top of page

My Memories With Mine - 03

Updated: Oct 18, 2023

నీ పరిచయం..


.........().......... నీ పరిచయం నాలో ఎంత మార్పు తీసకొచ్చిందో చెప్పడం చాలా కష్టం.. నీకు కూడా తెలియనంత మార్పు నీ వల్ల నా లైఫ్ లో వచ్చింది.. ఆ మార్పు చెప్పడానికి చేసే చిరు ప్రయత్నం మాత్రమే ఇదీ..

కోపం అయిన... ప్రేమ అయిన....

Priority అయిన... preference అయిన...

ఇష్టం అయిన... importance అయిన

బాధ అయిన... సంతోషం అయిన...

ఏదయినా కొన్ని రోజులే..

ఎవరయినా కొంతకాలమే..

కాలాన్ని బట్టి మారిపోతాయి... అవసరాన్ని బట్టి మనిషికి మనిషికి మధ్య ఉన్న బంధం మారిపోతుంది కాబట్టి ఉన్న కొన్ని రోజులు అయిన enjoy చేయాలి అని నమ్మే వ్యక్తి నీ నేను... కానీ నీ పరిచయం నా నమ్మకాన్ని మార్చివేసింది.. కోపం అయిన ప్రేమ అయిన ఉండేది మనసులోనే అని గుర్తు చేసింది... నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత అర్థమయ్యింది, నేను ఇప్పటివరకు achieve చేసింది ఏమీ లేదు అని...

నీతో మాట్లాడిన ఫస్ట్ 3 hours time నా past 13 years educational లైఫ్ ని బాగా disturb చేసింది.. లైఫ్ లో చెప్పుకోదగ్గ achievement ఏమీ లేదని అర్థమయ్యింది.. ఇప్పటివరకు అందరి లైఫ్ నుండి motivate అయ్యాను కానీ నీ లైఫ్ నుండి inspire అయ్యాను.. నేను ఎప్పుడైనా low feel అయినప్పుడు, ఒక్కసారి నీ past struggles, present hardwork, future మీద నీకున్న vision గుర్తుచేసుకుంటే, అవన్నీ నన్ను encourage చేస్తూ, నేను కూడా ఎదొకటి achieve చెయ్యగలను అనే hope ఇస్తున్నట్టు అనిపిస్తుంది... కాని ఒకటి మాత్రం చెప్పగలను, నేను నా futureలో achieve చేసే success ఏదయినా దానికి కారణం నా తల్లిదండ్రుల తరువాత person నువే అవుతావు... Thank you for coming into my life...

నువ్వు నీ గతం గుర్తొచ్చినప్పుడు ఎంత బాధ పడతున్నావో తెలియదు కాని నా పక్కన ఉండి కూడా ఇంకా నీ గతాన్ని తలుచుకుని బాధపడుతున్నావ్ అని నాకు తెల్సినప్పుడు నీకంటే ఎక్కువ నేను బాధ పడుతున్నా.. ప్రతి ఒక్కరి జీవితం వాళ్ళ చేతి గీతల మీద ఆధారపడి ఉంటుంది అని అంటుంటారు,కానీ ఆ మాట విన్న ప్రతిసారి నిన్ను పొందిన వ్యక్తి అరచేతిని చూసి అందులో నిన్ను నానుండి దూరం చేసిన చేతి గీత ఎలా ఉందొ అని చూడాలనిపిస్తుంది.. ఆ చూసే ఛాన్స్ నాకు ఇస్తావా!!!

Unexpected గ నా లైఫ్ లోకి వచ్చావ్...

మనసుకు చాలా దగ్గరయిపోయావ్...

నువ్వు నాతో జీవితాంతం ఉంటావో లేదో తెలియదు గానీ ఆకరి నిమిషం వరకు గుర్తుంటావ్...

నువ్వు లేకపోతే ఎలా అనే ఆలోచన కూడా కష్టం గా ఉంది...

చిన్నప్పటినుండి ఇతరుల ఆనందం కోసం లైఫ్ లో చాలా కోల్పోయా.. అందుకేనేమో ఇప్పుడు నీ ఆనందం కోసం నిన్ను కోల్పోతున్న సంతోషం అనిపిస్తుంది కానీ పెద్ద బాధ అనిపించట్లేదు. నా life చాలా మారిపోయింది, చిన్నప్పుడు ఇష్టమయిన దానికోసం ఏడిచేవాడిని, కాని ఇప్పుడేమో ఇష్టమయిన నువ్వు దూరం అవుతున్న ఏడుపుకన్న ముందు నవ్వు నటించాల్సివస్తుంది. బాధేస్తే ఏడ్చే stage నుండి నవ్వుని నటించే stage కి వచ్చా ,దీనికి అర్ధం బలంగా ఉన్నట్టా ?? లేక కఠినంగా మారినట్టా??

