అని చెప్పి కాల్ cut  చేశాడు... నైట్ కొంచెం ఎక్కువ తాగేసి, mutualfriend కి call చేసి “ నేను రేపు అమ్మాయి వాళ్ళ నాన్నకి కలవడానికి వెళ్తున్నా, వెళ్లీ అమ్మాయి మీద నాకున్న ప్రేమని అర్ధమయ్యేల చెప్తా” అన్నాడు.. తనేమో “ ఎలాంటి పిచ్చ పిచ్చ వేషాలు వేయకు.. తన life అయిన హ్యాపీగా ఉండనివ్వు” అని పూర్తిగా చెప్పేలోపు అబ్బాయి callcut చేశాడు.. ఇంకా రేపు ఏమి జరుగుతుందో అని భయంతోనే పడుకుంది..  

thank you for reading

Uma


continuous to next AA -08 : I hope you loved the story till this part.. Need your response in comments...

Comments


Post: Blog2 Post
bottom of page