top of page

అమ్మాయి & అబ్బాయి - 10

AA - 10

        Move on Of Abbayi from Ammayi’s life By Accepting Reality:

continued from previous AA - 09

Next day తనని కలవడానికి వెళ్ళాడు.. long hair.. short beard.. white shirt.. black watch.. అంతా బాగానే manage చేశాడు కాని faceలో బాధ మాత్రం అలానే ఉంది.. అబ్బాయి కంటే ముందే అమ్మాయి వచ్చి wait చేస్తూ ఉంది.. అబ్బాయిని చూసి “ హే ఏంట్రా ఇంత stylish గా మారిపోయావ్.. మొత్తం look మార్చేశావ్ గా.. బాగున్నావ్” అంది.. ఇలాంటివి విని విని విసుగొచ్చిన అబ్బాయి “ ఏదో మాట్లాడాలి అన్నావ్? ఏంటి?” అని అడిగాడు.. ఇంకా అమ్మాయి “ అసలేమయింది నీకు.. చాలా రోజులయ్యింది కలిసి, మాట్లాడి..” అని ఇంకా మాట్లాడుతూనే ఉంది.. అబ్బాయి మాత్రం silent గా ఉన్నాడు.. “ రే! నిన్నేరా అడిగేది.. ఏదోకటి మాట్లాడు.. చెప్పు” అంది..

ఇంకా అబ్బాయి “ఏమి చెప్పమంటావ్! నువ్వు అంటే నాకు చాలా ఇష్టం.. ఇప్పటివరకు నీకు చాలా సార్లు చెప్పా.. may be నేను నీకు చెప్పే చివరిక్షణం ఇదే అవ్వొచ్చు.. ఎందుకంటే  మనం కలిసి జీవించలేము అని తెల్సుకోవడానికి ఇంతకాలం పట్టింది.. ఇవన్నీ నీకు తెల్సి కూడా ఇంకా మాట్లాడు, చెప్పు అంటే నేనేమీ చెప్పాలి” అంటూ బాధ పడుతున్నాడు.. అప్పుడు అమ్మాయి “అది కాదు అబ్బాయి.. నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పడం కష్టమే కాని నీకంటే ముందే నేను వేరే అబ్బాయిని ఇష్టపడ్డా.. అందుకే ని ప్రేమని accpet చేయలేపోతున్నా.. కాని నన్ను ఇంతలా ఇష్టపడిన అబ్బాయిని వదులుకోవడం నాకు నచ్చడం లేదు. కాని Im already committed, ఈ విషయం నీకు ముందే చెప్పా, నువ్వు అవ్వన్నీ పట్టించుకోకుండా ఇంత కాలం నన్ను మాత్రమే ఇష్టపడుతూ నువ్వు ఇలా నీలోనే మునిగిపోయావు.. అందులో నా తప్పు ఏమి లేదు” అని చాలా సున్నితంగా మాట్లాడుతుంది..

మళ్ళీ అబ్బాయి “నువు చెప్పావు, కాని ఇంత కాలం నువ్వే కావాలని, నా ప్రేమని  ఎలాగాయిన గెలిపించుకోవాలని ఇప్పటివరకు చూసా కాని ఇప్పుడు జరుగుతున్న వాస్తవాన్ని accept చేయడానికి  కొంచెం కష్టంగా ఉంది కాని నువ్వు భయపడకు నిన్ను ఇబ్బంది పెట్టేల నేను ఏమి చెయ్యను, కాని నాకు ఒక్క విషయం చెప్పు” అని అంటుండగానే అమ్మాయి వెంటనే “ఏమిటో చెప్పు రా, ఒక్క లవ్ తప్ప ఇంకేమయిన అడుగు నీకోసం చేస్తా..” అని అంది.. అది విన్న అబ్బాయి చిన్న నవ్వుతో “ప్రతి అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి నోటి నుండి ఒకటే సమాధానం వినాలి అనుకుంటాడు, ఇప్పుడు నిన్ను కూడా అదే అడుగుతున్న, నీ life లో నువ్వు ప్రేమిచ్చిన అబ్బాయికంటే ముందే నేను పరిచయం అయ్యి ఉంటే నన్ను నిజంగానే Love చేసేదానివేనా ?? ఇదేమి నిన్ను ఇబ్బంది పెట్టడానికి అడగడం లేదు... నాకు, నా ప్రేమకి ఎంత value ఉందో తెలుసుకోవడానికి అంతే..” అన్నాడు.