అలసిన మనసుకి లాలనవో..

ఆగిన ఆశలకి రెక్కలు తొడిగే కొత్త కోరికవో

విసిగిన ఆలోచనలకి ఊరట కలిగించే మంత్రానివో

ఎవరివో తెలియదు.. కాని.. ప్రశాంతత కలిగించే..

నేస్తానీవి నువ్వే నా చందమామ...

నాకు మాత్రం నువ్వు ఒక అందని అందమయిన చందమామావే.. అందరిలానే నేను కూడా నిన్ను అందుకోవడానికి చాలా try చేశా కానీ తర్వాత అర్థమయ్యింది, నేనొక పౌర్ణమి రోజు ఎగిసిపడే సముద్ర అలని అని, ఎంత ఎత్తుకు ఎదిగిన చివరికి కిందే పడాలి అని. నాకు నీ మీద సముద్రమంత ఇష్టముంది కాని నీకు నా మీద వాన చినుకంతయిన ఉండిఉంటే నా ప్రపంచం వేరేలా ఉండేదేమో....... ఏదో అప్పుడప్పుడు మన మధ్య దూరం తగ్గుతుంది అంతేగానీ శాశ్వతం గా మనం కలవలేము అని తెల్సిన ఒకటి మాత్రం ఆడాగాలి అని ఉంది, " just be with me " అని, నిన్ను ఇంతకముందే అడిగా.. కాని ఇప్పుడు మళ్ళీ అడుగుతున్న ఎందుకంటే..

నువ్వు చేసే ప్రతి చిన్నపని నాకు ఆనందాన్ని ఇస్తుంది,

నీ ప్రతి పలుకు నాకు ఒక కొత్త ప్రేరణ ని ఇస్తుంది,

నీ ప్రతి ఆలోచన నాకొక గొప్ప దారిని చూపిస్తుంది..

నువ్వు తీసుకునే ప్రతి decision నా లైఫ్ ని టర్న్ చేస్తుంది..

నిన్ను కలిసిన ప్రతిసారి నాకొక కొత్త variation చూపిస్తున్నావ్. బ్రతుకు అంటే నీల బ్రతకాలేమో అని అనిపించెంత happy ఉన్నట్టు అనిపిస్తున్నావ్. అయిన నీలా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని ప్రతి క్షణం బాధపడుతూ ఉంటున్నా.. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మన ముందు బాగానే మాట్లాడుతూ మనం లేనప్పుడు మన గురుంచి కొంచెం differentగ ఉంటున్నాసరే వాళ్ళని వదులుకోకుండా వాళ్ళనే ఇంకా నీ best friends అని చెప్పుకుంటూ తిరగడం నాకు చాలా నచ్చింది...

కాని నాకు ఇంకా గుర్తుంది.. కేవలం నిన్ను చూడటం కోసం నీ department చుట్టూ తిరగడం, కేవలం నితో ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు అని నీ exam hall బయట గంట పైగా ఎదురుచూడటం, నువ్వు బయటకనిపిస్తే safe గా మళ్ళీ రూమ్ కి వెళ్ళావా లేదా అని నా పక్కన వారిని విసిగించటం.. ఇన్ని చేసిన సరే, చివరికి నీ ప్రేమ పొందటం ఏమో గాని, atleast నీ స్నేహాన్ని కూడా పొందలేకపోయానేమో అనిపిస్తుంది..! "నా life లో నువ్వుండాలి అని నేను కోరుకున్నట్టే , నువ్వు కూడా నీ life లో నేను ఉండాలి అని కోరుకుంటే బాగుండేదేమో, హాయిగా మనం కలిసి ఉండేవాళ్లం.."

నువ్వు ఎప్పుడు ఒకటి అడుగుతూ ఉంటావ్ గా, ఇలానే ఒంటరిగా ఉంటే final year లో ఒక్క signature memory కూడా నా t - shirt మీద ఉండదు అని, కాని నాకు మాత్రం పైకి నా ముందు నటించి వెనుక రంగులు మారుస్తున్న persons యొక్క signature memories అవసరం లేదు, మనస్పూర్తిగా నన్ను ఇష్టపడే వ్యక్తి atleast ఒకరయిన వచ్చి sign చేస్తే చాలు.. నువ్వు definiteగా sign చేస్తావని expect చేస్తున్నా.. !!


Thank You For Reading

Uma

can I continue next part

  • interesting, continue

  • not interesting , discontinue

note: based on your response like voting and comments my next part will be uploaded...

Comentarios


Post: Blog2 Post
bottom of page