అమ్మయి కొంచెం ఆలోచిస్తూ.. “ అలా ఎలా అడుగుతున్నావు అబ్బాయి.. ఈ విషయానికి నేనే కాదు అసలు ఏ అమ్మాయి కూడా సమాధానం చెప్పలేదు, అంటే వేరేలా కాదు, may be నీ ప్రేమని నేను experience చేయలేకపోయాను కాబట్టి దాని విలువ నాకు తెలియడం లేదు, అలాంటిది ఈ రోజు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేను రా, incase చెప్పిన ఆ సమాధానికి value లేనట్టే” అని చెప్పింది.. అది విన్న అబ్బాయి “బాగానే చెప్పావు, కాని నీ నుండి నేను వేరు అవ్వాలి అంటే నాకూడ ఒక రీసన్ కావాలిగా, నాకయితే అలాంటిది ఏమి దొరకడం లేదు, ఎందుకంటే నీ నుండి దూరం అవ్వడం అంటే నా నుండి నన్ను దూరం చేస్కోవడంతో సమానం అని నేను ఫీల్ అబతున్న కాబట్టి.. ఒక్క solid రీసన్ చెప్పు ఎందుకు నీలాంటి అమ్మాయిని నా లైఫ్ లో ఉండకూడదు అని అనుకోవడానికి” అన్నాడు... అది విన్న అమ్మాయికి కోపం వచ్చి “అబ్బాయి.. నువ్వు ఎక్కువ ఆలోచించకూ.. అయిన తప్పు అంతా నాదే నువ్వు నాకు propose చేసినప్పుడే ఇష్టం లేదు అని చెప్పి ఉండాల్సింది కాని నువ్వు అర్దం చేస్కుంటావని ఎవరికి తెలియని నా relationship గురుంచి నీకు చెప్పా, కాని నువ్వేమో ఇలా పిచ్చి పిచ్చి గా behave చేస్తున్నావ్.. ఇంకా నా వల్ల అయితలేదు, దీనికి ఈ రోజే ఒక end point పెట్టాలి, ఏం చేద్దామో చెప్పు” అంది..

అది విన్న అబ్బాయి బాధతో  “అలా ఎలా మాట్లాడుతున్నావ్ నువ్వు, నేను చివరిక్షణం వరకు నీతోనే అనుకుని మాట్లాడుతుంటే నువ్వేమో ఈ క్షణమే చివరి క్షణంల మాట్లాడుతున్నావ్, అయిన నేను కూడా నా ప్రేమని చెప్పకుండా ఉండాల్సింది అది చెప్పిన దగ్గర నుండే ఇలా నువ్వు behave చేస్తున్నావ్, atleast నీకు చెప్పకుండా ఉంది ఉంటే కొన్ని memories నాకు మిగిలి ఉండేవి” అన్నాడు.. అది విన్న అమ్మాయి “ memories ఏ గా నీకు కావాలి, ఏమి కావాలి చెప్పు? నేను definte గా ఇస్తా.. నా వల్ల అయ్యింది ఏమయినా సరే..” అని హ్యాపీ గా అంది.. వెంటనే అబ్బాయి “ఇప్పుడు వద్దు రా, నేను మాత్రమే నిన్ను ఇష్టపడుతున్న అని తెల్సినప్పుడు ఆ memories తీస్కున్న ఒక అర్ధం ఉంది, కాని నీకు నేనంటే ఇష్టం లేదు అని తెల్సినక కూడా ఆ memories తీసుకుంటే, అవి చూసినప్పుడల్లా నీ మీద ప్రేమ కన్నా నువ్వు నన్ను ప్రేమించలేదూ అనే బాదే ఎక్కువ అవుతుంది..” మళ్ళీ అమ్మాయికి చిరాకు వచ్చి “ హే అలా అంటున్నావ్ ఏంటి, నా వల్ల ఎవరు బాధ పడకూడదు అని నీకోసం ఇంతలా చేస్తున్న. కాని నువ్వేమో ఇలా అంటున్నావ్, ఒక విషయం గుర్తుంచుకో నేను ఇష్టపడిన అబ్బయిని మాత్రమే పెళ్లి చేస్కుంటా, ఎందుకంటే వాడేగాని నీ place లో ఉంటే నా సంతోషం కోసం నేను ఏమి చెప్పిన చేస్తాడు, నీలా ఇలా విసిగించడు.. అందుకే వాడి గురుంచి ఇంటిలో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంటున్న” అని అంది..

ఆ మాటలు విన్న అబ్బాయికి ఇంకా మాట్లాడి ఉపయోగం లేదని అర్ధమయ్యింది.. “సరే నా ప్లేస్ లో వాడే ఉంటే నీ సంతోషం కోసం ఏమి చేయమని అడుగుతావ్??” అని అడిగాడు... ఇంకా అమ్మాయి  “ఏముంది నన్ను ఇంతలా ప్రేమిచ్చిన అబ్బాయిని కేవలం ఒకటే అడుగుతా.. graduation కంప్లీట్ అయ్యేలోపు ఒక మచి జాబ్ తెచ్చుకుని, తన జీవితాన్ని నా దగ్గరే ఆగిపోకుండా తనని సంతోషాపరిచే ఇంకో మంచి అమ్మాయిని పెళ్లి చేస్కోవాలి” అని సమాధానం ఇచ్చింది.. అది విన్న అబ్బాయి కోపం వచ్చి, అమ్మాయి ముందే సిగరెట్ కాలుస్తూ.. “నువ్వు చెప్పిన వాటిలో రెండవది నేను చేయలేకపోవచ్చు కాని మొదటిది కచ్చితం గా చేస్తా,,,  చేశాకే నిన్ను మళ్ళీ నేను కలుస్తా.. !!!” అని అక్కడినుండి వెళ్లిపోబోతుంటే, అమ్మాయి చిటికేసి వెనక్కి పిలిచి “  ఒకప్పుడు నాకోసం సిగరెట్ మానేస్తా అని ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టావ్.. ఇప్పుడు ఈ మాట ఇచ్చావ్.. కచ్చితంగా నిలబడతావా? లేక ఆ మాటల్లాగే ఇది కూడా గాల్లోనే కలిపేస్తావా?” అని అడిగింది..  అబ్బాయికి కోపం వచ్చి “ ఆ రోజు నీకు మాట ఇచ్చినప్పుడు, మళ్ళీ మొదలుపెట్టాల్సి వస్తే అది నీవల్లే అవుతుంది అని కూడా చెప్పా.. may be నీకే అవేమీ గుర్తులేవేమో.. (అని సిగరెట్ పడేస్తూ.. చిన్నగా నవ్వుతూ..) ఇప్పుడు కూడా నువు ఈ మాట అన్నావ్ కాబట్టి నేను వదిలేయడం లేదు.. ఇంకెప్పుడు నీ మనసులో ఇలాంటి ఆలోచన రాకూడదు కాబట్టి వదిలేస్తున్న” అని కోపంగా అక్కడినుండి వెళ్ళిపోయాడు..

thank you for reading

Uma


continuous to next AA -11 : I hope you loved the story till this part.. Need your response in comments... any guess about next part... comment it..

Comments


Post: Blog2 Post
bottom of page